breaking news
annamayya district Latest News
-
పకడ్బందీగా స్వామిత్వ సర్వే
నిమ్మనపల్లె : ప్రజల నివాస ప్రాంతాలకు సంబంధించి తమ ఆస్తిపై పూర్తి హక్కు కల్పించేలా చేపట్టిన స్వామిత్వ సర్వే పకడ్బందీగా పూర్తి చేస్తున్నట్లు మదనపల్లె డీఎల్పీఓ నాగరాజు తెలిపారు. గురువారం మండంలోని రాచవేటివారిపల్లె పంచాయతీ ఎగువమాచిరెడ్డిగారిపల్లె, బండ్లపై, ముష్టూరు, కొండయ్యగారిపల్లె తదితర గ్రామాల్లో సచివాలయ సిబ్బంది చేపట్టిన స్వామిత్వ సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే నిర్వహణపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామిత్వ స్కీమ్ గ్రామాల్లో మెరుగైన సాంకేతికతతో కూడిన సర్వే, మ్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన పథకమన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక సాధికారత, స్వీయ సాధికారతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంగా 2020 ఏప్రిల్ 24న స్వామిత్వ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారన్నారు. 2021 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా 6.62 లక్షల గ్రామాలను ఈ పథకంలో సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఆస్తి డేటాను సేకరించేందుకు డ్రోన్లతో సహా వివిధ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈనెల పదో తేదీలోగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు అవసరమైన చర్యలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శునకాలు పట్టేస్తున్నాయ్..!
● బి.కొత్తకోటలో వెంటాడి కరుస్తున్న కుక్కలు ● ఒక్కరోజే 35 మంది ఆస్పత్రిపాలు ● నాలుగు రోజుల్లో 60 మందికి పైనే ● ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయం బి.కొత్తకోట : స్థానిక నగర పంచాయతీ పరిధిలో గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో గుంపులుగా పట్టణమంతా సంచరిస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. ప్రతి రోజూ కనిపించిన వారినల్లా కరచి ఆస్పత్రి పాలు చేస్తున్నాయి. ఇలా ఒకరిద్దరిని కాదు ఏకంగా పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గురువారం ఒక్కరోజే 35 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. సాయంత్రం స్థానిక మీడియా ప్రతినిధి చిట్టా రామకృష్ణారెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కల గుంపు దాడి చేసి కాలిపై కరిచాయి. అంతటితో ఆగని కుక్కలు వరుసగా కనిపించిన వారందరిపైనా దాడి చేస్తూ కరుస్తూ వెళ్లాయి. స్థానికులు, స్థానికేతరులైన 35 మంది వరకు బాధితులయ్యారు. వీరిలో చిట్టా రామకృష్ణారెడ్డి, డి.రామకృష్ణారెడ్డి, డి.రమాదేవి, రెడ్డెమ్మ, కృష్ణారెడ్డి, లక్ష్మిదేవి, వెంకటమ్మ, కృష్ణమూర్తి, నరసమ్మ, వెంకటస్వామి, విష్ణువర్దన్, ఎర్రమ్మ, రమాదేవి, బయ్యన్న, భాగ్యశ్రీ, కిట్టన్న, పద్మావతి, ఎం.వెంకటమ్మ, కళావతి, షబీనా, రామ్మూర్తి, రయాన్, లింగమ్మలు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యం చేయించుకోగా మిగిలిన వారు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లినట్టు సమాచారం. కాగా ఈనెల ఒకటిన కుక్క కాటుకు గురైన నరసమ్మ, వర్షణీ, హబీబ్జాన్, రెడెమ్మలు, రెండో తేదిన హష్మీ, బిందు, రెడ్డెమ్మ, దర్షిత, అమీనాబీ, నీలమ్మ, మహ్మద్, ఆసీఫ్, అర్షిత, మూడో తేదీన శ్రీరజ్, గణేష్, జీవన్‌కుమార్, ప్రసాద్, వెంకటరమణ, నారాయణలు కుక్క కాట్లకు గురై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. వీరుకాక పదుల సంఖ్యలో బాధితులు ప్రయివేటు ఆస్పత్రులు, మదనపల్లెకు వెళ్లి చికిత్సలు పొందుతున్నారు. బి.కొత్తకోట పట్టణంలో కుక్కల సంతతి జనంతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ వీధిలో చూసినా, ప్రధాన రహదారులపైనా కుక్కలే కనిపిస్తాయి. అందులో గుంపులే అధికం. దీనితో వారికి ఎవరు ఎదురుపడినా దాడి చేస్తూ కరుస్తున్నాయి. ఈ వరుస ఘటనలపై కమిషనర్ జీవీ ప్రమీల మాట్లాడుతూ కుక్కలను అదుపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. భయం.. భయం బి.కొత్తకోటలో జనం రోడ్లు, వీధుల్లోకి రావాలంటేనే భయకంపితులవుతున్నారు. ఏ క్షణంలో కుక్కలు దాడి చేస్తాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, నడిచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డలపై కుక్కలు దాడి చేస్తాయన్న భయాందోళనతో ఉన్నారు. పిల్లలను వెంట తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ స్కూళ్ల వెలుపలకు వస్తే కుక్కల బారిన పడ్తారేమో అన్న ఆందోళనతో ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కుక్కలు కాట్లు వేస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వాటి నుంచి రక్షించాలంటూ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బి.కొత్తకోటలో కుక్కల గుంపు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన కుక్కకాటు బాధితులు -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం గువ్వలచెరువు తూర్పు భాగంలోని కొత్తిమడుగు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు గురువారం 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ భరణికుమార్ మాట్లాడుతూ రాయచోటి ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. ఎర్రచందనం దుంగలు మోసుకువెళ్తున్న కూలీలు తమను చూసి పరారయ్యారన్నారు. 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి బరువు సుమారు 370 కేజీలు, విలువ రూ.1.80 లక్షలు చేస్తాయని పేర్కొన్నారు. పారిపోయిన స్మగ్లర్ల జాడ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బీఓ రెడ్డప్ప, కొత్తిమడుగు బీట్ ప్రొటెక్షన్ వాచర్స్ రమణ, గురవయ్య, రెడ్డయ్య, శ్రీనివాసులు, కొండయ్య, జయరామ, పెద్దరెడ్డయ్య, శీను, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో గురువారం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో రెండవ మాసం కల్యాణం మఠం ఆస్థాన ప్రధాన అర్చకుడు ఇడమటికంటి జనార్ధనాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారి శిష్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి తన్మయులయ్యారు. ప్రతి నెల శుద్ధ ద్వాదశి నాడు దాతల సహకారంతో స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్వపు మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, పూజారులు, దాతలు పాల్గొన్నారు. -
పది పరీక్షల నిర్వహణ బకాయిలు చెల్లించండి
రాయచోటి : పదో తరగతి పరీక్షలు నిర్వహించి తిరిగి స్పాట్ వ్యాల్యుయేషన్‌లో పాలుపంకున్న ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ పరీక్షల సంచాలకులు కేవీ శ్రీనివాసులురెడ్డిని యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్‌లు కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో వారు కలిశారు. వినతిపై స్పందిస్తూ బకాయిలకు సంబంధించిన టోకెన్ నంబర్లను సమర్పిస్తే బకాయిలు విడుదల చేస్తామని చెప్పారని యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఇదే విషయంపై అన్నమయ్య జిల్లా డీఈఓను అనేక సార్లు ఆదేశించినా టోకెన్ నంబర్లను పంపకపోవడంతో చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందన్నారు. మూడు సంవత్సరాలకు సంబంధించిన బిల్లు బకాయిలు, ఈ విద్యా సంవత్సరంలో (రూ. 60 లక్షలు) స్పాట్ వాల్యుయేషన్ పూర్తయి నాలుగు నెలలు గడిచినప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై డీఈఓ, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ కార్యాలయాల ఎదుట వివిధ రూపాలలో నిరసనలు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిస్తామని ఏపీ పరీక్షల సంచాలకులకు తెలియపరిచినట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే
● యూరియా బస్తా కోసం తీవ్ర ఇక్కట్లు ● 9న జిల్లా కలెక్టరేట్ రైతుపోరును విజయవంతం చేయాలి ● వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ మదనపల్లె రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుల సమస్యలపై ఈ నెల 9న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు. రైతుపోరు నిరసన కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రైతుపక్షపాతిగా వారికిచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని అందజేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఏ సీజన్‌కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్లో ఇస్తూ.. రైతులకు అండగా నిలిచామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మామిడి, టమాటా పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. చివరకు వరి పంటకు అవసరమైన యూరియాను రైతులకు అందించలేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటే కేవలం ఒక బస్తాను ఇవ్వడమే కాకుండా పంపిణీలో రాజకీయ వివక్ష కనపరుస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఎరువును సకాలంలో అందించామన్నారు. మదనపల్లె నియోజకవర్గంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనపరుస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీటీఎం వద్ద టమాటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా నారాలోకేష్ హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. హంద్రీ–నీవా కాలువలో కృష్ణాజలాలు మదనపల్లె మీదుగా కుప్పం వెళుతున్నాయే కానీ, మదనపల్లె నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చేనేతవిభాగం జిల్లా అధ్యక్షులు శీలంరమేష్, రైతు నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, చిప్పిలి జగన్నాథరెడ్డి, సీటీఎం–2 పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బండపల్లె వెంకటరమణ, గ్రానైట్ మహేష్, వేణుగోపాల్, మజ్జిగ కేశవ, రామమూర్తి, శివ, శంకరనాయక్, చలపతి, నాగార్జున, శ్రీరాములు, చిన్నికృష్ణ, విశ్వనాథ్, జహీర్, అనిల్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్ ఈశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మదినం ముందు రోజే విషాదం
మదనపల్లి రూరల్ : బుడిబుడి అడుగులతో ఆడుకుంటున్న ఓ చిన్నారి.. అనంతలోకాలకు వెళ్లింది. తెల్లవారితే కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆ అమ్మాయి.. నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బాబు కాలనీకి చెందిన జమీర్, సిద్దిక దంపతుల కుమార్తె సానియా (2) సాయంత్రం కనిపించకుండా పోయింది. ఓవైపు వారానికి ఒకసారి వచ్చే మున్సిపాలిటీ నీళ్లు పట్టుకునే క్రమంలో, అందరూ హడావిడిగా ఉన్నారు. మరోవైపు సానియా ఆటలాడుకుంటూ తన ఇంటి పక్కనున్న మరో ఇంటిలోకి వెళ్లింది. ఆడుకుంటూ వారెవరూ గమనించని సమయంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది.కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతుకుతుండగా, పక్కింటి వారు నీటి సంపునకు మూత వేసేందుకు దగ్గరకు వచ్చి చూశారు. చిన్నారి సంపులో పడిపోయి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. అప్పటికే పాప మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా సానియా శుక్రవారం జన్మదిన జరుపుకోవాల్సి ఉంది. తెల్లవారితే తమ బిడ్డ బర్త్ డే చేయాల్సిన తల్లిదండ్రులు, జీవం లేని చిన్నారిని ఎత్తుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని తెలిసింది. -
ముగిసిన పవిత్రోత్సవాలు
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. గురువారం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, తీర్థప్రసాద గోష్టి, పవిత్రాల వితరణ తదితర వైదిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగించారు.భక్తులు దర్శించుకుని తరించారు. సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. రాయచోటి: ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందించాలని, జిల్లాలో చిన్న తరహా నీటిపారుదల ట్యాంకుల పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, హాజరయ్యారు. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పనులకు ఉపయోగకరంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృత్రిమ మేధస్సు జెన్ చాట్ బాట్ ప్రాజెక్టుకు సహకరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీపీఓను ఆదేశించారు. -
● గణిత భయాన్ని పోగొట్టేలా..!
విద్యార్థుల్లో గణితం అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. దా నిని తొలగించి ఆసక్తి పెంచడమే లక్ష్యంగా అ డుగేశారు. అందుకు పా ఠశాల గదిని గణిత గార్డెన్‌గా మార్చేశారు. ఆయనే నామా చంద్రశేఖర్. వాల్మీకిపురం మండలం చింతపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.పాలిజియో బోర్డు, అనలిటికల్ జా మెట్రీ బోర్డు, నంబర్ బోర్డులను స్వతహాగా తయారు చేశారు. బోర్డుల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఏపీ మాథ్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతి నెలా నిర్వహించే ఉచిత కంటి శిబిరానికి వచ్చే రోగులక ఉచితంగా భోజనం పెడుతున్నారు. ● 2016లో సౌత్ ఇండియా స్థాయిలో బెంగళూరులో జరిగిన మాథ్స్ఫోరంలో జియో పాలీబోర్డుపై ప్రథమ బహుమతి, 2023లో కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మొదటి స్థానం,2019, 24లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. -
● గరువులకు గుర్తింపు
ఓబులవారిపల్లె: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుల అవార్డుకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి పంచాయతీ, సీఎం బలిజపల్లి గ్రామానికి చెందిన ఎలిశెట్టి ధనుంజయ,అదే మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన డాక్టర్ పోలి సాయినాథ్ రెడ్డి ఎంపికయ్యారు, ధనంజయ కడప జిల్లా వేంపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఈయన రాయలసీమ ప్రాంతం నుంచి సీనియర్ లెక్చరర్ విభాగంలో అవార్డు పొందారు. సాయినాథ్‌రెడ్డి నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఐఐటీ మద్రాసులో ఎంటెక్ చదివారు. జేఎన్టీయూ అనంతపురంలో పీహెచ్డీ పూర్తి చేశారు.వీరికి అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఎలిశెట్టి ధనుంజయ పోలి సాయినాథ్ రెడ్డి -
● బొమ్మలతో బోధన
బడిని ఆహ్లాదంగా తీర్చిదిద్దుతూ రమాభార్గవి ప్రత్యేక గుర్తింపు పొందారు. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం జంగాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గత ఏడాది పాఠశాలలో 8 మంది విద్యార్థుఽలు ఉండగా ఆమె ప్రత్యేక దృష్టి సారించి విలేజ్గ్రూప్ క్రియేట్ చేసి విద్యార్థులు ప్రభుత్వ బడిల్లో చదివేలా చేశారు.ప్రస్తుతం 24 మంది విద్యార్థులున్నారు. పాఠాలను ఆటలు, బొమ్మల రూపంలో నేర్పిస్తూ విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు.ఆదివారం, సెలవురోజు అంటే విద్యార్థులకు ఆనందం. కానీ ఇక్కడ మాత్రం సెలవును బడిలోనే గడిపేందుదకు ఇష్టపడతారు.రమాభార్గవి స్కౌట్స్ అండ్ గైడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. 2023,24 ల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్నారు. -
● నరేష్.. క్రీడాకారులకు స్ఫూర్తి
మారుమూల గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారిని క్రీడల్లో కుసుమాలుగా తయారు చేస్తున్నారు మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ నరేష్. 2010లో ఫిజికల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడపట్ల ఆసక్తి పెంచేలా చేశారు. పాఠశాలలో ప్రత్యేకంగా క్రీడామైదానం ఏర్పాటు చేయించారు. విద్యార్థులను ఉదయం,సాయంత్రం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా హాకీ, పుట్‌బాల్, క్రికెట్,అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఏడాది వేసవిలో ఉచిత వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు జిల్లా, రాష్ర, జాతీయ స్థాయిల్లో ఎంపికయ్యారు. 2023–24, 2024–25 సంవత్సరాలకు సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల బెస్ట్ స్పోర్టు ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికై ంది. 2017లో ఉత్తమ జిల్లా అవార్డు, 2023 హిందూ ఉపాధ్యాయ సంఘంచే రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. -
● ఆనందం పంచుతూ...ఆహ్లాదం పెంచుతూ...!
విద్యార్థులకు పాఠాలను బోధించడంతో పాటు పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపుతున్నారు నిమ్మనపల్లె మో డల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భాస్కరన్. చిన్నతనం నుంచే మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, బసినికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. విద్యార్థులు ఇన్స్పైర్, కౌశల్ యోజన వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో గతంలో 36 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 90 మంది ఉన్నారు. ● 2020లో గ్రీన్ స్కూల్ అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. ఉత్తమ పోస్టర్ ప్రజెంటేషన్ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.జిల్లా స్థాయిలో 2022,2024లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులు అందుకున్నారు. -
వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు
వైఎస్ఆర్ కడప జిల్లా: మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో ఇటీవల వినాయక నిమజ్జనం ఉరేగింపు వీడియో వైరల్ అయిన సంఘటనపై గ్రామంలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పెద్దనపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి విగ్రహం వెనుక రప్పారప్పా అని రాసిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో గ్రామ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీడియోను చూసి అంకాల్‌రెడ్డి, అంకిరెడ్డి, అశోక్‌రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. కాగా మరి కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
గణేష్ ఊరేగింపులో యువకుడి హల్చల్
పీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పీలేరులో జరిగిన గణేష్ ఊరేగింపులో రివాల్వర్‌తో ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పీలేరు పట్టణంలో గణేష్ విగ్రహాల సామూహిక ఊరేగింపు, నిమజ్జనం జరిగింది. ఊరేగింపు సందర్భంగా చెన్నారెడ్డికి చెందిన గణేష్ విగ్రహం వద్ద ఓ యువకుడు రివాల్వర్‌తో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ విచారణ జరిపి యువకుడు అధికార పార్టీకి చెందిన గుండ్లూరు వెంకటరత్నంగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రివాల్వర్ ఆకారంలో ఉన్న లైటర్‌గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. లైటర్‌ను స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ శివకుమార్ ఎదుట బైండోవర్ చేసి విడుదల చేశారు. -
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
ప్రమోద్ కుమార్, అనంతపురం (5 వికెట్లు) శివ కేశవ, కడప (43 పరుగులు) నాగ చాతుర్య, కడప (53 పరుగులు) ప్రశాంత్, అనంతపురం (90 పరుగులు)కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 53 పరుగులు, విజయ్ రామిరెడ్డి 62 పరుగులు, శివ కేశవ 43 పరుగులు, అయూబ్ 36 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో... కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 44.4 ఓవర్లకు 239 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 50 పరుగులు, మాధవ్ 56 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్ 2 వికెట్లు, ప్రవీణ్‌కుమార్ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 36 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రశాంత్ 90 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 52 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 2 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఘనంగా ఆసార్–ఏ–షరీఫ్
సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటం పత్తుమియా మసీదులో బుధవారం రాత్రి ఆసార్–ఏ–షరీఫ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముతవల్లి సయ్యద్ అబ్దుల్ అజీస్ ఖాద్రి మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త వస్తు విశేషాలను తిలకించేందుకు ప్రజల ఎదుట ప్రదర్శించామన్నారు. అలాగే మహమ్మద్ ప్రవక్త కుమార్తె ఆయే షా, అల్లుడు హజరత్ అలీ, వారి మనువడు ఇమా మ్ హుస్సేన్‌కు సంబంధించిన వస్తు విశేషాలు, మహబూబ్ సుబహాని వస్తు విశేషాలు ప్రదర్శించామన్నారు. ముతవల్లి కుమారుడు నిజరే ఆలం ఖాద్రి, ఇమామ్ పీర్ బాషా ఖాద్రి పాల్గొన్నారు. -
ప్రొటోకాల్‌కు తిలోదకాలు..!
● ఒంటిమిట్ట మండల సమావేశంలో వేదికపై టీడీపీ ఇన్చార్జి ● అధికారులతో సమస్యలపై చర్చ ● ముక్కున వేలేసుకుంటున్న జనం సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఒంటిమిట్ట మండల సర్వసభ్య సమావేశం ప్రొటోకాల్ తప్పింది. అంతేకాదు సమయపాలన కూడా అధికారులు పాటించలేదు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం 11 గంటలకు ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశం తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు, ఆయన అనుచరులతో కలిసి సంబంధిత అధికారులు నిర్వహించారు. సమావేశానికి హాజరైన చమర్తి జగన్ మోహన్ రాజు పలు శాఖల అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. అనంతరం చమర్తి మాట్లాడుతూ ఎంపీపీ ఆహ్వానం మేరకే తాను సమావేశానికి హాజరయ్యానని తెలిపారు. ఇందులో నిబంధనలు, ప్రొటోకాల్‌ని ఉల్లంఘించింది ఏమీ లేదంటూ తనను తాను సమర్థించుకున్నారు. ఇదంతా చూసిన వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు సర్వసభ్య సమావేశం నిర్వహణ నియమాలను సంబంధిత అధికారులు మంట గలిపారని మండిపడుతున్నారు. ఇలా జరగడం మొదటిసారి ఏమీ కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మండల సర్వసభ్య సమావేశం ప్రొటోకాల్‌కు అర్థం లేకుండా పోయిందని పలు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు నామినేటెడ్ పదవులు ఉన్నవారు సైతం తాము ప్రజా ప్రతినిధులమంటూ సమావేశ భవనంలోకి అడుగుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇలా సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా పాటించాల్సిన ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి, జెడ్పీటీసీ అడ్డలూరు ముద్దుకృష్ణారెడ్డి, ఎంపీడీఓ సుజాత, కోఆప్షన్ సభ్యుడు రఫీ, ఎంపీటీసీలు టక్కోలు లక్ష్మీ ప్రసన్న, ముమ్మడి నారాయణ రెడ్డి, బాషా, సుప్రియ, గీతాదేవీ, లక్ష్మీదేవి, సర్పంచ్‌లు కడప బాదుల్లా, బొడ్డే నాగమ్మ, లక్ష్మీనరసమ్మ, మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వినాయక చవితిలో వెల్లివిరిసిన మత సామరస్యం
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. బుధవారం రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ వద్ద ముస్లిం మైనార్టీలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హిందూ ముస్లిం సోదరుల ఐక్యత చాటుకుంటూ ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి పండుగ సమయంలోనూ ఇలా పరస్పరం సహకరించుకుంటూ అన్నదమ్ముల్లా జరుపుకుంటున్నామన్నారు. అలీ, అజీజ్, ఫయాజ్‌ల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధిలో రూ.1.30 లక్షల నిధుల దుర్వినియోగం
● ఏపీఓ, ఇద్దరు టీఏలకు షోకాజ్ నోటీసులు ● ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు బి.కొత్తకోట : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో రూ.1.30 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. గత ఏడాది ఆగస్టు 18 నుంచి ఈ ఏడాది ఆగస్టు 26 వరకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో మొత్తం 1,226 పనులకు గాను రూ.5.69 కోట్ల నిధులను వెచ్చించారు. ఉపాధి హామీ ద్వారా జరిగిన ఈ నిధుల వినియోగంపై ఎస్ఆర్పీ తిరుమలేష్ పర్యవేక్షణలో 12 మంది డీఆర్పీల బృందం గత 10 రోజుల పాటు మండలంలో పూర్తి చేసిన పనులను తనిఖీ చేశారు. డ్వామా పీడీ వెంకటరత్నం సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఆడిట్ అధికారులు నిధుల దుర్వినియోగం వివరాలను వెల్లడించారు. అదే విధంగా ఆడిట్ సిబ్బంది తనిఖీలో పొంతనలేని రూ.17.93 లక్షల నిధుల దుర్వినియోగంపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఏపీడీని ఆదేశించారు. అంతేగాక విధుల పట్ల అలసత్వం వహించిన ఏపీఓ మంజుల, టెక్నికల్ అసిస్టెంట్లు నారాయణ, మణికంఠలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు క్రిష్ణకుమార్, నరసింహులును విధుల నుంచి తొలగించామని పీడీ పేర్కొన్నారు. ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ, క్లస్టర్ ఏపీడీ నందకుమార్, ఎంపీడీఓ క్రిష్ణవేణి, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన జేసీ
రాయచోటి : రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో ఉన్న యూరియా స్టాక్ పాయింట్లను జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. బధవారం రాయచోటి పరిధిలోని చెన్నముక్కపల్లి–2 లోని రైతు సేవాకేంద్రం, పట్టణంలోని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులను బుధవారం పరిశీలించారు. యూరియా స్టాక్‌ను పరిశీలించి వ్యవసాయ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్‌తో కలిసి రాయచోటిలోని జాఫర్ సాబ్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఆ షాపు యాజమాన్యం నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. స్వామిత్ర సర్వే పరిశీలన... రూరల్ మండలం, దిగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న స్వామిత్ర సర్వే కార్యక్రమాన్ని జేసీ పరిశీలించారు. మండల సర్వేయర్, పంచాయతీ సెక్రటరీలకు తగు సూచనలు చేశారు. -
ఇది ప్రజలను ముంచే ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను ముంచే ప్రభుత్వమని గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు కల్పలతారెడ్డి విమర్శించారు. బుధవారం కడపలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని కూటమి నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, దాన్ని పీ4కు అప్పగించామని చెప్పడం దారుణమన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించడం దురదృష్టకరమన్నారు. కూటమి పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయారన్నారు. ఉద్యోగులకు ఇంకా పీఆర్సీ ప్రకటించలేదని, ఐఆర్, డీఏ బకాయిలు చెల్లించలేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లో నాడు – నేడు పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు కింద 80 శాతం పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చాలాచోట్ల అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద పాఠాలు వినాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. డిజిటల్ బోర్డులు, ట్యాబ్‌లు పాడైపోయాయని, ఆర్ఓ ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. ఈ సమావేశంలో 46వ డివిజన్ కార్పొరేటర్ ఎంవీ శ్రీదేవి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి -
కేసుల రాజీకి కృషి చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నమోదైన కేసుల్లో అధిక సంఖ్యలో రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని సూచనల మేరకు బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత పోలీసు స్టేషన్ల వారీగా కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తుగా సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ హెగ్డే, కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు, రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం ఆర్.కృష్ణమోహన్, మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి.రాజేంద్రప్రసాద్, ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి.భావన, కడప కోర్టు మానిటరింగ్ సెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ -
పర్యావరణ పరిరక్షకుడు సిద్దారెడ్డి
మదనపల్లె సిటీ: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని 2025 సంవత్సరానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పెద్దమండ్యం మండలం గుడిసివారిపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.సిద్దారెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి మంగళవారం సమాచారం అందింది. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిషేదం, మారుమూల ప్రాంతంలో పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం, విద్యార్థులకు ఉపయోగపడే ‘అల’ కార్యక్రమం విజయవంతం చేశారు.స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో కబ్మాస్టర్గా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ, విజయవాడ వరదబాధితులకు సహాయ సహకాలు అందించారు. జిల్లా స్థాయిలో మూడు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో 2024లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. ఆయన చేసిన సేవలు గుర్తిస్తూ విద్యాశాఖ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. సుదాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిషేదం, పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానన్నారు. -
నేడు రాయచోటిలో 5–కె మారథాన్ రన్
రాయచోటి టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4వ తేదీని 5– కె మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కుష్టు, ఎయిడ్స్. టీబీ అధికారి రమేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయచోటి ప్రభుత్వ ( బాలురు) డిగ్రీ కళాశాల నుంచి నారాయణరెడ్డిగారిపల్లె సర్కిల్ వరకు, అక్కడ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ఈ మారథాన్ రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని రమేష్‌బాబు పిలుపునిచ్చారు. మదనపల్లె సిటీ: నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి రోప్‌స్కిప్పింగ్ పోటీల్లో మదనపల్లె దీక్షక్ష పాఠశాలకు చెందిన జోషిత ప్రతిభ కనబరిచి బంగారు పతకం కై వసం చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న జోషిత అండర్–12 ఫ్రీస్టైల్ విభాగంలో రాణించింది. విద్యార్థినిని పాఠశాల ప్రిన్సిపాల్, పీడీ కమలేష్, తల్లిదండ్రులు ఎస్.శ్రీనివాసులు,లతను అభినందించారు. గాలివీడు: రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఏఓ శివనారాయణ పేర్కొన్నారు. బుధవారం గాలివీడులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఏడీఏ జయరాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు ఎకరాలు కలిగిన ప్రతి రైతు కనీసం ఎకరాలోనైనా ప్రకృతి సాగు చేయాలన్నారు.సాంకేతిక సలహాలు, అందుబాటులోకి వచ్చిన యాంత్రీకరణ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడం గురించి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించారు.సాగులో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు,చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏఓ నవంత్, రైతులు పాల్గొన్నారు. పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం శ్రీరంగనాథుడు అశ్వవాహనంపై సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం శ్రీరంగనాథుని కల్యాణాన్ని కల్యాణదుర్గం చల్లా వంశీయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్‌రెడ్డి, ఈఓ కేవీ రమణలు పర్యవేక్షించారు. రాయచోటి: జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా సమాచారాన్ని రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలోని సచివాలయం నుంచి అన్ని జ్లిలాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎరువుల అందుబాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి కలెక్టరేట్ నుండి కలెక్టర్ శ్రీధర్, జేసీ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు. జిల్లాలో మండల, గ్రామస్థాయిలలో రైతులకు అందుబాటులో ఉన్న యూరియాపై తగిన సమాచారాన్ని చేరవేసి యూరియాపై ఉన్న దుష్ప్రచారాన్ని అరికట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.యూరియాకు సంబంధించిన సమాచారం కోసం 08561–293006 నంబర్లో సంప్రదించాలని కలెక్టర్ శ్రీధర్ తెలియజేశారు. ● గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ ఆధార్ క్యాంపులను గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బొల్లెపల్లిలోని ఓ బాలుడికి సంబంధించిన ఆధార్ అప్డేట్ చేసి సంబంధిత సమాచారాన్ని ఆ బాలుడికి కలెక్టర్ అందజేశారు. -
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా 2వ తేదీ దివంగత మహానేత వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించా రు. మంగళవారం మద్ధతు ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతుల కష్టాలను స్వయంగా రైతుల పంట పొలాల్లోకి వెళ్లి తెలుసుకుని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అలాగే అంబకపల్లె గంగమ్మ కుంట చెరువులో జలహారతి ఇచ్చారు. దారిలోని నల్లపురెడ్డిపల్లెలో స్థానికులతో మాట్లాడారు. సోమ, మంగళవారాలలో భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలు, పార్టీ కేడర్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారాలను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచిస్తూ ప్రజలు, కార్యకర్తలలో మనో ధైర్యం నింపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మూడు రోజుల పర్యటన విజయవంతం -
సరస్వతి పుత్రికకు పురస్కారం
కేవీపల్లె: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు కేవీపల్లె మండలం జి.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తున్న సరస్వతి ఎంపికై ంది. చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన సరస్వతి ప్రస్తుతం పీలేరులో నివాసం ఉంటూ జి.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. 18ఏళ్లుగా ఆమె బయాలజీ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆరు సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆమె పనితీరును లీడ్యాప్ ద్వారా గుర్తించిన విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డు అందజేయనున్నారు. -
కూటమి పాలన రైతుల పాలిట శాపం
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వ పాలన రైతుల పాటి శాపంగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం అతలాకుతలమైందని అన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ ప్రోత్సాహకం లేక రైతన్న కుదేలయ్యాడని తెలిపారు. దీనికి తోడు ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కొందరు రైతులు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారని పేర్కొన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు మూల్యం చెల్లిచుకోక తప్పదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిల హయాంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లోని నాయకులకు ఉన్న చిత్త శుద్ధి కూడా మన ముఖ్యమంత్రికి లేదన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 6న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఛలో విజయవాడను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమంత్, మోహన్ పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
గురువులకు గౌరవం
జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నది గురువుకు మాత్రమే. పుట్టుకకు తల్లిదండ్రులు కారణమైతే.. జీవన ప్రయాణానికి ఉపాధ్యాయులు దారిచూపిస్తారు. అందుకే వారిని త్రిమూర్తులతో పోలుస్తారు. గురువులేని విద్యను ఊహించలేం. దేశ భవిష్యత్తును నాలుగు గోడల మధ్య తీర్చిదిద్దుతారు. విద్యార్థులలో అంతర్గతంగా దాగివున్న నైపుణ్యాలను వెలికితీసి ప్రపంచానికి చాటి చెప్పేలా వారు సానపెడతారు. అలా అసాధారణ కృషి చేస్తూ జిల్లాలో ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక రాయచోటి: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు (తెలుగు పండితుడు) ఉత్తన్న ఎంపికయ్యారు. 1989లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఆయన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయని చెప్పవచ్చు. వీరబల్లి మండలం మట్లి ఉన్నత పాఠశాలలో పనిచేసిన రెండేళ్లలో తెలుగు సబ్జెక్టులో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేశారు. మాసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా గత రెండు పర్యాయాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 98, 99 మార్కులను విద్యార్థులు సాధించడం విశేషం. ఆయన ప్రతిభను గుర్తిస్తూ విద్యాశాఖ ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయిడిగా ఎంపిక చేసింది.ఇప్పటికి రెండు పర్యాయాలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థుల ఉన్నతికి కృషి జిల్లా, రాష్ట్ర పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోవడం సంతోషమే.. అయితే విద్యార్థుల ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేలా చేయడమే నా ఆశయమని ఎం.ఉత్తన్న అన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకుని చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని సైతం విద్యలో రాణించేలా చేయడం విధిగా భావిస్తానన్నారు. తెలుగుతో పాటు ఆటల పోటీలలో కూడా సొంత నిధులను ప్రోత్సాహక బహుమతులుగా ప్రకటించి విద్యార్థులలో ప్రేరణ కలిగించడం బాధ్యతగా తీసుకుంటానన్నారు. -
సీఎం పర్యటనతో ఒరిగింది శూన్యం
రాయచోటి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా తప్ప రాజంపేట ప్రజలకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వైఖరిపై ఆకేపాటి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా చేస్తామని హామీ ఇచ్చి నేడు నాకు ఓటు వేయలేదని జిల్లా గురించి అడిగిన వారికి సమాధానం ఇవ్వడం రాజనీతి కాదన్నారు. అన్నమయ్య జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే రైతులకు అవసరమైన యూరియాను అందించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆకేపాటి విమర్శించారు. పంటలను సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం డీలర్ షాపుల వద్ద గంటలు, రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. కడప జెడ్పీ సమావేశంలో యారియా సమస్య లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలివీటి వీరనాగిరెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నాగభూషణం, బూత్ కమిటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రెహమాన్ ఖాన్, సుండుపల్లి జెడ్పీటీసీ ఇస్మాయిల్, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు టి నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి అమరనాధరెడ్డి, రాజంపేట నియోజకవర్గ పబ్లిసిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, రాజంపేట నియోజకవర్గం గ్రీవెన్స్ అధ్యక్షుడు మానం సంతోష్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు చంద్ర నాయక్, అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంటు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ
నందలూరు: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా అర్చకులు స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు జరిపి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్లు, ఉత్సవర్లకు, విష్వక్సేన, ధ్వజస్తంభం, పరివార దేవతలకు పవిత్రాలు సమర్పించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్, పాల్గొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్: ఈ ఏడాది డిసెంబర్ 7వతేదీన జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష(ఎన్ఎంఎంఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inల్లో ఈ నెల 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు సంచాలకులు డాక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ..వకుటుంబ సంవత్సరాదాయం రూ.3.50 లక్షలలోపు ఉన్న విద్యార్థులు ఆధార్‌కార్డులో ఉన్న విధంగా నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. -
సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ట
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చరిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఘనంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సాయికృష్ణ, పలువురు అర్చకులు, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ బుధవారం పవిత్ర సమర్పణ, పవిత్ర హోమం, శాత్తుమొర, నివేదన జరుగుతాయన్నారు. 4వ తేదీ మూడో రోజు గురువారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహిస్తారని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో ఆటోమ్యాట్ యాప్ ఆవిష్కరణ
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆర్ – 21 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు రూపొందించిన ఆటోమ్యాట్ యాప్‌ను ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా ఆవిష్కరించారు. మంగళవారం వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆటోమ్యాట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరించడానికి ఈ యాప్ ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. ఈ ఆటో యాప్ ద్వారా షెడ్యూల్ ప్రకారం ఆటోలు అందుబాటులోకి వస్తాయని, నిజమైన, పారదర్శకమైన ధరల విధానంతోపాటు విద్యార్థుల భద్రత కోసం కంప్లైంట్ ఆప్షన్ ఉంటుందన్నారు. అలాగే తప్పు ప్రవర్తన, అధిక చార్జీలు, మొదలగు సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నారు. యాప్‌ను ఆటో డ్రైవర్లకు చెందిన మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆటో యాప్‌ను రూపొందించిన విద్యార్థులు శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్లను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. -
రేపటి నుంచి పాతరాయచోటి దర్గా ఉరుసు
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం పాతరాయచోటిలో వెలసిన హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. 4వ తేదీ గంధం ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5న మధ్యాహ్నం దర్గా ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం, అదే రోజు సాయంత్రం ఉరుసు ఉత్సవం జరగనుంది. 6న తహలీల్ ఫాతేహా కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ముగియనున్నాయి. ఉరుసు ఉత్సవాల్లో హిందూ, మహమ్మదీయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. -
నాటుసారా రహిత జిల్లాగా ఆమోదం
రాయచోటి: నవోదయ 2.0 కార్యక్రమం కింద నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి అన్నమయ్య జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ఏకగ్రీవంగా ఆమోదించామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్ జి.మధుసూదన్, ఏఈఎస్ జోగేంద్ర, ఆర్డీఓ శ్రీనివాస్, డీఆర్డీ పీడీ సత్యనారాయణ, ఎల్డీఎం ఆంజనేయులు, స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ దాసరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాయచోటి టౌన్: రాజంపేట నియోజకవర్గ పెద్దకారంపల్లెకు చెందిన వెంకటేశ్వర రాజు అభ్యర్థన మేరకు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఈ–ఆటోను అందజేశారు. రూ.3.45 లక్షల విలువైన ఆటోను మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో వెంకటేశ్వర రాజు కుటుంబ సభ్యులకు అందించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
బాలుడిని గదిలో ఉంచి.. తాళం వేసిన అంగన్వాడీ టీచర్
● స్పృహ తప్పిపడిపోయిన వైనం ● తల్లిదండ్రుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం బ్రహ్మంగారిమఠం : పిల్లలందరూ ఇంటికి వెళ్లారని భావించి ఓ బాలుడు లోపల ఉండగానే అంగన్వాడీ టీచర్ బడికి తాళం వేసుకుని వెళ్లింది. చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుతో బడి తాళాలు పగులగొట్టి చూడగా బాలుడు లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఈ సంఘటన బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు పంచాయతీ పీసీపల్లె అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. బాలుడి తండ్రి వెంకటసుబ్బయ్య కథనం మేరకు.. వీరి కుమారుడు బత్తల హరికృష్ణ(5)ను రోజులాగే మంగళవారం కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రం టీచర్ చంద్రకళ, ఆయాలు పిల్లలను ఇళ్లకు పంపించి కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పెద్ద కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. చిన్న పిల్లాడు కనిపించకపోవడంతో అన్నిచోట్లా వెతికారు. అనుమానంతో అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే తాము 11 గంటలకే అందరినీ ఇళ్లకు పంపించి వేశామని, తమకు తెలియదని చెప్పారు. కేంద్రం తాళాలు ఇవ్వండి లోపల ఏమైనా ఉన్నాడేమో చూస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా బాలుడు ఏడ్చి ఏడ్చి భయంతో అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే వారు బాలుడిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అంగన్వాడీ సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోపోండి.. మీపైనే కేసు పెడతాం అంటూ వారు బెదిరిస్తున్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
కూటమి పాలన.. ధ్వంస రచన !
● వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఫ్యాక్టరీ, ఇల్లు కూల్చివేత ● ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీటీడీ చర్యలు ● నిరాశ్రయులైన వలస కూలీలు ● కూటమి నేత ప్రలోభాలే కారణమంటున్న బాధితులుఒంటిమిట్ట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధించిన వారి ఉద్యాన పంటలను నరికి వేయడం, అధికారుల సహాయంతో నిర్మాణాలను కూల్చి వేయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో కూడా అలాంటి ఘటననే జరిగింది. మండల పరిధిలోని నరవకాటిపల్లి పంచాయతీలో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి పక్కన ఉన్న 1520 సర్వే నెంబర్లో సుమారు 30 ఏళ్ల నుంచి 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ నివాసాలలోనే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు అబ్బిరెడ్డి 2014 ఏప్రిల్ నుంచి 6 సెంట్ల స్థలంలో సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీని నడుపుతున్నారు. అక్కడే ఉండేందుకు నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతులు పొంది, వారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా పత్రాలు పొంది, అధికారికంగానే నివాసం ఉంటున్నారు. అయితే అబ్బిరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇది ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయ భూమి అంటూ మంగళవారం టీటీడీ ఎస్టేట్ అఫీసర్ సువర్ణమ్మ, టీటీడీ రెవెన్యూ అధికారి లలితాంజలి ఉన్నట్టుండి తన నిర్మాణాలను జేసీబీ సాయంతో కూలగొట్టారని బాధితుడు అబ్బిరెడ్డి వాపోయారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంటిని, ఫ్యాక్టరీని కూలగొట్టడం చూస్తే ఒంటిమిట్ట మండలానికి చెందిన కూటమి నేత ప్రలోభాలకు లొంగి టీటీడీ అధికారులు ఇదంతా చేశారన్నారు. ఈ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీని నమ్ముకుని 50 మంది వలస కూలీలు ఫ్యాక్టరీ వద్దే జీవనం సాగిస్తున్నారు. కూల గొట్టే క్రమంలో వారి సామగ్రిని కూడా ఇంటిలో నుంచి బయట పడేసి, ఇంటిని కూల్చడంతో నిరాశ్రయులమయ్యామంటూ వలస కూలీలు కన్నీరు మున్నీరయ్యారు. ఇదేమిటని టీటీడీ రెవెన్యూ అధికారులను బాధితులు అడిగితే టీటీడీ స్థలంలో మీరు సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ నడపడం నేరమని చెబుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ నడపడం నేరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేయాలే గాని, టీటీడీలోకి ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం విలీనం కాకముందే కట్టిన కట్టడాలను ఇలా కూలగొట్టడం న్యాయం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా తాను వైఎస్సార్సీపీ సానుభూతి పరుడిననే కక్షతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటమి నేతలు టీటీడీ అధికారులను పావులా వాడుకున్నారని బాధితుడు అబ్బిరెడ్డి ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడంతో సుమారు రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. అబ్బిరెడ్డి ఇంటిని జేసీబీ సాయంతో కూలగొడుతున్న టీటీడీ రెవెన్యూ అధికారులు పూర్తిగా నేలమట్టం అయిన అబ్బిరెడ్డి నివాసం కొన్ని రోజుల క్రితం ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి లొంగ లేదని, వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన అబ్బిరెడ్డిపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ అంటే ఆధ్యాత్మికతకు ప్రపంచ వ్యాప్తంగా పెట్టింది పేరు. అలాంటి టీటీడీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్యుల నిర్మాణాలను, ఆస్తులను ధ్వంసం చేయడంపై దుర్మార్గం. 2000 సంవత్సరంలో 1520 సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేశారు. ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీలో వీలీనం చేయకముందే 2014లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకుని, ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని చిన్నపిల్లలతో జీవిస్తున్న 50 మంది వలస కార్మికులకు జీవనాధారం లేకుండా పోయింది. ఉండేందుకు గూడు కూడా లేదు. బాధితులకు అండగా ఉంటాం. దీనిపై న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తాం. – ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీని నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. వారు నిర్మించిన ఇంటిలో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న మమ్మల్ని నేడు టీటీడీ వారు నిరాశ్రయులను చేశారు. ఇంటిలో పనిచేసుకుంటున్న మమ్మల్ని బయటికి పంపి, మా సామాన్లను విసిరేసి ఇంటిని కూలగొట్టారు. ఇప్పుడు చిన్న పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్లాలి. – నిర్మల, వలసకూలీ -
మహానేతకు ఘన నివాళి
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అణగారిన వర్గాలకు తోడుగా, రైతన్నకు నేస్తమై, గూడులేని పేదలకు ఇళ్ల రూపంలో వరమై నిలిచారంటూ మహానేతను స్మరించుకున్నారు. 16 ఏళ్ల కిందట నల్లకాలువ ప్రాంతంలో జరిగిన ఘోర సంఘటనను గుర్తు చేసుకుంటూ మహానేతకు నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకాలు చేసి లక్షలాదిమంది రైతులకు ఊపిరి పోశారంటూ గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో అనేక మంది అభాగ్యులు, ఆర్థికంగా బలంలేని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ప్రాణాలను నిలిపిన దేవుడిగా కొలిచారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి వారి ద్వారా వేల మందికి అన్నార్పణం చేయించారన్న మాటలు వినిపించాయి. వీటితోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదింటి విద్యార్థులకు వెలుగులు నింపిన మహానుభావుడిగా కీర్తించారు. ఇలా 108 లాంటి అనేక సంక్షేమ పథకాలతో మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మననం చేసుకున్నారు.● అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాల సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మదనపల్లిలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు షమీం అస్లాం, రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వాడల్పాడు, పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాజంపేటలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డితోపాటు ఆయా ప్రాంతాలలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.పుల్లంపేటలో చీరెలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి రామసముద్రం మండలం చెంబకూరులో అన్నదానం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ -
ఎరువుల కొరత రానివ్వొద్దు
రాయచోటి : జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం, యూరియా లభ్యతపై మండలాల వారీగా సమీక్షించి రైతు సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే)ల్లో ఎరువులు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో యూరియా లభ్యతపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అవసరమయ్యే రసాయనిక ఎరువులపై కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే డీలర్లు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు చేపట్టాలన్నారు. రాయచోటి టౌన్/రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథావిధిగా ఉంచాలని, ఇప్పటికే చేపట్టిన జిల్లా కార్యాలయాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాయచోటిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల మార్పులపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జిల్లాను విభజించాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, రాయచోటి కేంద్రంగా జిల్లాలో మార్పులు లేకుండా చూడాలని మంత్రివర్గ ఉప సంఘానికి లేఖ రాస్తానని తెలిపారు. వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రామాపురంలోని వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తన పాలనతో ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అన్నారు. -
శభాష్..వెంకటరమణ !
● తండ్రితనానికి కొత్త అర్థం ● కొడుకు కాజేసిన పింఛన్ల సొమ్మును చెల్లించిన తండ్రి కురబలకోట : ఉద్యోగిగా కొడుకు తప్పు చేసినా తండ్రి తలవంచలేదు. పైగా విలువను చాటుకున్నాడు. బిడ్డ చేసిన తప్పిదాన్ని పేద వాడైనప్పటికీ తండ్రి పెద్ద మనసుతో సరిచేసి శభాష్ అనిపించుకున్నాడు. మనసును కదిలించే ఈ సంఘటనకు సంబంధించి వివరాలలోకి వెళితే.. కురబలకోట మండలం అంగళ్లు గ్రామం జోగివారిపల్లెకు చెందిన జె. వెంకటరమణ కుమారుడు జె. వెంకటేష్ అదే మండలంలోని తెట్టు గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి కేటాయించిన రూ.4.69,500ల నగదుతో వెంకటేష్ సోమవారం పరారైన విషయం తెలిసిందే. ఇతని కోసం తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇది అతని తండ్రి వెంకటరమణను తీవ్రంగా కలచివేసింది. ఆయన మనసు విరిగిపోయింది. పింఛన్ల సొమ్ముతో ఉడాయించడం పట్ల ఎంతగానో చింతించాడు. కొడుకు చేసిన తప్పిదానికి తనే బాధ్యత వహించాడు. వెంటనే అతను తెలిసిన వారి వద్ద అప్పుచేసి కొడుకు ఎత్తుకెళ్లిన పింఛన్ సొమ్మును ఎంపీడీఓ గంగయ్యకు అందజేశారు. మంగళవారం పింఛన్‌దారులకు ఈ సొమ్మును కూడా పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. కొడుకు తప్పు చేసినా తండ్రి తన విలువను చాటుకున్నాడు. బిడ్డ భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందన్న ఆశతో తండ్రి బాధ్యత వహించి నగదు చెల్లించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే చేతులు దులుపుకోవడం సాధారణమైన ఈ రోజుల్లో తండ్రి తనానికి కొత్త అర్థం చెప్పారు. అంతేగాకుండా విలువలకు ప్రతిరూపంగా నిలిచిన వెంకటరమణ నిర్ణయం అధికార యంత్రాంగాన్ని కూడా కదిలించింది. -
టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో వర్గపోరు
పెనగలూరు : తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి సంస్థాగత ఎన్నికలు మంగళవారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పోటాపోటీగా జరిగాయి. పలు పంచాయతీల నుంచి విశ్వనాథ నాయుడు వర్గీయులు ఓవైపు, రూపానందరెడ్డి వర్గీయులు మరో వైపు తమకే పదవులు కావాలంటూ పోటీ పడ్డారు. మండల పరిశీలకుడు శ్రీనాథ్ రెడ్డి ఒక్కో పంచాయతీ సభ్యుడిని పిలిపించి వారి మనోగతాన్ని తెలుసుకొని ఇరువర్గాల నుంచి పేర్లను సేకరించారు. మండలంలో 16 పంచాయతీలు ఉండగా ఐదు, ఆరు పంచాయతీలు మినహా మిగిలిన అన్ని పంచాయతీలలో విశ్వనాథ నాయుడు వర్గం, రూపానందరెడ్డి వర్గీయులు తమకే పదవులు కావాలని పట్టుబట్టారు. దీంతో ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా బయట ప్రాంతం నుంచి పోలీసు బలగాలను రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడి పదవికి కూడా రెండు వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. భారీగా పోలీసు బందోబస్తు -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : పట్టణంలోని కోమటివానిచెరువులో గుర్తు తెలియని వ్యక్తి (50) మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా చిత్తుకాగితాలను ఏరుకుంటూ ఉండేవాడని తెలిసింది. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని గుర్తించినవారు టు టౌన్ పోలీసు స్టేషన్ సీఐ నంబర్ 9491074519, ఎస్.ఐ 9440796741కు సమాచారం అందించాలని టు టౌన్ సీఐ రాజారెడ్డి కోరారు. వివాహిత ఆత్మహత్య మదనపల్లె రూరల్ : అనారోగ్య కారణాలతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లెలో జరిగింది. చిప్పిలికి చెందిన చంద్రకళ (27) వన్‌టౌన్ పరిధిలోని నక్కలదిన్నె పంచాయతీ చుక్కలతాండాకు చెందిన చంద్రశేఖర్‌నాయక్‌ను కొంత కాలం క్రితం రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో చంద్రకళ గత కొంత కాలంగా కడుపునొప్పి కారణంగా అనారోగ్యం పాలైంది. పలు చోట్ల చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్థాపం చెంది సోమవారం ఇంటిలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిలవేంపల్లె : నేడు మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల మంగళవారం ఆయన సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. సోమవారం సాయంత్రం వీరు ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు షర్మిల వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి వెళ్లిన కారుసిద్దవటం : సిద్దవటం మండలం, కడప–చైన్నె జాతీయ రహదారి భాకరాపేట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్‌కు చెందిన వెంకటరమణ, ఆయన భార్య ఈశ్వరమ్మ, కుమార్తె యామినితో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేణిగుంటకు కారులో బయలుదేరారు. కారు సిద్దవటం మండలంలోని శనేశ్వరస్వామి ఆలయం దాటుకొని వస్తుండగా ఆవు అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. -
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్‌లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు మూడో రోజు డ్రాగా ముగిశాయి. కడప–చిత్తూరు జట్ల మధ్య కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన కడప జట్టు 117.4 ఓవర్లలో 406 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నాగ చైతుర్య 339 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 174 పరుగులు చేసి ఆడాడు. షేక్ ఆదిల్ హుస్సేన్ 66 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని ముకేష్ 3 వికెట్లు, రెడ్డి ప్రకాశ్ 3 వికెట్లు, బ్రహ్మ తేజ్ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో చిత్తూరు జట్టు ఆధిక్యం సాధించింది. భారీ ఆధిక్యం సాధించిన నెల్లూరు జట్టు వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో నెల్లూరు–కర్నూలు జట్ల మధ్య సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 34.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 51 పరుగులు, నిఖిలేశ్వర్ 30 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్య తేజ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 63 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 81 పరుగులు, సాయి సూర్యతేజ రెడ్డి 62 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 3 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. -
పింఛను సొమ్ముతో ఉడాయించిన ఉద్యోగి
కురబలకోట : మండలంలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయకుండా నగదుతో జూనియర్ లైన్‌మన్ పారిపోయాడు. అంగళ్లుకు చెందిన జె.వెంకటేష్ (28) తెట్టు సచివాలయంలో గ్రేడ్–2 జూనియర్ లైన్‌మన్‌గా ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తెట్టు దళితవాడలో పింఛన్ల పంపిణీ బాధ్యతను ఆయనకు అప్పగించారు. మొత్తం 111 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.4,69,500లను వెంకటేష్‌కు అధికారులు ఇచ్చారు. సోమవారం ఉదయం పింఛన్లు పంపిణీ చేసేందుకు వెంకటేష్ రాకపోవడంతో కురబలకోట ఎంపీడీఓ గంగయ్యకు లబ్ధిదారులు సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేయగా, పింఛన్ సొమ్ముతో వెంకటేష్ పరారైనట్లు తేలింది. అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ అని వస్తోంది. వెంకటేష్ రెండు రోజులుగా ఇంటికి రాలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేష్‌పై తెట్టు సచివాలయ కార్యదర్శి ఎన్.రామప్ప ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేష్‌ను సస్పెండ్ చేసినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. కాగా, వెంకటేష్ గతంలోనూ ఒకసారి పింఛను సొమ్ము స్వాహా చేసేందుకు ప్రయత్నించినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
ఎరువుల దుకాణాల తనిఖీ
కలికిరి : యూరియా డిమాండ్‌ను అదునుగా చేసుకుని రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని మండల వ్యవసాయాధికారి హేమలత హెచ్చరించారు. కలికిరిలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన వ్యవసాయాధికారి సోమవారం దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా విక్రయాలు, నిల్వ రికార్డులను పరిశీలించారు. బస్తా ధర రూ.266.50కు మాత్రమే విక్రయించాలని హెచ్చరించారు. అలాగే మేడికుర్తిలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు.ప్రజలను మోసగించిన చంద్రబాబురాయచోటి : రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనతో ప్రజల చెవిలో పువ్వులు పెట్టి మోసం చేశారని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబు తనను తాను పొగుడుకోవడానికి, వైఎస్సార్సీపీని విమర్శించడానికే పరిమితం అయ్యారన్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కడప–బెంగళూరు రైల్వేలైనుకు నిధులు, అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి, బొప్పాయి రైతులను ఆదుకోవడం గురించి, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, అభివృద్ధికి నిధులు విడుదల తదితర అంశాల ప్రస్తావన చేయకపోవడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్నమయ్య జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను అక్రమంగా నిర్బంధించడం అన్యాయమన్నారు. -
బాకీ డబ్బు అడిగినందుకు దళిత యువకుడి హత్య
దువ్వూరు : బాకీ ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు దళిత యువకుడు హత్యకు గురైన సంఘటన దువ్వూరు మండలం భీమునిపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. భీమునిపాడు ఎస్సీ కాలనీకి చెందిన జేష్టాది దివాకర్ (35), పక్క గ్రామం సంగటితిమ్మాయపల్లెకు చెందిన నాగ దస్తగిరి ఇరువురు స్నేహితులు. ఇద్దరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళ్లేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జేష్టాది దివాకర్ దగ్గర నాగదస్తగిరి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆదివారం దివాకర్ తనకు డబ్బు చాలా అవసరం ఉందని అప్పుగా ఇచ్చిన రూ.10వేలు ఇవ్వాలని నాగదస్తగిరిని అడిగాడు. తన వద్ద డబ్బు లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో అని నాగదస్తగిరి అన్నాడు. ఈ క్రమంలో దివాకర్ అతని ఫోన్ తీసుకుని తీసుకున్న అప్పు చెల్లించి ఫోన్ తీసుకెళ్లు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం సాయంత్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న దివాకర్ ఇంటి వద్దకు నాగదస్తగిరి వెళ్లి డబ్బు ఇస్తాను రా మాట్లాడుదాం అని పిలుచుకెళ్లాడు. ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే డబ్బు ఇవ్వలేదని తన సెల్‌ఫోన్ తీసుకెళతావా అని దివాకర్ తలపై బండరాయితో నాగదస్తగిరి గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలతో దివాకర్ అక్కడే పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన దివాకర్‌ను ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో దివాకర్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు దివాకర్‌కు భార్య మహాలక్షుమ్మ, కుమారుడు సుదీప్(12) ఉన్నారు. కుటుంబాన్ని పోషించే కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, భార్యా పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై మృతుడి తల్లి జేష్టాది మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. గత నెల 26న మదిరేపల్లె గ్రామంలో బాకీ చెల్లించలేదని దళిత యువకుడు పాలగిరి చెన్నయ్యను హత్య చేసిన సంఘటన మరువక ముందే మండలంలో మరో దళిత యువకుడు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. -
గోడ కూలి విద్యార్థికి తీవ్ర గాయాలు
తంబళ్లపల్లె : మండలంలోని గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో బాత్రూము గోడకూలి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. కొటాల పంచాయతీ ఎలపవారికోటకు చెందిన గంగప్ప కుమారుడు భరత్ గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ పాఠశాలలో 181 మంది విద్యార్థులు ఉన్నారు. విరామ సమయంలో బాత్రూము వెళ్లాడు. అక్కడ నూతననంగా నిర్మించిన బాత్రూములు ఉన్నా కొందరు విద్యార్థులు పాత బాత్రూములోకే వెళ్లారు. ఈ క్రమంలో గోడ కూలడంతో ఆ విద్యార్థి కాలిపై పడింది. కుడికాలు తొడపై పడటంతో కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 పైలెట్ దేవేంద్ర, ఈఎంటీ సుబ్రమణ్యం సంఘటన స్థలానికి వెళ్లి విద్యార్థిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎంఈఓ త్యాగరాజు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రికి తరలించినట్లు ఎంఈఓ తెలిపారు. భర్త ఇంటి ముందు ధర్నా సంబేపల్లె : తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కళ్యాణి అనే యువతి తన తల్లిదండ్రులతో కలసి ధర్నాకు దిగిన సంఘటన సోమవారం సంబేపల్లె మండలంలో జరిగింది సంబేపల్లె మండలం నాగిరెడ్డిగారిపల్లె గ్రామం అన్నప్పగారిపల్లెకు చెందిన కళ్యాణికి ఏడాది క్రితం మండలంలోని శెట్టిపల్లె గ్రామం పాపన్నగారిపల్లెకు చెందిన యాదగిరినాయుడుతో వివాహం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు రామాంజులు, అరుణమ్మ తెలిపారు. కొన్ని నెలల క్రితం అధిక కట్నం తేవాలంటూ తమ కుమార్తెను వేధించి పుట్టింటికి పంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాపురానికి రాలేదని తమకు నోటీసులు పంపారని కళ్యాణి వాపోయింది. -
కడప గడపలో కృష్ణమ్మ సవ్వడులు!
సాక్షి ప్రతినిధి కడప : ‘బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను...బంగారు పంటలే పండుతాయి. ముత్యాల మురిపాలు దొరలుతాయి’.. ఇది శంకరంబాడి సుందరాచార్యులు రాసిన గేయం. ఇది ఒకనాటికి నిజమవుతుందని జిల్లా ప్రజలెవరూ ఊహించలేదు. మెట్ట ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తే నా జన్మ ధన్యమని రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ఆనాడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆ మహానేత నిర్వహించ తలపెట్టిన జలయజ్ఞం ఫలితం సాకారమైంది. నీళ్లులేక నోళ్లు తెరచిన పులివెందుల నియోజకవర్గ బీడు భూములు పులకిస్తున్నాయి. ‘తండ్రి బావి తవ్విస్తే కుమారుడు పూడ్చేశాడన్నట్లుగా’ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1988లో గాలేరు–నగరి, ఆ తర్వాత హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించి శంకుస్థాపన చేశారని నాటి రాయలసీమ ఉద్యమకారులు వివరిస్తున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికారిక పగ్గాలు చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఓ మాట.. తర్వాత మరోమాట చెబుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ విషయాన్ని చరిత్ర స్పష్టం చేస్తోంది. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం గండికోట ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆపై నిర్మాణాన్ని విస్మరించారు. మళ్లీ ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవాలి కనుక 1999 సాధారణ ఎన్నికలకు ముందుగా 1998లో వామికొండ వద్ద మరోమారు శంకుస్థాపన చేశారు. గద్దెనెక్కిన తర్వాత మళ్లీ విస్మరించారు. కృష్ణస్వామి కమిటీ వేసి జీఎన్ఎస్ఎస్కు గండికొట్టే ప్రయత్నాలు చేశారని విశ్లేషకులు వివరిస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుకు ఆయన ఖర్చు చేసింది కేవలం రూ.67.50 కోట్లు మాత్రమే. అది కూడా సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే. ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం తేటతెల్లమవుతోంది. పైగా రాయలసీమ సాగు, తాగునీరు అందాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచాలి. కాగా చంద్రబాబు సర్కార్ జీఓ నెంబర్ 69 జారీ చేసి శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులకు కుదించడం ద్వారా రాయలసీమ మరణశాసనాన్ని లిఖించారని పలువురు విమర్శిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్.. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కేవలం ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో దాదాపు రూ.12వేల కోట్లు వెచ్చించారు. మొదటి దశలో భాగమైన అవుకు నుంచి గండికోటకు వరదకాలువ, గండికోట రిజర్వాయర్, టన్నెల్, వామికొండ, సర్వరాయసాగర్ పనులు సుమారు 85 శాతం పూర్తి చేశారు. అవుకు రిజర్వాయర్ కాంప్లెక్స్ సామర్థ్యాన్ని 4.8 టీఎంసీలకు పెంపు, గోరకల్లు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు విస్తరింపజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం, టీఆర్ఎస్, కోస్తా ప్రాంతం టీడీపీ నాయకులు సంయుక్తంగా జతకట్టి ఆరోపణలు గుప్పించారు. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణపు పనులు దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించిన నాయకుల అందరి నోర్లు మూయించి, ఒప్పించి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ సామర్థ్యం పెంచారని చరిత్రకారులు వివరిస్తున్నారు. జీఎన్ఎస్ఎస్ పథకంలో తొలుత గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పథకానికి రూపకల్పన చేశారు. పైడిపాలెం వద్ద 6 టీఎంసీల సామర్థ్యంతో రూ.727 కోట్లు అంచనా వ్యయంతో పైడిపాళెం రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. తద్వారా తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరువులను నింపి 47,500 ఎకరాలకు కొత్తగా సాగునీరుతో పాటు, పీబీసీ కింద 41,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే సంకల్పం పుచ్చుకున్నారు. వైఎస్ కుటుంబం కృషి ఫలితమే.. తుంగభద్ర హైలెవెల్ కెనాల్లో అంతర్భాగంగా గతంలో పులివెందుల బ్రాంచ్‌కెనాల్ నిర్మించారు. టీబీ డ్యాంలో పూడిక పేరుకుపోవడం, ఎగువప్రాంతాల నీటి అక్రమ వినియోగం వంటి కారణాల వల్ల పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు ఏనాడు పూర్తి సామర్థ్యంతో సాగునీరు అందలేదు. రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. అయినా ఆశించిన ఫలితం కన్పించలేదు. ఈ నేపథ్యంలో సీబీఆర్‌కు గండికోట నుంచి 8.3 టీఎంసీల నీటిని 5 లిఫ్ట్‌ల ద్వారా తీసుకెళ్లే బృహత్తర పథకానికి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.1343 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టగా, అందులో రూ.1090కోట్లు దివంగత సీఎం వైఎస్సార్ ఖర్చు చేశారు. నాటి కృషి ఫలితమే నేడు అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబకపల్లె చెరువు వద్ద జలహారతి ఇవ్వనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన దివంగత సీఎం వైఎస్సార్ మెట్ట ప్రాంతాల్లో కృష్ణా జలాలు పారిస్తే నా జన్మ ధన్యమని నాడే స్పష్టీకరణ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన టీడీపీ ప్రభుత్వం అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పుల్లంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిపై పుల్లంపేట మండలం రామక్కపల్లి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి శ్రీనివాసులు (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా.. పుల్లంపేట మండలం, పుత్తనవారిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు దివ్యాంగుడు. ఇతనికి ఒక కన్నులేదు. కాగా తన భార్య బిడ్డలను పోషించుకునేందుకు పుల్లంపేట మండలం, అప్పయ్యరాజుపేట సమీపంలోని పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. యథావిధిగా సోమవారం పెట్రోల్ బంకుకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రామక్కపల్లి సమీపంలోకి రాగానే తనముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పుల్లంపేట ఎస్ఐ శివకుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన వర్గాల ఘర్షణ పీలేరు రూరల్ : పీలేరు పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా దొడ్డిపల్లె పంచాయతీ కొత్తపేటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు, రెడ్డివారిపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సీఐ యుగంధర్ ఆయా గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
వైభవంగా పల్లకీసేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో ఊరేగారు. సోమవారం రాత్రి మూల విరాట్లను ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్ స్వామి, రాచరాయ యోగీ స్వామి, మల్లిఖార్జున స్వామి రంగు రంగుల పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. పురవీధులలో ఊరేగించారు. ఆలయ ఈవో టీవీరమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారుతైక్వాండోలో బంగారు పతకం సిద్దవటం : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నిర్వహించిన రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా, సిద్దవటం మండలం విద్యార్థికి బంగారు పతకం లభించింది. ఎస్ రాజంపేట గ్రామం, ఎస్సీ కాలనీలో నివాసముంటున్న భవనాసి సుశాంత్ ఆరో తరగతి చదువుతున్నాడు.సోమవారం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరించి బంగారు పతకం సాధించాడు. సుశాంత్ బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉందని తండ్రి బి.మునయ్య పేర్కొన్నారుజిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్రాయచోటి : జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా కొరతపై వస్తునన వదంతులను రైతులు నమ్మవద్దని అన్నారు. పీలేరులో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. -
ఆగని ఆక్రమణలు
బండలు వలచి...దిన్నెలు తొలగించి చదను చేస్తున్న ఆక్రమణదారులు రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ దందా కొనసాగుతోంది. వాగులు, వంకలను, చిన్నచిన్న గుట్టలను సైతం ఆక్రమణదారులు వదలడం లేదు. ప్రభుత్వ భూములతోపాటు గతంలో పట్టాలు ఇచ్చిన భూములనూ తమకున్న రాజకీయ పలుకుబడితో కొందరు భూ బకాసురులు ఆక్రమిస్తున్నారు. రాయచోటి పట్టణ పరిధిలోని సర్వేనంబర్ 604 పరిధిలో ఉన్న 50 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూమిలో ఉన్న బండరాళ్ల సైతం తొలగించి చదును చేస్తున్నారు. ఈ భూమి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు పలుకుతుందని స్థానికులు అంటున్నారు. గతంలో ఇదే స్థలాన్ని కొతమంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
●విద్యాపరంగా అభివృద్ధి
రాయచోటిలో వైఎస్సార్ పాలన చేపట్టిన తర్వాత రూ. 150 కోట్లతో రాయచోటిలో 5 మోడల్ పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు వాటికి భవనాలను నిర్మించి ఇచ్చారు. రైల్వేకోడూరుకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్సార్ ఉద్యాన కళాశాల, ఓబులవారిపల్లెలో పాలిటెక్నిక్ కళాశాలను అందించారు. వైఎస్ఆర్ హయాంలోనే కోర్టు భవనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో ఎన్నో బాలుర, బాలికల విద్యాలయాలు, కేజీబీవీలు నెలకొల్పి విద్యకు పెద్దపీట వేశారు. సాక్షి రాయచోటి : రాజన్న...ఈ మాట ఉచ్ఛరిస్తేనే జనాలకు ఒక భరోసా. ఇంట్లో ఏది జరిగినా నీకు నేనున్నానంటూ ఆయన అందించిన విశ్వాసం కుటుంబంలో నేటికీ శాశ్వతం. ప్రత్యేకించి అందుకు కారణం రాజకీయాలకు అతీతంగా పేదల్ని ప్రేమించడం, వర్గాలకు అతీతంగా సంక్షేమ పాలన అందించడం. చెరగని చిరునవ్వుతో...తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు....నడకలో రాజసం....నమ్ముకున్న వారిని ఆదరించే గుణం...మాట తప్పని మడమ తిప్పని నైజం...కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం...ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఏకై క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజానీకంతోపాటు ప్రపంచ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. రాష్ట్ర ప్రజల కోసం, ఎంతటి కష్టాన్నైనా భరించారు. చెప్పిన మాట ఆచరించేందుకు రచ్చబండ నిర్వహణ కోసం పయనించిన ఆయన 2009 సెప్టెంబరు 2న హెలికాప్లర్ దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు. నేడు వైఎస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. మారిన జిల్లా స్వరూపం డాక్టర్ వైఎస్సార్ రాకతో రాయచోటి రూపురేఖలు మారాయి. రహదారుల నిర్మాణం, విద్యాభివృద్ధికి కళాశాలలు మంజూరు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కాగృహాలు ఇలా చెబుతూపోతే ప్రతి విభాగంలోనూ వైఎస్సార్ ముద్ర కనిపిస్తుంది. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీలేరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, జిల్లాలో లక్షకుపైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పేరెన్నికగన్న విద్యా సంస్థల ఏర్పాటు, వేలాదిమందికి రేషన్‌కార్డులతోపాటు పింఛన్లతో జిల్లాపై డాక్టర్ వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు. సొంత భూమిని దానం చేసి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరులో 2007లో తన సొంత భూమి 304 ఎకరాలను 108 మంది ఎస్టీ కుటుంబాలకు అప్పటి ఎమ్మెల్యే ప్రభావతమ్మతో కలిసి స్వయంగా పంపిణీ చేసారు. ప్రస్తుతం ఆ భూముల్లో గిరిజనులు పంటలు పండించుకుంటూ జీవనాధారం పొందుతున్నారు. రాజంపేట–రాయచోటి మార్గంలో చెయ్యేరు నది సమస్య లేకుండా నదిపై రూ.7 కోట్లతో బాలరాచపల్లె వంతెన నిర్మాణం జరిగింది. రాజంపేట పంచాయతీని మున్సిపాలిటీగా మార్పు చేయించారు. వైఎస్ పాలనలో రూ.100కోట్లపైగా నిధులు విడుదలయ్యాయి. వ్యవసాయ పరంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలతో రైతుల్లో చెరగని ముద్ర వేసిన ఆరోగ్యశ్రీ, 108 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. కళ్లముందు సాక్షాత్కరించిన సాగునీటి ప్రాజెక్టులు వైఎస్సార్ హాయంలో తొలి జలయజ్ఙం ప్రాజెక్టు వెలిగల్లు. దివంగత ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని శరవేగంగా పూర్తి చేసుకున్న వెలిగల్లు ప్రాజెక్టును తొలి జలయజ్ఙం ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి హోదాలో 2008 డిసెంబరు 24వ తేదీన జాతికి అంకితం చేశారు. 4.64 టిఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు కోసం 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీటిని అందించనుంది. ఝరికోన ప్రాజెక్టు పూర్తి బ్రిటీష్ కాలం నుంచి ప్రచారంలో ఉన్న ఝరికోన ప్రాజెక్టు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన దాల్చుకుంది. చిత్తూరు జిలా సరిహద్దు ప్రాంతంలోని ఝరికోన వద్ద 7 టిఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీని ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అలాగే పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ను 2.50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. 5 మండలాలకు తాగు, సాగునీరే ధ్యేయంగా శ్రీనివాసపురం(నాగిరెడ్డి) రిజర్వాయర్ హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా 308 కోట్ల రూపాయలతో 1.25 టిఎంసీల సామర్థ్యంతో చిన్నమండెం మండల కేంద్రం సమీపంలో నిర్మించారు. అలాగే మదనపల్లెలో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ పనులకు రూ. 4200 కోట్ల మంజూరుకు చర్యలు చేపట్టారు. రాజంపేటలో సుమారు రూ. 30 కోట్లతో మున్సిపాలిటీకితాగునీటి సమస్య తీర్చేందుకు అన్నమయ్య భారీ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. అనంతరాజుపేట వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ వెలిగల్లు, ఝరికోన ప్రాజెక్టులు పూర్తి రైల్వేకోడూరులో ఉద్యాన కళాశాల ఏర్పాటు రాయచోటిలో రింగ్‌రోడ్డు.. అడవిపల్లె ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలో పరుగులు తీసిన అభివృద్ది నేడు వైఎస్సార్ 16వ వర్ధంతి -
బాబు నోట.. ఓట్ల మాట !
● రాజంపేట వాసుల ఆశలపై ‘బాబు’నీళ్లు ● పరోక్షంగా రాజంపేట జిల్లా కాదనే సంకేతాలు.. రాజంపేట/ సాక్షి రాయచోటి : ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి చెప్పకుండా ఓట్ల మాటను సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తావించడం రాజంపేట ప్రాంతీయులను కలవరపాటుకు గురిచేసింది. సీఎం వస్తున్న సందర్భంగా రాజంపేటను జిల్లా ప్రకటన చేస్తారని ఈ ప్రాంత వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారు. గత కొద్దిరోజుల నుంచి జిల్లా సాధనసమితి, టీడీపీకి చెందిన కొందరు నేతలు జేఎసీతో జిల్లా కావాలంటూ కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లాపై ప్రకటన చేయాలని కోరుతామని వారు ప్రకటనలు గుప్పించారు. ప్రజావేదికపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా రాజంపేట జిల్లా ప్రకటన చేస్తారని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను చెప్పుకొంటూ, ఆద్యంతం కొనసాగించారు. జిల్లా ప్రకటన అంశాన్ని తెరౖపైకి తీసుకొచ్చిన రాజంపేట, రైల్వేకోడూరు సీపీఎం నేతలను హౌస్ అరెస్టు చేశారు. . ఏదీ ఏమైనప్పటికి రాజంపేట జిల్లా చేసేందుకు వీలుకాదనే సంకేతాలను చంద్రబాబు ప్రజల్లోకి పంపారు. ● సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ ఓటమిని ముఖ్యమంత్రి చంద్రబాబు జీర్ణించుకోలేకపోయినట్లుగా కనిపిస్తోంది. ఓట్లు వేయలేదని అక్కసును బహిర్గతం చేశారు. ఓట్లు వేసిన వారికి ఏమీ చెప్పాలంటూ, ప్రతికూలత చెప్పకుండా చెప్పినట్లు చెప్పేస్తారు. అంటే రాయచోటి జిల్లా కేంద్రం నుంచి మార్చే భావన ముఖ్యమంత్రికి లేనట్లు కనిపిస్తోంది. లేక మదనపల్లెను జిల్లా చేయాలనే తలంపుతోనే సీఎం మాట్లాడినట్లుగా జనం గుర్తించారు. ● రాజంపేట టీడీపీ ఇన్చార్జిగా చమర్తి జగన్మోహన్రాజును ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజావేదికలో ప్రకటించారు. ఇక్కడ ఎమ్మెలే, ఎంపీ లేకపోయినా పర్వాలేదు..ఇన్చార్జిగా చమర్తి జగన్మోహన్రాజును అనధికారిక ఎమ్మెల్యేగా పరిచయం చేసినట్లైందన్న విమర్శలు వెలువడ్డాయి. కాగా చమర్తి ఫ్లెక్ల్సీలు చెల్లాచెదురుగా, చినిగిపోయి కనిపించాయి. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ముందురోజు ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భరోసా ఇచ్చారు. అందుకు విరుద్ధంగా రాజంపేట వైపు హరితహోటల్, వైజంక్షన్ దిగ్భంధం చేశారు.ఎంజీపురం నుంచి నందలూరు వైపు రాకపోకలపై పోలీసుల ఆంక్షలు ప్రయాణికులు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో వారు పెదవి విరిచారు. పోలీసులు పసుపునేతలకు ట్రాఫిక్ విషయంలో రాచమర్యాదలు చేశారు. జనం లేక...రాక అధికారుల అగచాట్లు చంద్రబాబు పర్యటనలో జనంలేక పోవడంతో అధికారులు నానాఅగచాట్లు పడ్డారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుపేద కూలీలను రప్పించి, వారిచేత పచ్చజెండాల ఇచ్చి నిలబెట్టారు. చంద్రబాబు పర్యటన ఆద్యంతం సినిమా సెట్టింగ్ తరహాలో కొనసాగింది. ● చంద్రబాబు టీడీపీ క్యాడర్‌తో సమావేశమనగా నాయకులు, కార్యకర్తలు అనేక ఆలోచనలు చేశారు. తమ గోడు చెప్పుకునే అవకాశం కలుగుతుందని ఆశించారు. కానీ అక్కడ జరిగింది ఏమీ లేదు.దీంతో పార్టీ నేతలు అసంతృప్తికి గురయ్యారు. -
మంచిరోజులొస్తాయి
● తొలి రోజు ప్రజలతో మమేకమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ● నేడు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళి, ప్రత్యేక ప్రార్థనలు ● అంబకపల్లె గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి ఇవ్వనున్న మాజీ సీఎం పులివెందుల : కూటమి ప్రభుత్వంలో అబద్ధాలకు, మో సాలకు అంతు లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎ స్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కార్యకర్తలు, ప్రజ లు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన వారికి భరోసా కల్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తన సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం వై ఎస్ జగన్ భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను ప్రజలు వివరించగా ఓపిగ్గా విన్నారు. అధినేతను కలిసినవారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసు లు, సుధీర్‌రెడ్డి, గంగుల భాను, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజనేయరెడ్డి, పూల శ్రీనివాసులరెడ్డి, మాజీ ఆప్కాస్ చైర్మన్ ఝాన్సీరాణి, జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నారు. పింఛన్ల తొలగించారంటూ మహిళల ఆవేదన పులివెందుల పట్టణం నగరిగుట్ట ప్రాంతానికి చెందిన రాజకుళ్లాయమ్మ అనే మహిళ తన పింఛన్ తీసేశారంటూ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన పింఛన్‌ను తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే పులివెందుల మండలం కనంపల్లెకు చెందిన కృపావతి అనే వితంతువు కూడా తన పింఛన్ తొలగించారని వాపోయింది. దీనికి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు ప్రభు త్వం దాదాపు 4లక్షల పింఛన్లు తొలగించారని మండిపడ్డారు. అధైర్యపడొద్దని, పింఛన్ల విషయంలో న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా కల్పించి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. మాజీ ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందులలోని తన నివాసంలో కలిసిన ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కేక్ తినిపించారు. ఆటోగ్రాఫ్... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డిని వైఎస్ జగన్ అభినందించారు. ఇటీవల కశ్మీర్ ప్రాంతంలోని లడాక్ ట్రిప్‌కి వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి భూమికి దా దాపు 18వేల అడుగుల ఎత్తైన ప్రాంతాన్ని చేరుకుని వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అప్పటి ఫొటోలను వైఎస్ జగన్‌కి చూపించగా.. అభినందించి జెండాపై ఆటోగ్రాఫ్ చేశారు. నేడు ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం 7.15గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. అక్క డ వైఎస్సార్‌కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 10.30 గంటలకు లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గంగమ్మ కుంట చెరువు వద్ద నీటికి జలహారతి ఇవ్వనున్నారు. అక్కడినుంచి తిరిగి 12.30గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం 2.30 గంటల నుంచి 7.25గంటలవరకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో ఆయన మమేకం కానున్నారు.ప్రజా సమస్యలు ఆలకిస్తున్న జననేత వైఎస్ జగన్అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు -
ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నాం..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కల్పించిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కోర్సుపై పట్టును పెంచేందుకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నాం. ఎక్కువమంది ట్రిపుల్ ఐటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. వారికి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం కోర్సులు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే వారికి రెండు నెలలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాం. కొన్ని సబ్జెక్టులు ఫెయిలైన వారికి రెమిడియల్ క్లాసులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా యోగా, మెడిటేషన్, వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి తర్ఫీదు ఇస్తున్నాం. మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నాం. – ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, ఇడుపులపాయ -
సీజన్స్ ట్రోఫీ సాధించిన సీటీఎం క్రాస్‌రోడ్స్ టీం
మదనపల్లె రూరల్ : రెండురోజులుగా జరుగుతున్న సెకండ్ సీజన్ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో సీటీఎం క్రాస్‌రోడ్ టీం విన్నర్‌గా నిలిచింది. ఆదివారం సీటీఎం క్రాస్‌రోడ్ టీం కెప్టెన్ అనిల్‌కు, మైఫోర్స్ మహేష్ విన్నర్స్ ట్రోఫీని అందించారు. రన్నర్‌గా నిలిచిన ముదివేడు దిన్నెమీదపల్లె టీంకు కేఎస్ఎన్.నూర్ బాబా బహుమతిని అందించారు. హోరాహోరీగా జరిగిన సెకండ్ సీజన్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ పోటీల్లో మొదటి 15 ఓవర్లకు సీటీఎం క్రాస్‌రోడ్ టీం 121 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముదివేడు దిన్నెమీదపల్లె టీం 110 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అనిల్, హరిబాబులను అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్ఈసీసీ క్లబ్ డైరెక్టర్ హరిబాబు, వినయ్, దేవేంద్ర, గంగరాజు, మోని, మధు తదితరులు పాల్గొన్నారు. -
జీవితాన్ని చదివేద్దాం.. బతికి సాధిద్దాం
మన తాతలు, తల్లిదండ్రులు అక్షరం ముక్క చదవకపోయినా జీవించారు. రెక్కల కష్టంతోనే ఐదుగురి నుంచి పదిమంది పిల్లలను పెంచి పోషించారు. ఇప్పుడున్న వసతులు, సాంకేతికత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్పుడు లేవు. ఇప్పుడున్న యువత చదువు అర్థం కాకపోయినా, ఫెయిలైనా, తమకు నచ్చని చదువులు, వివిధ కారణాలతో ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంతో తల్లిదండ్రుల ఆశలను మధ్యలోనే తుంచి కన్నీళ్లు మిగులుస్తున్నారు. విద్యార్థులు జీవితాన్ని చదవాలి.. బతికి సాధించాలి.వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్ కోర్సును చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై వసతి గృహాల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది ఆగస్టు 8వ తేదీన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పీయూసీ–2 (ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం) చదువుతున్న జమీషా ఖురేషి అనే విద్యార్థిని క్యాంపస్‌లోని వసతి గృహంలో ఉన్న బాత్రూంలో తన చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణాకి పాల్పడింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శివ కిటికీ అద్దాలను పగులగొట్టి చేతులను గాయపరచుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తోటి విద్యార్థితో ప్రేమలో పడి మూడంతస్తుల పై నుంచి దూకి మృతి చెందింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఏచ్చర్ల మండలం షేర్ మహమ్మదాపురం గ్రామానికి చెందిన పీయూసీ–2 విద్యార్థి జి. నరసింహనాయుడు ఉరివేసుకుని మృతి చెందాడు. కళాశాలలో రాత్రి పూట చాలాసేపు మేలుకొని చదువుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బెంగతో, హాస్టల్లో భోజనం సరిగా లేకపోవడంతో, తమకిష్టమైన చదువును చదవలేకనో, జీవితంపై విరక్తి చెంది ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.పిల్లలే తమ సర్వస్వమని..పిల్లలే తమ సర్వస్వమని.. వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సంపాదనలో అధిక భాగం విద్య కోసమే ఖర్చు పెడుతుంటారు. ఇదే సమయంలో ఇతర కుటుంబాల పిల్లలతో పోలుస్తుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. చదువు పేరుతో నిరంతరం ఒత్తిడికి గురి చేయరాదు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు ఉన్నా పిల్లలతో రోజుకు గంట అయినా ఆప్యాయంగా మాట్లాడాలి. అప్పుడే వారిలో మానసిక పరిపక్వత కలుగుతుంది. నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుంటారు. సమాజంలో ఎలా జీవించాలో, నలుగురితో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా తల్లిదండ్రులతో చెప్పుకునేలా అవకాశం కల్పించాలని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఒత్తిడి భరించలేకనే..ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీయాల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ ధోరణి ఎక్కువగానే ఉంది. మంచి మార్కులు, ర్యాంకులు వస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే భావనతో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలు తరగతి గదులు, తమకిష్టమైన చదువులను చదువుకోలేక, వసతి గృహాల్లో ఇమడలేక పోతున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ సమస్యలు, చిన్న, చిన్న సమస్యలకే తల్లడిల్లిపోతున్నారు. ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.పిల్లలకు భరోసా కల్పించాలి..గ్రామీణ విద్యార్థులు ఎక్కువ శాతం తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్నారు. ఇంటర్లోకి వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమం ఎంచుకుంటున్నారు. భవిష్యత్‌లో తెలుగులో కంటే ఇంగ్లీష్ మాధ్యమం చదివిన వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అపోహతో ఇంగ్లీషు విద్యనభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలలో ఇంగ్లీష్ మాధ్యమంతోపాటు తెలుగు మీడియంలో కూడా బోధన చేస్తుంటారు. అయితే పరీక్షలు మాత్రం ఇంగ్లీష్ మాధ్యమంలోనే రాయాలి. కంప్యూటర్ తదితర వాటిపై మంచి పట్టు ఉండాలి. ఓరియంటల్ తరగతుల్లో మాత్రం మూడు నెలలపాటు శ్రద్ధగా చదివితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని ట్రిపుల్ ఐటీ అధికారులు భరోసా కల్పించాలి. ఒకేసారి భాషాపరమైన ఒత్తిడి, పోటీని తట్టుకుని నిలబడాలనే ఉద్దేశంతో శక్తికి మించి కష్టపడుతూ కుంగుబాటుకు లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. మొదటిసారి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన పిల్లలను దృష్టిలో ఉంచుకుని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యాలపై ఉంది.వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి..చదువులో వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించాలి. మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఉన్నత విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించాలి. -
చదువు జీవితంలో ఒక భాగం..
చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇప్పటి ప్రపంచంలో మనం బతకడానికి ఎన్నో ఉపాయాలు, సాధనలు, అవకాశాలు ఉన్నాయి. చదువు రాకపోతే బతకలేమనేది అవాస్తవం. ఆత్మహత్య చేసుకునే ముందు విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దు. విద్యార్థులుగా మీరు ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. అమ్మ, నాన్న, అధ్యాపకులు కూడా పిల్లలు ఏ రంగంలో రాణిస్తున్నారో గుర్తించి.. అందులో వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రస్తుత సమాజ పరిస్థితులకు అనుగుణంగా పెంచుకోవాలి. విద్యార్థుల ప్రవర్తన, కదలికలను అనుక్షణం గమనించాలి. ఇప్పుడున్న యువత క్షణికావేశానికి ఎక్కువగా లోనవుతున్నారు. వారిని ముందే గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే ఫలితం ఉంటుంది. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఆర్కే వ్యాలీ ప్రభుత్వాసుపత్రి, ఇడుపులపాయ -
భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లలో చిత్తూరు, నెల్లూరు జట్లు భారీ స్కోర్లు చేశాయి. ఆదివారం రెండవ రోజు కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు–కడప జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 137. ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 589 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని వై. తేజ రెడ్డి 162 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. నిఖిత్ గౌడ్ 63 పరుగులు చేశాడు. కడప జట్టులోని చెన్నారెడ్డి 3 వికెట్లు, ఎస్ఎండీ అస్లమ్ 2 వికెట్లు, ధనుష్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 32.4 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 52 పరుగులు చేశాడు. దీంతో కడప జట్టు 490 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీసీ స్టేడియంలో.. వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 374 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 96.4 ఓవర్లలో 514 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 220 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 182 పరుగులు చేశాడు. భార్గవ్ 75 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. సాయి ప్రణవ్ చంద్ర 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 41.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 34 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని అఖిల్ 4 వికెట్లు, మాధవ్ 3 వికెట్లు, నారాయణ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 10 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది. దీంతో నెల్లూరు జట్టు 436 పరుగుల అధిక్యంలో ఉంది, దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
రైలు కింద పడి బాలుడి ఆత్మహత్యాయత్నం
కమలాపురం : కమలాపురం పట్టణం రెడ్డీస్ కాలనీకి చెందిన శ్రీహరి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెడ్డీస్ కాలనీకి చెందిన నరసింహరావు కుమారుడు శ్రీహరి 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో చేయి తెగిపోవడంతో పాటు తలకు బలమైన గాయమై తీవ్ర రక్త స్రావం అయింది. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన ఇంధనం
కలికిరి : ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యంగా కలికిరిలో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చినట్లు కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. కలికిరి పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఐఓసీఎల్ పెట్రో ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. పోలీసులతో పాటు ప్రజలకు కూడా ఈ ఫిల్లింగ్ స్టేషన్‌తో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ క్రిష్ణమోహన్, ఐఓసీఎల్ సేల్స్ అధికారి వాసు. ఎంవీఐ ఎం.పెద్దయ్య, కలికిరి సీఐ అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్యరాయచోటి : రాయచోటి పట్టణం పీటీఎం పల్లెకు చెందిన నందిని(36) ఆదివారం ఉదయం అమ్మగారి ఇంటిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 15 సంవత్సరాల కిందట సంబేపల్లి మండలం, రైతుకుంట గ్రామం, పోతువాండ్లపల్లి దళితవాడకు చెందిన బరుగు శివ కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బరుగు నందిని ప్రతిరోజు కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు, అయితే గత కొద్దిరోజులుగా నందిని భర్త అనుమానంతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని సమాచారం. శనివారం సాయంత్రం భార్యాభర్తలిద్దరూ గొడవపడి నందినిని రాయచోటి పట్టణం పూలతోట దళితవాడలోని అమ్మగారి ఇంటి వద్ద వదిలేసి తిరిగి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బరుగు నందిని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ -
పోలీసు నిర్బంధంలో జిల్లా సాధన సమితి నేత
రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ జిల్లా సాధన సమితి జేఏసీ పేరుతో కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఇన్చార్జి పూల భాస్కర్‌ను ఆదివారం పట్టణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కాగా సోమవారం రాజంపేటకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. హక్కులను అడిగితే పోలీసులు నిర్బంధించడం అన్యాయమని పూల భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా టీడీపీ నేతలు కొందరు జేఏసీ పేరుతో రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని కార్యక్రమాలు చేశారు. అయితే వారిని ఎవరిని కూడా పోలీసులు నిర్బంధించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐజేయూ సభ్యుడిగా ఎం.ప్రభాకర్రెడ్డిరాయచోటి జగదాంబసెంటర్ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)లో అన్నమయ్య జిల్లాకు చోటు లభించింది. ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కమిటీ అన్నమయ్యకు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. జిల్లా కమిటీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర కమిటీ ఆమోదించి, ఐజేయూ సభ్యుడిగా ఎం.ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ అధికారికంగా ప్రకటించిందని ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వంశీధర్ తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి నియామకం పట్ల జిల్లా గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, ఈశ్వర్, రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రయ్య, వెంకటేష్, జిల్లా కు చెందిన జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. బైక్ ఢీకొని నలుగురికి గాయాలునిమ్మనపల్లె : బైక్ ఢీకొని ఒకే కుటుంబంలో నలుగురు గాయపడిన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. తవళం పంచాయతీ చౌకిళ్లవారిపల్లెకు చెందిన సుబహాన్(27) తన భార్య రమీజా(25), కుమారుడు నవాజ్‌బాషా(6), కుమార్తె ఉమియా తస్లీమ్(3)తో కలిసి బైక్‌లో వెళుతుండగా కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద మరో ద్విచక్రవాహ నం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో గాయపడ్డారు. ప్రమాదంలో సుబహాన్, రమీజా తీవ్రంగా గాయపడగా, ఇద్దరు పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
హామీల ఊసెత్తని బాబు
రాజంపేట రూరల్ : ఎన్నికల సమయంలో రాజంపేటకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కదాని ఊసెత్తని సీఎం చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని రాజంపేటకు వస్తున్నాడని ఏపీసీసీ కార్యవర్గ సభ్యుడు అత్తింజేరి శ్రీనాథ్ ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం డీసీసీ నాయకులు వెంకటేష్, శ్రీనివాసులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని బహిరంగ సభలో ఇచ్చిన హామీ ఏమైందని బాబును నిలదీశారు. అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణం హామీని గాలికి వదిలేసి రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలుమదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చెదలవారిపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి బాలాజీ(20) సొంత పనులపై బైక్‌లో పుంగనూరుకు వస్తుండగా, మార్గమధ్యంలోని నల్లగుట్టపల్లె వద్ద ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా సత్యసాయిజిల్లా కదిరి పట్టణం ఆర్ఎస్.రోడ్డుకు చెందిన అన్నదమ్ములు దాదాపీర్(20) అతడి తమ్ముడు అక్బర్(17) కురబలకోట మండలం అంగళ్లులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బైక్‌లో అమ్మమ్మ ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యంలోని విశ్వం కళాశాల వద్ద కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లెకు చెందిన ద్వారకనాథ్ భార్య లీలావతి(36) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోనే ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో వాల్మీకిపురం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిమ్మనపల్లె పోలీసులు విచారణ చేస్తున్నారు. పాత విధానంలో పరీక్షలు నిర్వహించాలి రాయచోటి : పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబీర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం బుక్లెట్ అసెస్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఉపాధ్యాయులకు ఆటంకం కలుగుతున్నందున పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఆదివారం రాయచోటిలోని వైవీ నాగిరెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణంలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి పూర్తిగా మినహాయించాలన్నారు. ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల విధానాన్ని పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డిముని సుధాకర్, చిన్నమండెం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సహాధ్యక్షుడు కఫాయత్, వీరబల్లి మండల ప్రధాన కార్యదర్శి అమీనుల్లా, లక్కిరెడ్డిపల్లి నాయకులు రఖీబ్, ఆదిల్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి
రాయచోటి టౌన్ : రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిల పక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలోని డాక్టర్ అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. ఈశ్వర్ మాట్లాడుతూ రాయలసీమలోనే అత్యంత వెనకబడిన ప్రాంతం రాయచోటి అన్నారు. అలాంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచడం వలన ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. బాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన కోసమని మంత్రివర్గ కమిటీ వేశారన్నారు. దీనివలన అన్నమయ్య జిల్లా ప్రజల్లో ఆందోళన, గందరగోళం నెలకొందన్నారు. అన్ని అర్హతలు ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకుడు రామాంజనేయులు, బీసీ సంఘం నాయకులు విజయభాస్కర్, నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ నాయకుడు విశ్వనాథ, రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాసులు, రమణ, వడ్డెర సంఘం, విద్యావంతుల వేదిక నాయకుడు చంద్రశేఖర్, ఏపీటీఎఫ్ నాయకుడు హరిబాబు, జనసేన నాయకుడు రామశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
రాజంపేట రూరల్ : రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ఎదుట ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు సోమవారం పర్యటనలో ప్రకటించాలన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ.సికిందర్, కార్మిక నాయకులు మహమ్మద్ హుస్సేన్, వేముల నరసింహులు, కాయల రమణ, వేంకప్ప, జీ రమణ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. -
అంగళ్లు చెరువులో భవన నిర్మాణ మేసీ్త్ర మృతి
కురబలకోట : వినాయక నిమజ్జనంలో ఓ వ్యక్తి చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు ప్రాంతం మోదుగులపల్లెకు చెందిన మేసీ్త్ర దేవేంద్ర అలియాస్ నాగేంద్ర (35)కు భార్యా పిల్లలు ఉన్నారు. ఇతను కురబలకోట మండలం అంగళ్లులోని ఓ మహిళతో ఐదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మండలంలోని చిన్నతట్టివారిపల్లె గ్రామస్తులు గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆనందంగా పాల్గొన్న ఇతను సమీపంలోని మల్లేశ్వరం చెరువు వరకు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిమజ్జన సమయంలో చెరువులో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. చీకటి కావడంతో అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. ఆదివారం ఉదయం చెరువులో శవమై కన్పించాడు. మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్తాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో పడి మృతి చెందడం పట్ల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరంపులివెందుల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఈనెల 2వ తేదీన మంగళవారం ఉద యం 6.30 గంటలకు స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌కు ఘనంగా నివాళి అర్పించే కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కుల సంఘాల, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పులివెందుల ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విద్యుత్ షాక్‌తో బర్రె మృతిచింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బాలుపల్లి నుంచి గోపులాపురం వెళ్లే దారిలో విద్యుత్ షాక్‌తో బర్రె మృతి చెందింది. బాలుపల్లి గ్రామానికి చెందిన బొమ్మేపల్లె నారాయణమ్మ పశువులను మేపుతుండగా రోడ్డు పక్కగా ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్రెకు, నారాయణమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. బర్రె మృతి చెందగా, నారాయణమ్మ స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని గ్రామస్తులు స్పందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నారాయణమ్మను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బర్రె సుమారు లక్ష రూపాయలు పైగా విలువ చేస్తుందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు. -
పార్వతీ తనయా.. పాహిమాం
పీలేరులో గణనాథుడి విగ్రహానికి హారతి పీలేరు/రాయచోటి: ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా వ్యాప్తంగా 1500 విగ్ర హాలను నిమజ్జనానికి తరలించారు.డప్పుచప్పుళ్లు, మేళాతాళాల మధ్య భక్తులు గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంబర్ల ప్రకారం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ● పీలేరు పట్టణంలో గణేష్ నిమజ్జన సంబరాలు అంబరాన్నంటాయి. గణేష్ విగ్రహాలను ఆదివారం అంగరంగవైభంగా నిమజ్జనం చేశారు. ఉదయం 10 గంటల నుంచే పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం మొదలైంది. స్థానిక నెహ్రూబజార్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం సమీపంలో ఊరేగింపుగా వచ్చిన విగ్రహాలకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అట్టహాసంగా గణేష్ నిమజ్జన సంబరాలు పీలేరు పట్టణంలో భారీ ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలతో పులకించిన పీలేరు -
ఎక్సలెన్స్ బడులు
● ఆటలే పాఠాలు... పోటీలే పరీక్షలు..పతకాలే ఫలితాలు ● సర్కారు బడుల్లో క్రీడా వికాసం ● స్పోర్ట్సు ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపిక మదనపల్లె సిటీ: చిన్నారులకు సమగ్ర వికాసానికి చదువుతో ఆటపాటలూ అవసరమనేది అక్షర సత్యం. మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యమిస్తున్న ఈ కాలంలో ఉదయం నుంచి రాత్రి వరకు తరగతి గదుల్లోనే బాల్యం మగ్గిపోతోంది. ఎక్కువ శాతం పాఠశాలల్లో ఆటపాటలకు చోటే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లె రూరల్ మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలు క్రీడల్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులతో నిత్యం సాధన చేయిస్తున్నారు. ఈ పాఠశాలల్లో తర్పీదు పొందిన వారు జిల్లా, రారష్ట్‌ర స్థాయి జట్టుకు ఎంపికవుతూ సత్తా చాటుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ ఏడాది సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలకు మొదటి ర్యాంకుతో బెస్ట్ స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ అవార్డు–2024–25 ఎంపిక చేశారు. అలాగే మదనపల్లెలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మూడవ ర్యాంకు సాధించి బెస్ట్ స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కించుకుంది. అవార్డులను సెప్టెంబర్ 5వతేదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందజేయనున్నారు. ముందంజలో జెడ్పీ క్రీడాకారులు: ఎస్జీఎఫ్ పోటీల్లో మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు ముందజలో ఉన్నారు. ప్రధానంగా నెట్‌బాల్,హాకీ, బాల్‌బ్యాడ్మింటన్, త్రోబాల్, హ్యాండ్‌బాల్ క్రీడల్లో రాణిస్తున్నారు. ● మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు రోప్‌స్కిప్పింగ్, పుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రెజ్లింగ్, కరాటే, అథ్లెటిక్స్ విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాల నుంచి 60 మంది క్రీడాకారులు తొమ్మిది అంశాల్లో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. ముగ్గురు జాతీయ స్థాయి పోటీలకు, 44 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు మొదటి ర్యాంకు ప్రకటించారు. గత ఏడాది కూడా మొదటి స్థానం దక్కించుకున్నారు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలకు తృతీయ స్థానం: మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఈ ఏడాది 24–25 సంవత్సరానికి మూడవ ర్యాంకు సాధించారు. పాఠశాలలో రోప్స్కిప్పింగ్లో జాతీయ,రాష్ట్ర స్థాయిల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. దీంతోపాటు హాకీ, పుట్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు.గత 23–24 అయిదవ స్థానం వచ్చింది. 22–23 లో మొదటి స్థానం వచ్చింది. మూడవ స్థానం దక్కించుకున్న మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల హాకీ ఆడుతున్న సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు పాఠశాలకు గుర్తింపు స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ అవార్డు రావడంతో పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చింది. పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడానికి వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. –చంద్రశేఖర్,హెచ్ఎం, సీటీఎం జడ్పీహెచ్ఎస్ క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. హెచ్ఎం సుబ్బారెడ్డి సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు నైపు ణ్యం సాధించి ప్రతిభ కనబరుస్తున్నారు. మూడవ స్థానం రావ డం సంతోషంగా ఉంది. –దేవకమ్మ, పీడీ, జెడ్పీహెచ్ఎస్, మదనపల్లె జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు పాఠశాలలో మెరికల్లాంటి క్రీడాకారులున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం రావ డం సంతోషంగా ఉంది. –నాగరాజు పీడీ, సీటీఎం, జెడ్పీహెచ్ఎస్ -
నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
నేడు రాజంపేటకు ముఖ్యమంత్రి రాక రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పర్యటనకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా వేదిక నిర్మాణం, పాల్గొనే లబ్ధిదారులు కూర్చవడానికి అవసరమైన సదుపాయాలు, తాగునీటి వసతి, శానిటేషన్, పార్కింగ్ సంబంధిత ఏర్పాట్లన్నీ పూర్తి అయినట్లు తెలిపారు. ఎటువంటి లోపాలు లేకుండా అధికార బృందాలు సకాలంలో పనులు పూర్తి చేసారన్నారు. సీఎం స్వయంగా పలుకురించబోయే రజక లబ్ధిదారుల జాబితా, వారికి అందించేబోయే ప్రయోజనాలు, సౌకర్యాలు క్షుణ్ణంగా సమీక్షిస్తారన్నారు. సమావేశానికి హాజరైయ్యే ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వేదిక పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పబ్లిక్ అండ్ సిస్టమ్, సీసీ కెమరాలు, క్షేత్రస్ధాయి భధత్రా బలగాలను విస్తృతంగా మోహరించామన్నారు. పర్యటన ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌తో పాటు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, ఎఎస్పీ వెంకటాద్రి జెసీ ఆదర్శరాజేంద్రన్, సబ్‌కలెక్టర్ భావన, మదనపల్లె సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. సోమవారం ఉదయం 11.50 గంటలకు రాజంపేట మండలంలోని మన్నూరులోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 గంటలకు పెద్దకారంపల్లెకు చేరుకుంటారు. ఫించన్ లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతారు. బోయనపల్లెలని దోబిఘాట్ వద్ద రజకులతో సీఎం భేటి అవుతారు. 1.15 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడే ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హెలిప్యాడ్ చేరుకొని తిరుగుపయనం అవుతారు. పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1.30గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి జక్కూరు ఎయిర్‌డ్రోంకు 1.50గంటలకు చేరుకుంటారు. 2గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 2,.50గంటలకు పులివెందులలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.55గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 3.గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 3 నుంచి రాత్రి 7.30 వరకు క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకం కానున్నారు. 7.30కి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి 7.35కు తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా ఉదయం 6.45గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన నేరుగా ఇడుపులపాయకు బయలుదేరతారు. 7.15గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ఉదయం 7.15గంటల నుంచి 8గంటలవరకు వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 8గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి బయలుదేరుతారు. 10.30గంటలకు అంబకపల్లెకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.30 వరకు అంబకపల్లె గ్రామంలోని గంగమ్మ కుంట చెరువు వద్ద నీటికి జలహారతి ఇవ్వనున్నారు. 11.30కి అంబకపల్లె గ్రామం నుంచి బయలుదేరి 12.30కి పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. 2.25కు తన నివాసం నుంచి బయలుదేరి 2.30కి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2.30 నుంచి 7.25 వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో ఆయన మమేకం కానున్నారు. 7.30కి భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే ఆయన బస చేయనున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 7గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరి 7.05గంటలకు అదే ప్రాంతంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 7.15కు హెలీక్టాపర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. 8.30గంటలకు యలహంకలో ఉన్న తన నివాసానికి చేరుకుంటారు. 2న ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి, ప్రత్యేక ప్రార్థనలు -
పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు
రాయచోటి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేటలో సీఎం పర్యటన నేపథ్యంలో గ్రీవెన్స్ సెల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావద్దని కోరారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తులు కరుణించమ్మా అంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆదివారం ఆలయంలో అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించి వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు తలనీలాలు సమర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని జిల్లా తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, కార్యదర్శి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. మాస్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో వేదాష్, కె. భాను చేతన్ రెడ్డి, జితేష్ రెడ్డి, రెడ్డెమ్మ, చరణ్ సాయి, హేమశ్రీ స్వర్ణపతకాలు కై వసం చేసుకున్నారన్నారు. మణికంఠ రజత పతకం, సుషాత్, వర్షిత్, నాగ చైతన్య గౌడ్, సాజియా, వైష్ణవి, నవ్యశ్రీ, కీర్తి, మౌనిష్, మోక్షిత్, హర్షవర్దన్ రెడ్డి కాంస్యపతకాలు సాధించారని చెప్పారు. -
● ‘అన్నమయ్య’కు మోక్షం ఎప్పుడో?
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు....అన్నింటికీ నాదే బాధ్యత అంటూ చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. బాబు గారూ గుర్తున్నాయా? అంటూ అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే ఒకటేమిటి...అనేక రకాలుగా జిల్లాను తీర్చిదిద్దుతామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అడుగులు పడలేదు. అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా అభివృద్ధి జాడ కనిపించలేదు. అక్కడక్కడ రోడ్లు తప్ప జిల్లాలో అభివృద్ధి పనుల జాడ చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. రాయచోటి, మదనపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో అధికారంలోకి రాగానే రూపురేఖలు మారుస్తామన్న హామీల అమలులో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని మేధావులు అభివర్ణివస్తున్నారు. హార్టికల్చర్ హబ్ మాటేమిటి? 2014లో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చేముందు...వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు జిల్లాకు అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతంలో బొప్పాయి, మామిడి, అరటి, ఇతర అనేక రకాల పండ్ల తోటలు సాగులో ఉన్న దృష్ట్యా హార్టికల్చర్ హబ్‌గా చేస్తానని ఒక్కసారి కాదు...అనేకమార్లు హామీ గుప్పించారు. కానీ నాటి నుంచి నేటివరకు కనీసం ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇప్పటికే ఈ ప్రాంత ఉద్యాన రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇతర అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయితే బాబు ఇచ్చిన హామీ రూపు దాల్చకపోవడంతో ఇప్పటికీ అన్నదాతల కష్టం ఎవరూ తీర్చలేనిదిగా మారిపోయింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేకమార్లు హామీలు ఇచ్చినా ఉద్యాన హబ్ నిర్మాణం జరగలేదు. రాయచోటిలో కనిపించని అభివృద్ధి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో సార్వత్రిక ఎన్నికలకు పది రోజుల ముందుగా భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన సందర్బంలో చంద్రబాబు రాయచోటి రూపురేఖలు మారుస్తామని చెప్పినా కనీసం పెండింగ్ పనులకు మోక్షం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టిన అనేక రకాల అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రత్యేకంగా రాయచోటికి కూటమి సర్కార్‌లో నిధుల వర్షం కురవలేదు. మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఎంఐజీ లే అవుట్, శిల్పారామం, క్రికెట్ స్టేడియం, నగర వనం, ఇతర అనేక అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి. మదనపల్లె మెడికల్ కళాశాలపై నీలి నీడలు మదనపల్లె అభివృద్ధికి చాలా హామీలు ఉన్నా అమలు దిశగా అడుగులు పడటం లేదు. రోడ్లు మొదలుకొని మార్కెట్ల వరకు ఎన్నెన్నో మార్పులు తీసుకు వస్తామన్నా క్షేత్ర స్థాయిలో ఆవగింజంత కూడా అభివృద్ధి కనిపించడం లేదు. పైగా వైఎస్ జగన్ సర్కార్ మదనపల్లెకు మెడికల్ కళాశాల మంజూరు చేసి భవనాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించాలని ఏర్పాట్లు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్లను కూడా కేటాయించకపోవడంతో కళాశాలపై నీలినీడలు అలుముకున్నాయి. రానున్న కాలంలో మెడికల్ కళాశాల ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాబు ఇచ్చిన హామీల అమలుకు ఎదురుచూపులు అన్నమయ్య ప్రాజెక్టుకు పడని అడుగులు అధికారంలోకి వచ్చినా మదనపల్లె వైద్య కళాశాలను పట్టించుకోని వైనం హార్టికల్చర్ హబ్ అని ఎన్నిమార్లు చెప్పినా అతీగతీ లేని స్థితి కొత్త జిల్లాలపై స్పష్టత ఇవ్వాలంటున్న ప్రజలు నేడు రాజంపేటకు రానున్న సీఎం చంద్రబాబు జిల్లాలో భారీ వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటి ప్రవాహానికి పింఛాతోపాటు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. అయితే అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టును మహోన్నత ఆశయంతో నూతన టెక్నాలజీ ద్వారా నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి....టెండర్ల వరకు తీసుకు వచ్చినా తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ టెండర్లను రద్దు చేసింది. అంతేకాకుండా మళ్లీ రీ డిజైన్ చేసి ప్రతిపాదనల దశలోనే మూలుగుతోంది. మరీ ప్రాజెక్టు ఎప్పుడు కడతారో సీఎం గారు చెప్పాలని రాజంపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయలేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించి అభివృద్ధి చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం మండలాలు, నియోజకవర్గాలతోపాటు జిల్లా కేంద్రాల మార్పు లు, చేర్పులపై ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ప్రజల్లో రోజురోజుకు ఆందోళన రేకెత్తుతోంది. అయితే గతంలో రాజంపేటతోపాటు మదనపల్లెలను జిల్లాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. అయితే రాయచోటిని కూడా జిల్లా కేంద్రంగా కొనసాగిస్తూనే అభివృద్ధి చేస్తానని బాబు జనాల సాక్షిగా మాటిచ్చారు. ప్రస్తుతం అటు మదనపల్లె, ఇటు రాయచోటి, రాజంపేటల్లోనూ ఎక్కడికక్కడ జిల్లాల విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాల విభజనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా సీఎం హోదాలో చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తే ఊహాగానాలకు తెరపడుతుందని ప్రజలు భావిస్తున్నారు. -
కూటమి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరుదు కల్యాణి రాజంపేట: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరుదు కల్యాణి అన్నారు. ఆకేపాటి ఎస్టేట్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి అధ్యక్షతన మహిళా కమిటీల ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సంఘటితంగా ఏర్పడాలన్నారు. బూటకపు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చాక మోసం చేసే విధంంగా పాలన సాగుతోందన్నారు. అక్రమకేసులకు భయపడే ప్రసక్తిలేదన్నారు. మహిళ నేతలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని మహిళా విభాగాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెన్నుదున్నగా మహిళాలోకం నిలబడాలన్నారు. 2029లో ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఇప్పటి నుంచి ముందుకుసాగాలన్నారు. అవసరమైతే శాంతియుత పోరాటాలను చేయాల్సి వస్తుందన్నారు. కమిటీలో నియమితులైన మహిళా నేతలు నిరంతరం మహిళలను చైతన్య వంతులు చేసేందుకు కృషిచేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా ముందుకుసాగాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వరుదుకల్యాణి నేతృత్వంలో రాష్ట్ర మహిళా విభాగం బలోపేతం దిశగా పయనిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళల ఆశీర్వావాదాలు ఉండేలా కృషిచేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరిరెడ్డి, అనిశారెడ్డి, ఏకుల రాజేశ్వరరెడ్డి, గౌరీ, మిరియాలసురేఖ, మమత తదితరులు పాల్గొన్నారు. ● వరుదు కల్యాణిని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి ఘనంగా సన్మానించారు. -
పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు
రాయచోటి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్సును రద్దు చేసినట్లు ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాజంపేటలో సీఎం పర్యటన నేపథ్యంలో గ్రీవెన్సెల్ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదివారం ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసాలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని పేర్కొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జర్మన్ నర్సింగ్ ట్రైనింగ్ ప్రోగ్రా మ్ను ఉచితంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ జి.రాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై నర్సింగ్ డిగ్రీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. వయసు 20 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. జిల్లాలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేయనున్నారని ఎంపికై న అభ్యర్థులకు 8 నుంచి 10 నెలల పాటు తిరుపతిలో శిక్షణ ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీ లోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలను ఆలయ చైర్మన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప టెలికాం ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ రిజిస్టర్ నంబర్ 1415 కడప వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు సుబ్రహ్మణ్యం, మురళి పేర్కొన్నారు. శని వారం నగరంలోని బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులుగా కళ్యా సుధాకర్, ఉపాధ్యక్షులుగా ఆకుల సుబ్బారావు, కార్యదర్శిగా ఎం.సి.సుబ్బారెడ్డి, సభ్యులుగా ఎ.వెంకటేశ్వర్లు, బి.నాగరాజు, ఎం.రఘురామయ్య, వి.వెంకట రమణయ్య ఎన్నికయ్యారని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగుల ఇంటి స్థలాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సొసైటీ తరఫున ఉద్యోగులకు, పెన్షనర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. -
మద్యం సిండికేట్!
సాక్షి రాయచోటి: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బరితెగింపులు, దౌర్జన్యాలు, దాడులు, ఆగడాలు పెరిగిపోయాయి. ఎక్కడ ఏం చేయాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుండగా, మరొకవైపు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆర్థిక వనరులపై దృష్టి పెట్టారు. ఎక్కడ అవకాశం ఉన్నా నయానో, భయానో చేజిక్కించుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే బ్రాందీ షాపులకు సంబంధించి ఎవరూ టెండర్లు వేయకుండా అడ్డుపడిన కూటమి నేతలు మరొకమారు బార్ల విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తున్నారు. మద్యానికి సంబంధించి సిండికేట్‌గా మారి బార్లను చేజిక్కించుకోవడంతోపాటు ఎవరూ టెండర్ల వైపు వెళ్లకుండా చూసుకోవడం కొసమెరుపు. ● జిల్లాలో 11 ఓపెన్ బార్లు, ఒక రిజర్వుడ్ బార్‌కు సంబంధించి టెండర్లను ఆహ్వానించారు. అయితే వారం రోజులు అవకాశం ఇచ్చినా దరఖాస్తుకు ఎవరూ ముందుకు రాలేదు. రాయచోటిలో 1 బార్‌కు నలుగురు, మరొక బార్‌కు సంబంధించి నలుగురు దరఖాస్తు చేసుకోగా, రిజర్వుడు కేటగిరీ కింద వచ్చిన బార్‌కు సంబంధించి ఐదు దరఖాస్తులు, రాజంపేటలోనూ ఒక బార్‌కు నలుగురు, మదనపల్లెలో ఒక్కో బార్‌కు సంబంధించి ఐదుగురు దరఖాస్తుచేశారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక బార్‌కు నలుగురు దరఖాస్తు చేస్తేనే లాటరీ ద్వారా డిప్ తీసి ఖరారు చేస్తారు. ప్రతి దానికి కరెక్టుగా నలుగురే వేయడం చూస్తే సిండికేట్ కాకుండా మరేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. భారీగా రావాల్సిన దరఖాస్తులు కేవలం లక్కీ డిప్ తీసేందుకు అవసరమైన మేరకే రావడం సిండికేట్ వ్యవహారాన్ని బలపరుస్తోంది. ఇప్పటికే కూటమి సర్కార్ విచ్చలవిడిగా మద్యం షాపులతోపాటు బెల్ట్ షాపులను తెరిచి ప్రజలకు నిత్యం మద్యం లభించేలా చర్యలు చేపట్టారు. ఇది కాదా సిండికేట్? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది, అది అంటూ ఏమి లేదు. ఏదైనా సాధ్యమేనని ఇట్టే తెలిసిపోతోంది. అందులో భాగంగా 11 ఓపెన్ బార్లతోపాటు మరో రిజర్వుడు కేటగికి కింద బార్‌కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తే ఒక్కో బార్‌కు నలుగురు, మరో బార్‌కు ఐదుగురు మాత్రమే దరఖాస్తుచేశారు. కూటమి నేతలు భయపెట్టారో...లేక వేయవద్దని చెప్పారో తెలియదుగానీ దరఖాస్తుకు చాలామంది వెనుకంజ వేశారు. ఉన్న వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని నలుగురు కలిపి బార్లకు దరఖాస్తు చేయడం ఎవరికి వచ్చినా అందరూ కలిసిమెలిసి చేసుకునేలా పథక రచన చేసినట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్ హయాంలో మద్యం సిండికేట్‌గా మారి బార్లను దక్కించుకుంటున్నారు. లక్కీడిప్‌కు అర్హత సాధించని నాలుగు బార్లు కూటమి సర్కార్‌లోని పెద్దలు భయపెట్టారో, లేక దరఖాస్తు చేయవద్దని చెప్పారోగానీ పలు బార్లకు లక్కీడిప్‌కు అవసరమైన దరఖాస్తులు రాలేదు. మదనపల్లెలో రెండు బార్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తు రాగా, పీలేరులో ఒక బార్‌కు సంబంధించి రెండు దరఖాస్తులు, రాయచోటిలో ఒక బార్‌కు సంబంధించి ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో వాటిని పరిగణలోకి తీసుకోలేదు. సాధారణంగా నాలుగు దరఖాస్తులు వస్తేనే లక్కీ డిప్ వేయడానికి అర్హత సాధించినట్లు ప్రభుత్వ లెక్క. అయితే దరఖాస్తులు రాకపోవడంతో వాటిని డిప్ తీయలేదు. అయితే మరొకసారి వాటికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉంది. ఒక్కోబార్‌కు పరిమితికి నాలుగు దరఖాస్తులు రావాలంటే అన్నీ వచ్చినట్లు లెక్క అనుకున్న వారే వేశారు.. వారే దక్కించుకున్నారు టీడీపీ ఆగడాలు, బెదిరింపులులతోచాలామంది వెనుకడుగు పలు షాపులకు లక్కీ డ్రా తీసిన జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా 11 ఓపెన్ బార్లకు, ఒక రిజర్వ్డ్ బార్‌కు లాటరీ ద్వారా కేటాయింపు జరిపామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. మదనపల్లె డివిజన్లో మూడు , రాయచోటిలో రెండు , రాజంపేటలో రెండు, కల్లుగీత కార్మికులకు ఒక రిజర్వ్డ్ బార్ సహా మొత్తం 11 ఓపెన్ బార్లకు, ఒక రిజర్వ్డ్ బార్‌కు లాటరీ ద్వారా కేటాయించామని వివరించారు. మదనపల్లెలో ఎ.రాజన్న, బి. మనోహర్, బి.నాగరాజులు, రాయచోటిలో దొండ్ల హర్షవర్ధన్, పేరం ఇరగంరెడ్డి, రాజంపేటలో కె.సురేష్ కుమార్ నాయుడు, కె. సుబ్బయ్యలు, అలాగే కల్లుగీత కార్మికులకు రిజర్వ్డ్ బార్ కేటాయింపులో బి.కొత్తకోట బార్‌ను కె.ఆదిత్యకు లాటరీ డ్రా ద్వారా కేటాయి ంచామని కలెక్టర్ తెలిపారు. మిగిలిన నాలుగు బార్లకు తగినన్ని దరఖాస్తులు రాకపోవడంతో లాటరీ నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు. -
● ఉల్లి రైతుల కంట కన్నీరు
కమలాపురం జెడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉల్లి సాగు చేసిన రైతులు ధరలు లేక కంట తడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంటను సభలో ఆమె ప్రదర్శిస్తూ కష్టాలను వివరించారు. ఎకరాకు సుమారు 80 వేల రూపాయల ఖర్చవుతోందని తెలిపారు. మార్కెట్లో వ్యాపారులు క్వింటాలు రూ. 800–900లతో కొనుగోలు చేస్తుండడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం క్వింటాలు రూ. 1200 ఇస్తామని చెబుతోందని, క్వింటాలు రూ. 1800–2000లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ కింద కొనుగోలు చేసి ఆదుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలయ్య కోరారు. ● బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న ధరతో యూరియా ఎక్కడా రైతులకు అందుబాటులో లేదన్నారు. బస్తా సుమారు రూ. 500తో విక్రయిస్తున్నారన్నారు. అధిక ధరకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లంచం లేకుండా నాడు–నేడు బిల్లులు చెల్లించడం లేదన్నారు. -
అన్నదమ్ములపై హత్యాయత్నం
మదనపల్లె రూరల్/ములకలచెరువు : ఆస్తి తగాదాల కారణంగా వ్యక్తిగత కక్షలతో అన్నదమ్ములపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు...బురకాయలకోటకు చెందిన రామచంద్ర, హరికుమార్, భారతీయుడు అన్నదమ్ములు. వీరికి కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బంధువులు భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్కు మధ్య భూతగాదాలు ఏర్పడ్డాయి. కోర్టులో హరికుమార్కు అనుకూలంగా భూమికి సంబంధించి తీర్పులు వచ్చాయి. దీంతో భూమి తమకు దక్కదని భావించిన భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్‌లు కక్ష పెంచుకుని మరి కొందరితో కలిసి శనివారం తెల్లవారుజామున బురకాయలకోటకు వెళ్లి నిద్రిస్తున్న అన్నదమ్ములు రామచంద్ర, హరికుమార్, భారతీయుడుపై కర్రలు, ఆయుధాలతో మూకుమ్మడిగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో బాధితులను సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ పరామర్శించారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల సమీంలోని ఓ హోటల్ సమీపంలో బొలేరో పికప్ వాహనం పాత సామాన్ల లోడుతో రాయచోటి వెళుతుండగా టైర్ పంచర్ అయింది. ఈ క్రమంలోనే కలకడ వైపు నుంచి వస్తున్న కారు ఆగి వున్న బొలేరో పికప్ వాహనాన్ని అదుపు తప్పి ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రిషికొండపై ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం కడప కార్పొరేషన్ : విశాఖపట్నంలోని రిషికొండపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారని వైఎస్సార్సీపీ వైద్య విభా గం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిషికొండపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ నిర్మించారని, ఆ భవనాల నైపుణ్యంపై చంద్రబాబే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. తాజాగా ఆ భవనాల్లో సేనానితో సేన ఒక సమ్మిట్ ఏర్పాటు చేసుకొని ఆ హాల్లో ఒక ఫాల్ సీలింగ్ ఊడిపడిన దాన్ని పట్టుకొని విష ప్రచారానికి తెరతీశారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుందే తప్పా వాటర్ లీకేజీ వల్ల పాడై పడినట్లు లేదన్నారు. ఈ భవనాలు కట్టడం వల్ల రూ.400 కోట్లు వృథా అయ్యాయని చూపించబోయి బొక్కబోర్లా పడ్డారన్నారు. ఈ భవ నాలపై రూ.750 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభు త్వం ప్రయత్నిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలాగా వృథా ఖర్చులు చేయలేదన్నారు. యో గాంధ్ర పేరుతో ఈ ప్రభుత్వం రూ.400కోట్లు ఖర్చు చేసి కాళ్లు లేనివారికి, చిన్నపిల్లలకు, చనిపోయిన వారికి సైతం యోగా చేసినట్లు సర్టిఫికెట్లు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. సుగాలి ప్రీతి వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారే తప్పా వారికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఐదు సెంట్ల స్థలం, తల్లిదండ్రులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారని గుర్తు చేశారు. వైఎస్సార్టీయూసీ నగర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. క్లస్టర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ బదిలీలలో సర్‌ప్లస్‌గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గణితంతోపాటు భాషా పండితుల పోస్టుల్లో క్లస్టర్ టీచర్లుగా నియమితులైన వారికి డీఎస్సీ 2025 నియామకాల కంటే ముందుగా రెగ్యులర్ స్థానాలను కేటాయించాలని ఎస్.టీ.యు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా, రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె.సురేష్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్ చెన్నకేశవరెడ్డి కోరారు. ఈ విషయమై శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామకాల కంటే ముందుగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పదవీ విరమణ స్థానాలను, డీఎస్సీ 2025లో చూపించనున్న ఖాళీలలో ఈ క్లస్టర్ టీచర్లకు రెగ్యులర్ స్థానాలను కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు. -
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. శనివారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 90 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. ఆ జట్టులోని జెనిక్ దాస్ 197 బంతుల్లో 12 ఫోర్టు, 2 సిక్సర్లతో 109 పరుగులు, రెడ్డి రుషిల్ 142 బంతుల్లో 84 పరుగులు, తేజ రెడ్డి 64 బంతుల్లో 60 పరుగులు, బీఎం వెంకటేష్ 92 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కడప జట్టులోని ఎస్ఎండీ అస్లామ్ 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో తొలి రోజు నెల్లూరు–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 82 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్. సోహన్ వర్మ 209 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 166 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. పవన్ రిత్విక్ 79 పరుగులు, మాధవ్ 43 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని అక్షిత్‌రెడ్డి 2 వికెట్లు, సాయి ప్రణవ్ చంద్ర 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
వ్యాపారుల సిండికేటు.. రైతులకు చేటు
● వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంతో బొప్పాయి రైతుల ఆందోళన ● ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన ● అధికారులు స్పందించాలని వేడుకోలుఓబులవారిపల్లె : ఉత్తర భారతదేశానికి చెందిన సేట్లు సిండికేట్ కావడంతో ఉద్యాన పంటలకు పేరు గాంచిన రైల్వేకోడూరు ప్రాంతం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు నిర్ణయించిన ధరకే రైతులు తమ పంటను అమ్ముకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో బొప్పాయి రైతుకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు.. బొప్పాయి రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను రైతులు కోరగా ఆగస్టు ఒకటో తేదీ జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి సేట్‌తో అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఐదో తేదీ వరకు రూ. 9లు, ఆరో తేదీ నుంచి పది రూపాయలు కనీస ధర అమలు చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు కొన్ని రోజుల పాటు తొమ్మిది రూపాయలతో అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ధర రూ. 5కు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అధికారులు కూడా కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. సిండికేట్‌తో దగా పడుతున్న రైతు.. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు తదితర కారణాలు నెపంగా చూపి సేట్ వ్యాపారులు సిండికేట్ కావడంతో బొప్పాయి ధర కిలో ఐదు రూపాయలుగా నిర్ణయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆత్మహత్యలే శరణ్యం.. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో దాదాపు 7300 ఎకరాల్లో బొప్పాయి సాగులో ఉంది. ఎకరాకు సాగు చేయడానికి రూ. 70 వేలు నుంచి రూ. 80 వేలు ఖర్చు వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బాధలు అన్నింటినీ తప్పించుకున్న రైతు పంట కోత కోసే సమయానికి సేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఎంత కష్టపడినా, అప్పులు చేసి పంటలు పండించినా రైతులకు నష్టాలు వస్తుండటంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉత్తర భారత సేట్ వ్యాపారులను, దళారులను నియంత్రించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధరలు కల్పించకపోతే చనిపోతామని చిట్వేలి బొప్పాయి రైతులు బహిరంగంగా అధికారులకు వీడియో ద్వారా సామాజిక మాధ్యమాలలో తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి బొప్పాయి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ధర లేదు.. ఇటీవల కాలంలో బొప్పాయి ఇంత తక్కువగా ఎప్పుడూ అమ్ముడు పోలేదు. ఐదు రూపాయలు ధర నిర్ణయించడం ఏమిటి. దళారులు మా లాంటి రైతులను దోచుకోవడానికి చేస్తున్న కుట్ర. పట్టించుకునే వారు ఎవరూ లేరా. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయరా.. ఇక మా పరిస్థితి ఏమిటి. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. టంగుటూరి కృష్ణారెడ్డి, బొప్పాయి రైతు, గాడివారిపల్లి, ఓబులవారిపల్లికలెక్టర్ ఆదేశాల అమలులో విఫలం.. బొప్పాయి ధర కనీసం రూ. 10లుగా జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించగా దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ఐదు రూపాయలు నిర్ణయించడం ఏమిటి. జిల్లా కలెక్టర్ స్పందించి వ్యాపారులపై కేసులు నమోదు చేయాలి. దళారీ వ్యవస్థను రద్దు చేసి లైసెన్సు వ్యాపారాన్ని ప్రారంభించాలి. సీహెచ్ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు -
యువతికి పాముకాటు
రామసముద్రం : పాడి ఆవులకు మేత వేసేందుకు వెళ్లిన యువతిని విష సర్పం కాటేసిన సంఘటన శనివారం రామసముద్రం మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చెంబకూరుకు చెందిన టి. బాబు కూతురు టి. అంజుమ్ (19) ఇంటికి సమీపంలోని పొలం వద్ద ఉన్న పాడి ఆవులకు మేత వేసేందుకు వెళ్లింది. అక్కడ గడ్డి మధ్యన ఉన్న ఓ విష సర్పం ఆమె కాలిపై కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె.మల్లిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా కడపలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ విశేషమైన సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని బిరుదు ఇచ్చిందే తప్ప వారికి వేతనాలు పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆశాల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత ఆశాలను మర్చిపోవడం సరి కాదన్నారు. డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆశాలకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్. శాంతి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గంగాధర్, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరి కె.సి. బాదుల్లా, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కల్పన తదితరులు పాల్గొన్నారు.ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె.మల్లిక -
రాయచోటిలో సెప్టెంబర్ 4న 5–కే రన్
రాయచోటి: సెప్టెంబర్ 4వ తేదీన 5కె రెడ్ రన్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె లక్ష్మీ నరసయ్య పేర్కొన్నారు. శుక్రవారం యూత్ ఫెస్ట్–2025లో భాగంగా హెచ్ఐవీ, ఎయిడ్స్, ఎస్టీఐపై అవగాహన కోసం యువతకు మారథాన్ నిర్వహించే విషయంపై రాయచోటిలోని డీఎంహెచ్ఓ ఛాంబర్లో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ, అడిషనల్ డీఎంహెచ్ఓ రమేష్ బాబులు కార్యక్రమం నిర్వహణపై అధికారులు, సిబ్బందితో చర్చించారు. 4వ తేదీ ఉదయం 5.30 గంటలకు స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (బాలుర) నుంచి నారాయణ రెడ్డిపల్లి వరకు 5కె రన్ ఉంటుందన్నారు. పరుగు పోటీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వారు పాల్గొనవచ్చన్నారు. పోటీలలో గెలుపొందిన పురుషులకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు వేర్వేరుగా మొదటి బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 7 వేలు ఇవ్వనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో కూడా పాల్గొనవచ్చన్నారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) అధికారి ఎం రామ్మోహన్ రెడ్డి, గుర్రప్ప, జిల్లా క్రీడా శాఖాధికారి మస్తాన్, గౌస్ బాష, జిల్లా నెహ్రూ యువకేంద్రం మై భారత్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఇంటర్ విద్యాశాఖ డీఐఈఓ రవి, జిల్లా రెడ్ రిబ్బన్ క్లబ్ కో–ఆర్డినేటర్ వెంకటరావు, విశ్వ ప్రసాద్, క్లస్టర్, ప్రోగ్రామ్ మేనేజర్ వి భాస్కర్, క్రీడాశాఖ కోచ్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని సేవించుకొన్నారు. కార్యక్రమంలో అర్చకులు కృష్ణరాజ బట్టార్, రాజుస్వామి, గోకుల్స్వాములు పాల్గొన్నారు. -
దోస..రైతుకు గోస
ఈయన పేరు తాటిగుట్ల ధర్మారెడ్డి. వీరబల్లి మండలం, ఓదివీడు గ్రామం. పది ఎకరాల్లో దోపంట సాగు చేశాడు. ఇందుకోసం రూ. 12 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తోటనిండా కాయలు కనిపించడంతో మంచి ఆదాయం వస్తుందని ఆశించాడు. వ్యాపారుల సిండికేట్ వల్ల ధరలు పలకలేదు. వారం నుంచి ధరలు అనుకూలిస్తున్నా దిగుబడుల సమయంలో పంట దెబ్బతిన్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో దోసపంటను పొలంలోనే వదిలేశాడు. రాయచోటి: జిల్లాలో దోససాగు చేసిన రైతు కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు. వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంటకు మార్కెట్లో నిలకడలేని ధరలు, దళారుల మోసాలు, ఊజీఈగ వైరస్ దాడులతో దోస రైతుకు పెట్టుబడులు కూడా దక్కక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో దాదాపు మూడువేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వివిధ రకాల దోస పంటను రైతులు సాగు చేశారు. కొనేవారు లేకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. ● దోసపంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధర పతనం కావడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ధరలు, మార్కెట్ మాయాజాలంతో ఓవైపు నష్టపోతుంటే మరోవైపు కల్తీ విత్తనాలు మరింత కుంగదీస్తున్నాయి. వారం కిందటి వరకు టన్ను రూ. 4 వేలు నుంచి రూ. 5 వేల లోపు పలికింది. ప్రస్తుతం వర్షాలు కురవడం, ఊజీ వైరస్ వ్యాప్తితో కాయలు దెబ్బతిన్నాయి. సాధారణంగా ఎకరా పొలంలో దోస సాగుచేస్తే పది నుంచి 12 టన్నులు దిగుబడి వస్తుంది. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయలు వరకు పెట్టుబడి వస్తుంది. గత ఏడాది టన్ను దోస ధర రూ. 20 వేలు పలికింది. దీంతో ఎకరాకు రూ. 2 లక్షల వరకు మిగిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో గత ఏడాది ధరే ఈ సారి కూడా ఉంటుందని జిల్లాలో విస్తారంగా ఢిల్లీ, బాబీ తదితర రకాల దోసను సాగు చేశారు. అయితే దిగుబడి వచ్చే సమయానికి దళారుల సిండికేట్ కారణంగా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. మార్కెట్లకు తసుకెళ్లినా కొనేవారు ఉండరన్న అనుమానంతో పంటను కోయకుండానే వదిలేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్లకుపైగా దోస సాగు చేసిన రైతులు నష్టపోయినట్లు హార్టికల్చర్ అధికారుల ద్వారా తెలుస్తోంది. ● దోసపంట మార్కెట్లో ప్రస్తుతం టన్ను రూ. 20 వేలు వరకు పలుకుతుంది. ధరలు అనుకూలిస్తున్నా తెగుళ్లు, ఊజీ ఈగల దాడులతో కాయలు పొలంలోనే కుళ్లిపోతున్నాయి. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మంచి ధర పలుకుతుందన్న ఆశతో సాగు చేస్తే నిరాశే మిగిలిందని రైతులు వాపోతున్నారు. దిగుబడి ఉన్నప్పుడు ధరలేదు..ధర ఉన్నా దిగుబడి లేదు ఊజీ ఈగతో పొలంలోనే కుళ్లిపోతున్న కాయలు జిల్లాలో రూ. 50 కోట్ల నష్టం -
జిల్లా కోసం అన్నమయ్యకు వినతిపత్రం
రాజంపేట : రాజంపేటను జిల్లా చేయాలంటూ జిల్లా సాధనసమితి జెఎసీ ఆధ్వర్యంలో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకు వినతిపత్రం అందజేసే విధంగా వినూత్న నిరసన శుక్రవారం చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న జిల్లా కోసం ఉద్యమంను బలోపేత దిశగా తీసుకెళతామని జెఎసీనేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందుగా రాజంపేటకు వచ్చిన సందర్భంగా చేసిన జిల్లా ప్రకటన వాగ్దానంను అమలుచేయాల్సిన బాధ్యత ఆయనకు ఉందన్నారు. మెడికల్ కాలేజీ ఇస్తాను, అన్నమయ్య జలాశయాన్ని నిర్మితం చేస్తామన్న హామీలను ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. రాజంపేటకు వస్తున్న ముఖ్యమంత్రికి మరోసారి జిల్లా ప్రకటన అంశాన్ని గుర్తుచేస్తామన్నారు. కార్యక్రమంలో జెఎసీ నేతలు పూలభాస్కర్, ఉద్దండం సుబ్రమణ్యం, పోకల ప్రభాకర్,ఆస్లాంషేక్, న్యాయవాది నాసరుద్దీన్, కత్తి సుబ్బరాయుడు, అబుబకర్, కరీం, అదృష్టదీపుడు, మోహన్, నారా శివకుమార్‌నాయుడు,బుజ్జి, రామచంద్రరాజు, జయచంద్ర, మహదేవయ్య, టీచర్ రమణనాయుడు పాల్గొన్నారు. జిల్లా కోసం పోస్టుకార్డుల ఉద్యమం.. రాజంపేటను జిల్లా చేయాలని శుక్రవారం రాజంపేట పోస్టుకార్డుల ఉద్యమంను చేపట్టారు. 4వేల కార్డులను సీఎం, డిప్యూటీ సీఎం, డిలీమిటేషన్ కమిటీ మంత్రులకు పంపారు. రాజంపేట ప్రధాన తపాలాకార్యాలయం పోస్టల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణకు పోస్టుకార్డులను అందజేశారు. కార్యక్రమంలో జెఎసీ కమిటి కన్వీనరు లక్ష్మీనారాయణ, ఏపీరోడ్డు డెవలప్మెంట్ మాజీ డైరక్టరు గండికోట గుల్జార్‌బాష,,ప్రైవేటు పాఠశాల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌నాయుడు, కమిటి నేతలు బాసినేని వెంకటేశ్వర్ల నాయుడు, మాజీ కౌన్సిలర్ మీసాల వెంకటసుబ్బయ్య, న్యాయవాది నాసరుద్దీన్, రమేష్‌నాయుడు,సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఆరోగ్యమాత ఉత్సవాలు ప్రారంభం
కడప సెవెన్‌రోడ్స్: కడప నగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో తిరునాల మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం శాంతి కోసం పావురాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బిషప్ దివ్యబలిపూజ సమర్పించి మాట్లాడారు. తిరునాల ఉత్సవాలు ఘనంగా, సవ్యంగా సాగాలని కోరారు. ప్రజలంతా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేవుడు ప్రజలు ప్రార్థనలు ఆలకించి వారి అభీష్టాలను నెరవేర్చాలని కోరుకుంటున్నామన్నారు. నవదిన జపాలలో తొమ్మిది రోజులు ప్రజలు వేలాదిగా పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాద్‌రావుతోపాటు ఫాదర్ ఎ.జోసెఫ్రాజు, డీన్ రెవరెండ్ ఫాదర్ ఎస్.సురేష్, విచారణ ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి జి.ఆనందరావు, డయాసిస్ గురువులు, ఆరోగ్యమాత, జేయంజె, క్రీస్తు జ్యోతి సిస్టర్స్, తిరునాల కమిటీ పెద్దలు, యువత, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
ఆటో చోరీకి పాల్పడిన 24 గంటల్లోనే దొంగ అరెస్ట్
కడప అర్బన్ : ఆటో చోరీకి పాల్పడిన కడప నగరం ఎన్జీవో కాలనీ చెందిన తుమ్మలూరు అనిల్ కుమార్‌ను 24 గంటల్లోపే అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన ఆటో స్వాధీనం చేసుకున్నట్లు కడప చిన్న చౌక్ సీఐ జి. ఓబులేసు తెలిపారు. నిందితుడిపై గతంలో 7 క్రిమినల్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయినట్లు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ వివరాలను తెలియజేశారు. చిన్నచౌక్ , రైల్వేకోడూరు, తిరుపతి వెస్ట్ ,తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో ఆటో దొంగతనాలుకు పాల్పడగా కేసులు నమోదు చేశారన్నారు. చెన్నూరు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అతడు పలు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వరరెడ్డి రవికుమార్ సిబ్బందితో కలసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించామన్నారు. శుక్రవారం తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులోని చలమారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసును విజయవంతంగా 24 గంటల్లోపే ఛేదించిన సీఐ, ఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాధర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, సుధాకర్ యాదవ్, మాధవరెడ్డిలను కడప డిఎస్పీ అభినందించారన్నారు. రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
అన్నమయ్య జిల్లా వద్దు.. బ్రహ్మంగారి జిల్లా ముద్దు
బద్వేలు : రాజంపేటను జిల్లాగా చేసి అందులో బద్వేలు నియోజకవర్గాన్ని కలుపుతామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అదే రోజు నుంచి బద్వేలు నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగులు కున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక సంఘం బద్వేలును కడప జిల్లాలోనే ఉంచాలని రాజంపేట వద్దని నిరసన రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బద్వేలును జిల్లా చేయాలని అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి బద్వేలు పట్టణ ప్రజలే కాకుండా గ్రామాలని నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.ఉంటే వైఎస్ఆర్ కడప జిల్లా..లేకుంటే బ్రహ్మంగారి పేరున జిల్లానాలుగు రోడ్ల కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ బద్వేలు నియోజకవర్గ అదనపు కార్యదర్శి నల్లేరు విశ్వనాధరెడ్డి తన సంఘీభావాన్ని తెలియజేశారు.ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాతో దశాబ్దాల కాలం నుంచి బద్వేలు నియోజక వర్గానికి విడదీయరాని బంధం ఉందని, దానిని కాదని నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజంపేట జిల్లాలో బద్వేలు నియోజక వర్గాన్ని కలుపుతామనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు కూటమి ప్రభుత్వం మాను కోవాలని హితవు పలికారు. ఒకవేళ తప్పదని బద్వేలును వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి విడదీయాలని అనుకుంటే బ్రహ్మంగారి మఠం లో కొలువైన వీరబ్రంహ్మేస్వామి పేరుతో బద్వేలు నియోజక వర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నారు. అందుకు బద్వేలు పట్టణానికి అన్ని రకాల బౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయులు, పెన్షనర్ల విభాగం మేధావులు, బీసీ సాధన సమితి, దళిత సాధన సమితి, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. -
కార్మికులను రెగ్యులరైజ్ చేయండి
మదనపల్లె : రాష్ట్రంలో థర్ట్‌పార్టీ విధానంలో విద్యుత్‌శాఖలో పని చేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోషియేషన్–3045 రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిస్కం, ట్రాన్స్‌కో, జెన్కోలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కాంట్రాక్టు కార్మికులను అక్కడి ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాయని అన్నారు. దీనికి సంబంధించి వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల వివాదాల పరిష్కార చట్టం శాశ్వత అవసరాల పనుల్లో కాంట్రాక్టు విధానం కొనసాగించరాదని స్పష్టంగా చెబుతోందన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు హామీలు ఇచ్చినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమావేశంలో డివిజన్ల అధ్యక్షులు యశ్వంత్, భాస్కర, కళ్యాణ్, రాజుకుమార్, ఎం,చంద్ర, గంగాధర్, వేణు, సాంబ, కిరణ్ పాల్గొన్నారు. -
విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
పీలేరురూరల్ : మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని ఆ పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ పి. మాధవీలత అన్నారు. శుక్రవారం స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులుపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేవించారు. అనంతరం విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలన్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలు బాగా వచ్చాయని అభినందించారు. ఈ ఏడాది కూడా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధారాణి, ఉపాధ్యాయులు పుష్పలత, సునీత, కవిత, శోభారాణి, రేవతి, అనీషా, సఫూరా, విద్యార్థినులు పాల్గొన్నారు. -
పోలీస్ సిబ్బందిపై దాడిచేసిన నిందితుడికి రిమాండ్
నిమ్మనపల్లె : పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించి దాడికి యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు శుక్రవారం ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ వెంకోజిగారిపల్లె దాసరిపేటలో వినాయకమండపం వద్ద అసభ్య నృత్యాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ నిర్వాహకులను గురువారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్వాహకులతో పాటు స్టేషన్‌కు వచ్చిన దాసరిపేటకు చెందిన తుపాకుల రోహిత్‌కుమార్(30) పోలీసులతో వాగ్వివాదానికి దిగి దురుసుగా ప్రవర్తించి పరుషపదజాలంతో దూషించి పోలీస్సిబ్బందిపై దాడికి యత్నించాడు. ఈ ఘటనపై సెంట్రీ పోలీస్ కానిస్టేబుల్ హరి ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఆధారంగా పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.ఆరుగురి మృతికి కారకుడైన డ్రైవర్‌కు జైలు శిక్షఓబులవారిపల్లె : జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఆరుగురు మృతికి కారణమైన డ్రైవర్ మహదేవకు నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ పి మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహదేవ మద్యం సేవించి సిమెంట్ ట్యాంకర్‌ను అతివేగంగా నడిపి చిన్నఓరంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీ కొన్నాడు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 29 మందికి గాయాలయ్యాయి. 56 మంది సాక్షులను విచారించి రాజంపేట మూడవ అదనపు జడ్జి ఎస్ ప్రవీణ్ కుమార్ నిందితుడికి నాలుగున్నర సంవత్సరాలు జైలుశిక్ష విధించారని తెలిపారు.కాపాడిన 108 సిబ్బందిఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో గురువారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రామతీర్థం వద్ద చెరువుకట్టపై ప్రమాదానికి గురైంది. చైన్నె నుంచి కడపకు వెళ్తున్న కారు కట్టక్రింద ఉన్న రామతీర్థం వైపునకు దూసుకెళ్లింది. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో కారులోని ప్రయాణికులు 108 నెంబర్‌కు లైవ్ లొకేషన్ పంపించి సమస్యను తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న సిబ్బంది టెక్నీషియన్ నాగబాబు, పైలెట్ విజయ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రోప్ సహాయంతో ప్రమాదానికి గురైన కారులోని ప్రయాణికులు శ్రీనివాసకుమార్, లాస్యను కాపాడారు. -
తపాలా సేవలపై అయోమయం..!
రాజంపేట : ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ–సేవల విస్తరణ కోసం సరికొత్త ప్రయోగాలుచేస్తున్న పోస్టల్‌శాఖ పాతసేవలను మాత్రం ఒకొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దుకాగా, సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్ పోస్ట్సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్ రెడ్ (పోస్టట్)బాక్స్‌లను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్ధకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే...అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతిక టెక్నాలజికి పోస్టల్ డిపార్టుమెంట్ అప్‌గ్రేడ్ అవుతోంది. రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం పోస్టల్‌శాఖ రిజిస్టర్ పోస్టు సేవలకు మంగళం పాడనున్నది. తాజాగా బ్రిటిషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్సేవలు సెపెంబరు1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పోస్టుమాస్టర్లకు శాఖపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్న..ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్ట్‌కార్డు లేదా రిజిస్టర్డ్ మాత్రమే అందుబాటులో ఉండేది. సుమారు 17యేళ్లుగా.. పోస్టల్ వ్యవస్ధ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ డిపార్టుమెంట్ ఇప్పుడు మరింత ఆధునికసేవలతో మందుకువస్తోంది. 1854లో అప్పటి బ్రిటిషర్ లార్డ్‌డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో సేవలు ప్రారంభమైయ్యాయి. అంతకముందుగా 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171యేళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్‌నోటీసులు,అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలివారికి చేరినట్లు రసీదు(డెలవరీ ఫ్రూప్) పొందడం ఒక ప్రత్యేకత, చట్టపరంగాను ఎంతో విలువైంది. ఇది కాస్తా మరో రెండువారాల్లో కనుమరుగు కానున్నది. స్పీడ్‌పోస్ట్‌లో విలీనం రిజిస్టర్డ్ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్‌పోస్ట్ సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలాశాఖ ప్రకటించింది.తపాలాశాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవలు క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్ధను బలోపేతం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్‌పోస్ట్‌లో రిజిస్టర్డ్ పోస్ట్‌ను విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్‌పోస్టు అంటే వేగవంతమైన డెలవరీ, ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్‌పోస్ట్‌లో కలపడంతోడెలవరీలుమరింత వేగవంతం కానుంది. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది రిజిస్టర్డ్ పోస్ట్లేదు. ఒక సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవతుందని అధికారులు పేర్గొంటున్నారు. తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికతవాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీమెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. ఐదేళ్ల జరిగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ పరిశీలిస్తే 25శాతం పడిపోయింది. స్పీడ్‌పోస్టు, ఇతర కొరియర్సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్ట్‌కు డిమాండ్ తగ్గింది. అయితే తాజాగా స్పీడ్పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్ధితి కనిపిస్తోంది.రిజిస్టర్డ్ పోస్ట్ కనీసం చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్‌పోస్ట్ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్ పోస్ట్‌తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం భరించకతప్పదు. రెడ్పోస్టు బాక్స్‌పై ఊహగానమే..రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చ రిత్ర కలిగిన రెడ్పోస్టుబాక్స్లు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో పోస్టల్ అభిమానులు కలత చెందుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వ్యక్తమౌవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవంలేదని , అది ఒక ఊహాగానమేనని మాత్రమే అని పోస్టల్ వర్గాలు అంటున్నాయి. పోస్టల్‌శాఖ ద్వారా ఎరుపు పోస్ట్బాక్స్లను ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్టల్ సేవల నిలిపివేత నిర్ణయం తాజాగా లెటర్రెడ్(పోస్ట్)బాక్స్ ఎత్తివేత ప్రచారం అవి ఊహాగానాలే అంటున్న తపాలా వర్గాలు ఈ–సేవ విస్తరణలో పోస్టల్‌శాఖ నిమగ్నంపోస్టుబాక్స్లు ఉండవనే సామాజిక మాధ్యమాల లో జరుగుతున్న ప్రచారంపై కడప పోస్టల్ ఎస్పీ రాజేష్‌ని ‘సాక్షి’ వివరణ కోరింది. ఇప్పటి వరకు పోస్టుబాక్స్లు తొలిగింపునకు సంబంధించి ఎ లాంటి ఆదేశాలు రాలేదని ఎస్పీ స్పష్టం చేశారు. -
కుర్నూతల సర్పంచ్ రమణయ్యపై హత్యాయత్నానికి కుట్ర
● లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ● రక్షణ కల్పించాలని సీఐకి వినతి లక్కిరెడ్డిపల్లి : గాదిముతుక రమణయ్య లక్కిరెడ్డిపల్లి మండలం, కుర్నూతల గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నాడు. గతంలో ఈయన భార్య గాదిముతుక లక్ష్మీదేవి ఐదేళ్లు సర్పంచ్‌గా కొనసాగారు. ఈయన రెండోసారి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నాగేశ్వర తనను హతమార్చాలని పదిహేను రోజులుగా కుట్రలు పన్నుతున్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందిందని రమణయ్య లక్కిరెడ్డిపల్లి పోలీసులను ఫిర్యాదు చేశారు. నాగేశ్వర (టీడీపీ నేత) తనవద్ద పిడిబాకును పట్టుకుని గ్రామంలో కొంతమంది వ్యక్తుల దగ్గర సర్పంచ్ రమణయ్యను చంపేస్తానని అన్నట్లు స్థానికులు తెలిపారని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం రమణయ్య లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎస్ఐ రవీంద్రబాబు నాగేశ్వరతో పాటు మరో వ్యక్తిని పిలిపించి రెండు గంటలపాటు స్టేషన్లో కూర్చోపెట్టారని సర్పంచ్ తెలిపారు. వారిపై కేసు పెట్టకుండా ఇంటికి పంపించేశారని అన్నారు. తనకు, తన కుటుంబానికి నాగేశ్వర ద్వారా ప్రాణహాని ఉందని, లక్కిరెడ్డిపల్లి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా సర్పంచ్ రమణయ్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇందులో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. నాగేశ్వరను కూడా పిలిపించి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు. -
నూతన బార్లకు నేడు డ్రా
రాయచోటి టౌన్: జిల్లా కలెక్టరేట్లో బార్లకు ఈనెల 30న డ్రా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారి మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 ఓపెన్ బార్లకు గాను మదనపల్లెలో మూడు, రాయచోటిలో రెండు, రాజంపేటలో రెండు బార్లకు కావాల్సిన దరఖాస్తులు వచ్చాయన్నారు. పీలేరులో ఒకటి ఉండగా దరఖాస్తు రాలేదు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు కూడా దరఖాస్తు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటికి సంబంధించి ఓపెన్ లాటరీ డ్రా శనివారం ఉదయం 8 గంటలకు తీయనున్నట్లు తెలిపారు.నియామకంరాజంపేట: వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శిగా దండుగోపి నియమితులయ్యారు. ఈమేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దండుగోపి ఇది వరకు డీసీఎంఎస్ మాజీ చైర్మన్‌గా పనిచేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.చిన్నమండెం: వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చిన్నమండెం మండలానికి చెందిన చుక్క అంజనప్పను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవనాధరెడ్డి, మండల అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’రాయచోటి జగదాంబసెంటర్: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన భాష మనదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా తెలుగుభాష కీర్తి పొందిందన్నారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా తెలుగు భాష వెలుగొందుతోందన్నారు.గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని, ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు. తెలుగుభాష అభివృద్ధికి గత జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీకాంత్‌రెడ్డి తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లురాజంపేట: సీఎం చంద్రబాబునాయుడు రాజంపేట మండలం బోయినపల్లిలో సెప్టెంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులకు ఫించన్ల పంపిణీ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ప్రజావేదిక,హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కార్యక్రమంలో డివిజన్ రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.ముగిసిన డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలనకడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. కడప బాలాజీనగర్‌లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండవ రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తోపాటు పలు రకాల ఉపాధ్యాయ పోస్టులకు మొదటిరోజు 712 మంది అభ్యర్థులకు గాను 609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండవ రోజు మిగిలిన 103 మందితోపాటు స్టేట్, జోన్‌కు సంబంధించి 535 మంది అభ్యర్థులు వచ్చారు. -
లంబో‘ధర’ లడ్డూ
మైదుకూరు: లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి యమ డిమాండ్ ఉంది. రూ.లక్షల్లో ధర పలుకుతోంది. వినాయక చవితి ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం భారీగా వేలం పాటలు నిర్వహించారు. పలువురు భక్తులు పోటీ పడి దక్కించుకున్నారు. అలాగే పూజ సామగ్రిని పొందేందుకు అమితాసక్తి కనబరిచారు. స్వామి వారి ప్రసాదం, పూజ సామగ్రి అందడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. మండపం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు పంపిణీ చేశారు. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం విశేషం.మైదుకూరు మండలంలోని అన్నలూరు అరవింద్‌నగర్‌లో అదే గ్రామానికి చెందిన కల్లూరి రామిరెడ్డి 10 కిలోల లడ్డూను రూ.4 లక్షలకు సొంతం చేసుకున్నారు. తోట వెంకటరామిరెడ్డి 15 గ్రాముల వెండి కాయిన్‌ను రూ.1.20 లక్షలకు పొందారు. మండలంలోని తిప్పిరెడ్డిపల్లెలో కొండిశెట్టి బాలుడు రూ.14 వేలకు చెరకు గడలను కై వసం చేసుకున్నారు. మైదుకూరులోని శీలం నగర్లో లడ్డూ ప్రసాదాన్ని మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, ఆయన కుమారుడు సాగర్ రూ.2.16 లక్షలకు దక్కించుకున్నారు. -
పెట్రోల్ బంక్ సొమ్ము కేసులో విచారణ వేగవంతం
రాజంపేట : రాజంపేట ఆర్టీసీ పెట్రోలు బంక్‌లో పక్కదారి పట్టిన సొమ్ము కేసులో విచారణవేగవంతమైంది. రూ.65 లక్షలు నిధుల స్వాహా అయినట్లు నిర్ధారణ చేసుకొని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు ఆర్టీసీ డీపీటీఓ రాము విచారణ చేపట్టి ఫిర్యాదుచేశారు. ఎస్పీ ఆదేశాలతో టౌన్ సీఐ నాగార్జున విచారణ చేసి ఆర్టీసీ డిపో ఉద్యోగులు పీఆర్నాయుడు, పీఎల్ నరసారెడ్డిలతోపాటు, పెట్రోలు బంకులో పనిచేసే 29 మందిపై కేసు నమోదు చేశారు. 9 నెలల పాటు పెట్రోలు బంకు నిర్వహణలో రూ.65,15,607 నిధులు స్వాహా అయినట్లు విచారణ అధికారులు తేల్చారు. ఎలా జరిగిందంటే.. రాజంపేట ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న స్థలాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. అగ్రిమెంట్ చేసుకొని పెట్రోలు బంకు ఏర్పాటుచేశారు. గత ఊడాది డిసెంబర్ 7న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దీనిని ప్రారంభించిన సంగతి విదితమే. అద్దెను చెల్లిస్తూ బంకు నిర్వహణకు ఆర్టీసీ డిపో ఉద్యోగి రాజశేఖర్నాయుడును నియమించారు. పెట్రోలు పట్టేందుకు నంద్యాలకు చెందిన చంద్రమోహన్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో తొమ్మిది మంది ఇంజినీరింగ్ విద్యార్ధులు, మరో 20 మంది స్థానిక సిబ్బందిని నియమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నిర్వహణ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. తొమ్మిది నెలల పాటు అప్పనంగా రూ.25 లక్షల వరకు స్వాహా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డులో నమోదు చేశారు. ప్రతి రోజు బంక్‌లో వచ్చిన మొత్తం రాజంపేట ఎస్బీఐ అకౌంట్లో జమచేశారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న శోభ వద్ద నగదు హ్యాండోవర్ చేస్తే ఆమె ఆ మరుసటి రోజుఆ బ్యాంకులో జమ చేస్తారు. పెట్రోలు బంకు నిర్వహణకు డీజల్ స్టాకు ఇండెంట్ కావాలంటే ఆర్టీసీ డీఎం రాయచోటి ఏఓ లోకనాథుడికి ఇండెంట్ పంపిస్తారు. ఇండెంట్ ప్రకారం ఫండ్‌ను విడుదల చేశారు. మొత్తాన్ని చెక్కు రూపంలో ఐఓసీఎల్ కంపెనీకి పంపిస్తారు. స్టాక్ తెప్పిచ్చి బంక్‌లో లోడింగ్ చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్ధులు, కాంట్రాక్టరు కుమ్మకై ్క స్కానర్లు మార్చడంతోపాటు ఫోన్‌పే, గూగల్‌పే డిజిటల్ పేమెంట్‌లో పకడ్బందీగా రిజిష్టర్‌లో నమోదు చేసి లెక్కలు సరిపోయే విధంగా చూపించారు. ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ నిధుల స్వాహాకు తెరతీశారు. రోజూ ఉదయం ఆరు గంటలకే బంక్‌లో డిప్డెన్సిటీ క్వాలిటీ రీడింగ్ చేసుకోవాలి. ఈ సమయంలో బంకులో ఎంత స్టాక్ వుందనేది పరిశీలించుకోవాలి. ఈ విధంగా చేయకపోవడం వల్ల మొత్తంమీద రూ.65 లక్షలు స్వాహా కావడానికి దారితీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.65 లక్షల స్వాహాపై డీపీటీఓ ఫిర్యాదు -
లారీ ఢీకొని ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. తెలంగాణా రాష్ట్రం గద్వాలకు చెందిన జాన్ (30) వాల్మీకిపురంలో ఉంటూ టెలికాం కేబుల్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి వాల్మీకిపురం నుంచి మదనపల్లె వస్తుండగా మార్గమధ్యంలో కాశీరావుపేట వద్ద లారీ వేగంగా వచ్చి ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.చికిత్స పొందుతూ మహిళ మృతిమదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తూ జారిపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కోళ్లబైలు పంచాయతీ డీవీ.జగన్ కాలనీకి చెందిన రామకృష్ణ భార్య గంగాదేవి(53) ఈ నెల 23న మిద్దైపె నుంచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు భాదితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు.గాయపడిన వ్యక్తి..కలకడ : లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ బి.రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. కలకడ మండలం గొళ్లపల్లెకు చెందిన కోట ఆచారి(80) సంతలో కూరగాయలు కొని రోడ్డు దాడుతున్న సమయంలో ఐచర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడు కోట ఆచారిని 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినటు్ల్ ఎస్ఐ తెలిపారు.విద్యుత్ షాక్‌తో యువకుడు దుర్మరణంకడప అర్బన్: కడప నగరంలోని బాలాజీ నగర్ వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి సుమన్తేజ(19) మృతి చెందారు. కడప తాలూకా ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్‌కు యువకుడి తల్లిదండ్రులు ఆనందరావు, అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుమతేజ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతడు ఇంటర్ వరకు చదువుకుని కేటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 27న రాత్రి వినాయకచవితి పండుగ సందర్భంగా తనతోపాటు కేటరింగ్ పనులను నిర్వహించే స్నేహితుడు పిలవడంతో బాలాజీనగర్‌కు వెళ్లాడు. మండపం వద్ద తాను వర్షానికి తడిసిపోవడంతోపాటు, సంఘటనా స్థలంలో బాగా తడిచేరింది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు సుమన్తేజ ప్రయత్నించారు. ఆ సమయంలోనే విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో మహిళ..జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన పల్లా రాజేశ్వరి(70) బుధవారం రాత్రి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ఇంటికి వెళ్తున్నారు. రచ్చబండ సమీపానికి చేరగానే జమ్మలమడుగు నుంచి మైలవరం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. డాక్టర్లు మృతి చెందినట్లు తెలిపారు. -
వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి
పీలేరు : వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని బీవీ రెడ్డి నగర్ సమీపంలో ఎల్బీఎస్ రోడ్డులో స్థానిక భక్తులు గణేష్ మండపంలో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అయితే దీపం ఒరిగి ఒక్కసారిగా మండపానికి మంటలు వ్యాపించి పూర్తిగా కాలిబూడిదైంది. అనంతరం భక్తులు ఆ స్థానంలో కొత్త విగ్రహం, మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.ముగ్గురికి గాయాలుములకలచెరువు : ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గరికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... కొండ కింద రైల్వేగేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పెద్దపాళ్యం పంచాయతీ రామానాయునికోటకు చెందిన చౌడప్ప(50), దేవలచెరువు పంచాయతీ గోళ్లారిపల్లెకు చెందిన శైలజ(17), మమత(15)లకు తీవ్రగాయాలయ్యాయి. 108 సహాయంతో వీరిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.గోడమీద పడి రైతుకు గాయాలుమదనపల్లె రూరల్ : వర్షానికి తడిసిన గోడ మీద పడి రైతు గాయపడిన ఘటన గురువారం ములకలచెరువు మండలంలో జరిగింది. దేవలచెరువు పంచాయతీ చెన్నువారిపల్లెకు చెందిన మల్లారెడ్డి కుమారుడు భాస్కరరెడ్డి(36) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆవుల కొట్టంలో పనులు చేస్తుండగా, వర్షానికి తడిసిన గోడ ఒక్కసారిగా మీదపడడంతో గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. -
సీసీ దారి నిర్మాణానికి భూమి పూజ
రాయచోటి టౌన్ : పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు రాష్ట్ర రవాణా, క్రీడల, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. మున్సిపాల్టీ పరిధిలో రూ.3.50 కోట్లతో 36 పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మాండవ్య నది మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలు నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాయచోటి మున్సిపాల్టీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, పాల్గొన్నారు.జీవ శాస్త్రంపై అంతర్జాతీయ సదస్సుకడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సమగ్ర జీవశాస్త్రం మరియు ఔషధ శాస్త్రంపై గురువారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ జీవశాస్త్రంతో కలిగే ప్రయోజనాలను తెలిపారు. అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ తులసి మానవుల్లో వచ్చే వ్యాధులకు చికిత్స, డాక్టర్ రాజేష్ కుమార్ ఈ వ్యర్థాల నిర్వహణ, డాక్టర్ భూపేష్ ఆధునిక జీవశాస్త్రం అభివృద్ధిపై, డాక్టర్ సంజయ్ గర్భాశయ క్యాన్సర్‌పై వివరించారు. వీరనాగేంద్రకుమార్, రమేష్, పి.రవిశేఖర్, నీలయ్య, నాగేశ్వరరెడ్డి, జమాల్‌బాషా, రామచంద్ర, మహేష్, పి.నవనీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
మృతుడి కుటుంబీకులకు మాజీ మంత్రి పరామర్శ
సంబేపల్లె : వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇటీవల వేణుగోపాల్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన ఆవులవాండ్లపల్లెకు చేరుకొని మృతుడి కుటుంబీకులు ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిలను పరామర్శించారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి నివాసంలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్రనాద్రెడ్డి, ఆనంద్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వీవీ.ప్రతాప్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, అమర్నాథ్రెడ్డి, వీవీ.రమణారెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘునాథరెడ్డి, రామచంద్ర, మల్లికార్జునరెడ్డి, రమణారెడ్డి, అన్నారెడ్డి, బుజ్జిరెడ్డి, యువరాజ్నాయుడు, చరణ్‌కుమార్‌రెడ్డి, విశ్వశ్వేతనాథ్రెడ్డి, శివారెడ్డి, వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అదిగో పులి!
● నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ కారిడార్ నుంచి మన అడవుల్లోకి పులులు ● తాజాగా చిట్వేలి అడవుల్లో కనిపించిన పెద్దపులి సాక్షి రాయచోటి: జంతువులకే రాజుగా భావించే పెద్ద పులి కనిపించింది. చిట్వేలి పరిధిలోని అడవుల్లో దర్శనమిచ్చింది. అయితే ఇదేం కొత్తకాదు... ఉమ్మడి కడపజిల్లాలోని అటవీ ప్రాంతంలో గతంలోనూ పెద్ద పులులు కనిపించాయి. గతంలో అటవీశాఖ పులుల గణన సందర్భంగా కూడా నాలుగు పెద్ద పులులు జిల్లాలో కనిపించినట్లు లెక్క తేల్చారు. ప్రధానంగా నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ కారిడార్ ప్రాంతంలో ఉన్న పులులు నిమ్మదిగా అడువులను తిరుగుతూ ఇటువైపుకు మళ్లాయి. గతంలోనూ నంద్యాల గుండ్ల మల్లేశ్వరం అటవీ ప్రాంతం నుంచి లంకమల అభయారణ్యంలో కెమెరాలకు దొరికిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అన్నమయ్య జిల్లా పరిధిలోని పెనుశిల అభయారణ్యంలో కనిపించడంతో మళ్లీ పెద్ద పులుల మాట హాట్ టాపిక్‌గా మారింది. అటు నుంచి ఇటు... నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ కారిడార్ నుంచి మహానంది, నంద్యాల ప్రాంతాల్లోని అడువులతోపాటు లంకమల, పెనుశిల, నల్లమల, శేషాచలం అడవుల్లో కలియతిరుగుతూ పెద్ద పులులు మన అడవుల్లో దర్శనమిస్తున్నాయి. అటు నుంచి ఇటు, మళ్లీ ఇటు నుంచి అటు వెళుతుండడంతో అడవుల్లో అటవీ శాఖ అమర్చిన కెమెరాల్లో అప్పుడప్పుడు దొరికిపోతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలోని సుమారు 50–60 ఉన్నట్లు అటవీఅధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పెద్ద పులులు కూడా మన అడవుల్లో కనిపిస్తుండడంతో టైగర్ కారిడార్ పరిధి విస్తరణకు కూడా గతంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్నమయ్యలో 4.69 లక్షల హెక్టార్లలో అడవి జిల్లా పరిధిలో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పెనుశిల, లంకమల, పాలకొండలు ఇలా అనేక పెద్ద అడవులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4.69 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. అడవుల్లో సుమారు వెయ్యి రకాలకుపైగా వివిధ రకాల పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. ప్రధానంగా అరుదైన జంతువుగా ముద్రపడిన పంగోలిన్, హానీబర్గల్ లాంటివి కూడా ఇక్కడ కనిపించాయి. శేషాచలం అడవుల్లో ఎక్కువగా ఏనుగల గుంపులు ఉన్నాయి. నీటికోసం బయటికి వచ్చినపుడు కనిపిస్తున్నాయి. మరోవైపు చిరుతల సంచారంతోపాటు పులులు, ఇతర అనేక జంతువులకు ఆవాసంగా మన అడవులు కనిపిస్తున్నాయి. -
వ్యాపార సౌలభ్యానికి చేయూత
రాయచోటి: సులభతర వ్యాపారంపై భారత ప్రభుత్వం నిర్వహించే సర్వేలో సానుకూల స్పందన వల్ల జిల్లాకు మరిన్ని పెట్టుబడులు సాధ్యమని, ఇందుకు జిల్లా యంత్రాంగం చేయూతనందిస్తుందని మదనపల్లె సబ్ కలెక్టర్ కళ్యాణి పేర్కొన్నారు. గురువారం రాయచోటి కలెక్టరేలోని పీజీఆర్ఎస్ హాల్లో మదనపల్లె సబ్ కలెక్టర్ అధ్యక్షతన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమాన్ని జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానాన్ని సాధించిందని గుర్తు చేశారు. జిల్లా పరిశ్రమల అధికారి కె.కృష్ణకిశోర్, కేపీఎంజీ ప్రతినిది రవితేజలు జరుగుతున్న బిఆర్ఏపీ 2024లో 453 సంస్కరణలు అమలు తదితర వాటిపై వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమ సంఘాలు, సింగిల్ డెస్క్ యూజర్స్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట ముగిసిన ధ్వజస్తంభ జీర్ణోధరణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురువారం ఉదయం పూర్ణాహుతితో ధ్వజస్తంభ జీర్ణోధరణ శాస్త్రోక్తంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పి అర్చన జరిపారు. ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, వాస్తుహోమం, కుంభస్థాపన, సయ్యాదివాసం, తత్వహోమాలు, పూర్ణాహుతి కళాకర్షణ జరిపారు. ఈనెల 27న సాయంత్రం ఆరుగంటలకు ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు అంకురార్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ పాల్గొన్నారు. -
అధ్వానంగా ఆంధ్రా ఊటీ ఘాట్‌రోడ్డు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రమైన ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డు ఆధ్వానంగా తయారైంది. ఎగిరిపోయిన తారు, గుంతలు, మధ్యలో చీలిన రోడ్డు ఇలా దరిద్రంగా మారిన ఘాట్‌రోడ్డుతో పర్యాటకులు అసహనానికి గురవుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వీవీఐపీలు, మంత్రులు, ప్రభుత్వ స్థాయి వ్యక్తులు ఇక్కడికి వచ్చి విడిదిచేసి వెళ్తుంటారు. ఘాట్‌రోడ్డు బాగుంటే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటమే కాకుండా ప్రమాదాలను అరికట్టే వీలుంటుంది. అయితే ప్రభుత్వం ముఖ్యమైన పర్యాటక కేంద్రానికి వెళ్లే ఘాట్‌రోడ్డుపై నిర్లక్ష్యం చూపుతోంది. జిడ్డు కృష్ణమూర్తి సర్కిల్లో రహదారిపై పొడవుగా నిలువునా చీలినట్టు గంతలు పడ్డాయి. ఇటీవల కొండపై జరిగిన అభివృద్ధి పనుల కోసం రోడ్డును తవ్వేశారు. దీనిని అభివృద్ధి చేయలేదు. దీనిపై రాకపోకలు సాగించే బైక్‌లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఘాట్‌రోడ్డుపై పలుచోట్ల తారు లేచింది. రహదారి భవనాలశాఖ అధికారులు రోడ్లు మరమ్మతులు చేయించడంతోపాటు ఘాట్‌రోడ్డుపై కొత్త రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. -
సెప్టెంబరు1న రాజంపేటకు ముఖ్యమంత్రి రాక
రాజంపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు1న రాజంపేటకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం సభ, హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. లబ్ధిదారులకు ఫించన్ల పంపిణీ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలో సమావేశం కానున్నారు. బోయనపల్లె, ఎంజీపురం, ఊటుకూరు, కూచివారిపల్లె పంచాయతీలోని ఎన్టీఆర్ కాలనీ, ప్రభుత్వ జూనియన్ కళాశాల, సీటీ కల్యాణమండపం వద్ద ఉన్న స్థలాన్ని , తోట కల్యాణ మండపాన్ని , బోయనపల్లె ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానాన్ని పరిశీలించారు. సీఎంఓ భద్రత సిబ్బంది రాజంపేటకు చేరుకొని సభా స్థలాన్ని, హెలిప్యాడ్ ఖరారు చేసి సీఎం షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్‌కలెక్టర్ భావన , ఎఎస్పీ మనోజ్‌రామ్‌నాథ్ హెగ్డే, క్షత్రియ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అద్దెపల్లె ప్రతాప్‌రాజు, తాళ్లపాకు చెందిన ఉద్దండం సుబ్రమణ్యం, శివనారాయణచౌదరి, అదృష్టదీపుడు, తహసీల్దారు పీరుమున్నీ, ఎంపీడీఓ వరప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం సబ్‌కలెక్టర్ భావన సభాస్థలిని పరిశీలించారు. -
భక్తుల పాలిట కొంగుబంగారం ఆరోగ్యమాత
కడప సెవెన్‌రోడ్స్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలో వెలిసిన ఆరోగ్యమాత భక్తుల పాలిట కొంగుబంగారంగా అలరారుతోంది. నగరంలోని ప్రముఖ క్రైస్తవ మందిరాలలో ఇదొకటి. బ్రిటీషు పాలనలో నిర్మించిన ఈ చర్చి కాలక్రమంలో పెద్ద చర్చిగా వెలిసింది. ఇటీవల ఆ ప్రాంగణంలో అధునాతనంగా మరో పెద్ద చర్చిని నిర్మించారు. అర్ద చంద్రాకారంలో రెండు అంతస్థులుగా రూపుదిద్దుకున్న ఈ చర్చిలో ఒక్కొక్క అంతస్తులో 1200 మందికి చొప్పున ఒకేసారి ప్రార్థనలు చేసుకునే వీలుంది. దక్షిణ భారతదేశంలో చర్చిల నిర్మాణంలో సిద్దహస్తులైన కడపకు చెందిన ప్రముఖ ఇంజనీరు వెంకటేశ్వర్లు ఈ చర్చిని విశిష్ఠంగా డిజైన్ చేశారు. ఈ చర్చికి పెద్ద సంఖ్యలోనే విశ్వాసులు ఉన్నారు. భక్తులు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాన్ని కడప వేలాంగిణిగా భావిస్తారు. ఏటా ఆరోగ్యమాత తిరునాల మహోత్సవాన్ని పది రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి ఉత్సవాలు: ఆరోగ్యమాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.00 గంటలకు పతాకావిష్కరణ, నవదిన ప్రారంభ వేడుకలు, దివ్య బలిపూజ నిర్వహించనున్నారు. కడప పీఠాఽధిపతి సగినాల పాల్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే సెప్టెంబరు 7, 8 తేదీల్లో తిరునాల మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 8వ తేది ఉదయం 8.30 గంటలకు విశాఖపట్టణం అగ్రపీఠం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ ఆధ్వర్యంలో మహోత్సవ సమిష్టి దివ్య బలిపూజ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వివిధ ప్రాంతాలకుచెందిన మత పెద్దలు దైవ సందేశాన్ని అందజేయనున్నారు. కడప వేలాంగణిగా విశేష గుర్తింపు నేటి నుంచి పది రోజులపాటుతిరుణాల మహోత్సవం -
పకడ్బందీగా లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు
రాయచోటి జగదాంబసెంటర్ : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంలో నిర్దేశించిన అంశాలను పకడ్బందీగా అమలు చేస్తూ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత చట్టంలోని నిబంధనల మేరకు స్కాన్ సెంటర్లు లేదా డయాగ్నస్టిక్ సెంటర్లు లింగ నిర్ధారణ చేసినట్లయితే కఠినచర్యలు తప్పవన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ చట్టంపై అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పోలీసు అధికారులతో వైద్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ, శిశు సంక్షేమ శాఖ అధికారి, ఎన్జీఓలు, డీఎల్‌ఏసీ కమిటీ మెంబర్లు, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సిద్దవటం : మండలంలోని కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బద్వేల్‌కు చెందిన షేక్ నాయబ్‌రసూల్(22), పి.హర్షవర్ధన్ అనే యువకులు కడప నుంచి మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో బద్వేల్‌కు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణిస్తూ కంట్రోల్ చేసుకోలేక సిద్ధవటం మండలం కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొని రోడ్డు పక్క చెట్లలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బద్వేల్లోని మహబూబ్‌నగర్‌కు చెందిన షేక్ నాయబ్‌రసూల్ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న బద్వేల్లోని మహబూబ్‌నగర్‌కు చెందిన పి.హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని వైద్యం కోసం పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధవటం ఎస్ఐ మహమ్మద్‌రఫీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, నాయబ్‌రసూల్ మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.మరొకరికి గాయాలు -
గంజాయి మొక్కలు తొలగింపు
సుండుపల్లె : గంజాయి మొక్కలను పెంపకం చేస్తున్న వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ ఆరోగ్యపురం బిడికికి చెందిన మూడే సుబ్బరామ నాయక్ తన ఇంటి పరిసరాల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో తనతో పాటు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎకై ్సజ్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులు వెళ్లి మూడే సుబ్బరామనాయక్ ఇంటి పరిసరాలలో పెంచుకుంటున్న సుమారు 10 గంజాయి మొక్కలను సమూలంగా తొలగించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్టుతంబళ్లపల్లె : ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు...ఆర్టీసీ డ్రైవర్ రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో ఉండగా, మండలంలోని పెండేరివారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ (48) సోమవారం మధ్యాహ్నం దాడి చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ మంగళవారం నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక వేంపల్లె : రాష్ట్ర స్థాయిలో జరిగే యోగా పోటీలకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. వేంపల్లెలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కడప జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీల్లో విద్యార్థులు 6 బంగారు, 5 వెండి, 5 రాగి పతకాలతోపాటు 4 మెరిట్ స్థానాలు సాధించడం విశేషమన్నారు. -
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ భారతి స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన రాజంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్తుత్యమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ విభాగం పోటీల్లో ఆ విద్యార్థిని పాల్గొంటుందన్నారు. భారతి సిమెంట్స్ సీఎంఓ సాయి రమేష్, హెచ్ఆర్ గోపాల్‌రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు.ఠి -
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
రాజంపేట : జిల్లా కేంద్రంగా పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను చేయాలని రాజంపేట బార్ అసోసియేషన్ తీర్మానించింది. మంగళవారం బార్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు అధ్యక్షతన రాజంపేట కోర్టు క్లాంపెక్స్‌లోని బార్ ఆఫీసులో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు మాట్లాడుతూ రాజంపేట జిల్లా చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేటను జిల్లా చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాఫర్‌బాషా, న్యాయవాదులు నాసరుద్దీన్, ఛాయాదేవి, కోసూరు సురేంద్రబాబు, కేఎంఎల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తల దరఖాస్తులకు అనుమతులు జారీ చేయాలి
రాయచోటి : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్ డెస్క్ విధానం కింద గడిచిన త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీల మంజూరు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.కృష్ణ కిశోర్‌తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు సమీపంలో సాయిబాబాగుడి దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజనేయులు(24), శివకుమార్ (27) దుర్మరణం చెందారు. వీరు బైకుపై వస్తుండగా స్కార్పియో వాహనం ఢీ కొన్నట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్‌లో నాలుగురోజుల నుంచి అక్కడ పని చేసి తిరిగి కొండాపురానికి బైకుపై వస్తుండగా లావనూరు వద్ద స్కార్పియో వాహనం ఢీ కొంది. రామంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్‌ను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందినవారని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. -
సత్తా చాటిన దంపతులు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కమ్మచెరువుకు చెందిన వీరిద్దరూ వరుసకు బావ, బామర్ది. చిన్ననాటి నుంచి కలసి మెలసి చదువుకున్నారు. వీరి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ స్కూళ్లలోనే సాగింది. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో ఇద్దరూ ఎస్జీటీలుగా ఎంపికయ్యారు. కమ్మచెరువుకు చెందిన ఎం.వేమనారాయణ, అలివేలమ్మ దంపతుల కుమారుడు నవీన్‌కుమార్ డీఎస్సీ ఫలితాల్లో 84.40 మార్కులు సాధించాడు. ఇదే గ్రామానికి చెందిన టి.గంగులప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు టి.విష్ణువర్దన్ డీఎస్సీ ఫలితాల్లో 70.20 మార్కులు సాధించాడు.సత్తా చాటిన దంపతులుపెద్దతిప్పసముద్రం మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లికి చెందిన వెంకట్రమణారెడ్డి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు బి.మధూకర్‌రెడ్డి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో పాటు అతని భార్య సునీత డీఎస్సీ పరీక్షలు రాశారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మధూకర్‌రెడ్డి 81.37 మార్కులతో జిల్లాలో 9వ ర్యాంకు సాధించి ఇటు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా, అటు పీజీటీగా జోన్–4లో 20వ ర్యాంకు సాధించాడు. భార్య సునీత కూడా 74.62 మార్కులతో జిల్లాలోని మహిళా విభాగంలో 16వ ర్యాంకు సాధించి ఇటు సోషియల్ స్కూల్ అసిస్టెంట్‌గా, 81.05 మార్కులతో అటు ఎస్జీటీగా ఎంపికై ంది. ఒకొక్కరు రెండేసి ఉద్యోగాలకు ఎంపికై న దంపతులను బంధువులు, ఆత్మీయులు అభినందించారు.మెరిసిన గొర్రెల కాపరి కుమారుడుకలికిరి : కలికిరి మండలం మర్రికుంటపల్లి గ్రామం అలకంవారిపల్లికి చెందిన అలకం శివయ్య, లక్ష్మీదేవిల కుమారుడు అలకం వెంకటరమణ ఇటీవల విడుదలైన డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో 14వ ర్యాంకు సాధించి ఫిజిక్స్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు గొర్రెలు కాపరులుగా ఉంటూ తనను చదివించారని, వారి ఆశలు వమ్ము కాకుండా కష్టపడటంతో ఉద్యోగం సాధించినట్లు వెంకటరమణ తెలిపారు. -
ఉత్సవం.. కారాదు విషాదం
● నేడు ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలు ● జాగ్రత్తలు పాటిస్తే మేలు ● అత్యుత్సాహం వద్దురాజంపేట టౌన్ : జీవితం ఎంతో విలువైనది. అయితే కొంత మంది పండుగలు, ఉత్సవాల సందర్భంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించే క్రమంలో.. ప్రాణాలనే పోగొట్టుకుంటుండటం చాలా బాధాకరం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఆనందం ఉరకలేస్తుంది. ఆ సమయంలో కొంత మంది వివిధ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏదో ఒకచోట విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి అపశ్రుతులు లేకుండా వేడుకలు సంతోషంగా ముగియాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. బుధవారం నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నందున పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చవితి వేడుకల్లో జరుగుతున్న అపశ్రుతులను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారుల సూచనలను పాటిస్తే వినాయక చవితి వేడుకలు ఆనందదాయకం కాగలవు. గతంలో జరిగిన సంఘటనలు రెండేళ్ల క్రితం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఓ వ్యక్తి పాతబస్టాండ్ సర్కిల్లో ట్రాక్టర్‌పై నుంచి ఫల్టీకొట్టబోయి అదుపు తప్పి.. తల మధ్యభాగం రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడే కదలలేని స్థితికి చేరుకొని జీవచ్చవంలా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించగా తలలోని నరాలు బాగా దెబ్బతినడంతో దాదాపు పది రోజులు చికిత్స పొంది చివరికి మృత్యువాత పడ్డాడు. ఆయన అత్యుత్సాహం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ● 2021లో రాజంపేట పట్టణం కృష్ణానగర్‌కు చెందిన జగన్నాథం అనే విద్యార్థి.. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో నీటమునిగి మృతి చెందాడు. వినాయకుడి ఊరేగింపు ఆలస్యం కావడంతో చీకటి పడింది. చీకటిలో వినాయకుడిని నీళ్లలోకి దించే క్రమంలో.. జగన్నాథం నీళ్లలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఆయన మృతి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ● గతేడాది తుమ్మల అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి టపాసులున్న కవర్ పట్టుకొని ఉండగా.. టపాసుల అగ్గిరవ్వలు కవర్లో పడ్డాయి. దీంతో కవర్లో ఉన్న టపాసులన్ని ఒక్కసారిగా పేలడంతో చేతివేళ్లు తెగిపోయి చెయ్యి చిధ్రమయింది. దీంతో ఆయన డ్రైవర్ వృత్తికి దూరం కావాల్సి వచ్చింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ● వినాయకుడిని కొలువు దీర్చేందుకు మండపాలు కట్టే సమయంలో విద్యుత్ షాక్ కొట్టకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలి. ● భారీ విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించే, మండపాల్లో కొలువు దీర్చే సమయంలో పిల్లలను దూరంగా ఉంచాలి. ● మండపాల్లో దీపాలను వెలిగించే సమయంలో డెకరేషన్‌కు సంబంధించిన దుస్తులు, పేపర్లు వంటివి దగ్గరలో లేకుండా చూసుకోవాలి. ● విగ్రహాలను చీకటి పడకముందే నిమజ్జనం చేయాలి. ● నిమజ్జనం చేసే సమయంలో పెద్దలు మాత్రమే నీటిలో దిగాలి. ● కర్రసాము వంటివి చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ● ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలి. ప్రాణాలు వెలకట్టలేనివి ఈ ప్రపంచంలో ఒక్కసారి పోతే తిరిగి తెచ్చుకోలేనిది ప్రాణం ఒక్కటే. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రజలు, భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – బి.నాగార్జున, అర్బన్ సీఐ. -
స్కౌట్ యూనిట్ ఏర్పాటు తప్పనిసరి
రాయచోటి : అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ కేంద్రంలో మంగళవారం పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, యూనిట్ లీడర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 39 పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్షణ ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ దోహద పడుతుందన్నారు. అనంతరం స్కౌట్లో శిక్షణ పూర్తి చేసిన యూనిట్ లీడర్లకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఏఎంఓ షపీవుల్లా, స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్స్ పాల్గొన్నారు. -
మట్టి విగ్రహం.. పర్యావరణ హితం
రాయచోటి : పర్యావరణ హితం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కావున అందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని పేర్కొన్నారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాయచోటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ సుధా, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, మున్సిపల్ కమిషనర్ జి.రవి, ఏఈఈ అనీల్‌కుమార్‌రెడ్డి, అనాలసిస్ట్ సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. శాంతియుతంగా జరుపుకోవాలి రాయచోటి : వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిష్ట వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘనంగా వీరభద్రస్వామి జయంత్యుత్సవం రాయచోటి టౌన్ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి జయంత్యుత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం స్వామివారి జయంతి సందర్భంగా మూలవిరాట్‌కు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి యాలివాహనంపై కొలువు దీర్చి, పుర వీధుల్లో ఊరేగించారు. -
పంచముఖ గణపతిం భజేహం
● రాజంపేటలో అరుదైన ఆలయం రాజంపేట టౌన్ : రాజంపేట మండలం ఇసుకపల్లె రోడ్డులోని రాజీవ్ స్వగృహ ప్రాంతంలో నిర్మితమైన పంచముఖ విష్ణుగణపతి ఆలయం.. అనతికాలంలోనే ఎంతో విశిష్టత సంతరించుకుంది. సాధారణంగా వినాయక స్వామి ఆలయాల్లో వక్రతొండంతో ఉన్న విగ్రహాలను భక్తులు కొలువుదీర్చుతారు. అయితే రాజీవ్ స్వగృహ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించిన వినాయక స్వామి ఆలయంలో.. పంచముఖ విష్ణుపతిని కొలువుదీర్చారు. చుట్టూ చుట్టుకున్న ఆదిశేషుడిపై.. ఈ గణనాఽథుడు ఆశీనులై ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇదిలా వుంటే ఆదిశేషుడిపై ఆశీనులయ్యే అర్హత ఒక విష్ణువుకు మాత్రమే ఉంటుంది. అయితే అక్కడి పంచముఖ విష్ణుగణపతి ఆలయంలో వినాయకుడు తన అంకం (తొడ)పై లక్ష్మీదేవిని కూర్చోపెట్టుకొని ఆదిశేషుడుపై ఆశీనులు కావడం వల్ల స్వామివారు పంచుముఖ విష్ణుగణపతిగా ప్రసిద్ధి చెందారు. పంచముఖ వినాయక స్వామి ఆలయం దేశంలో తొలుత మహారాష్ట్రాలోని షిర్డీ క్షేత్రంలో వెలసింది. రాజంపేట మండలంలోని రాజీవ్ స్వగృహ ప్రాంతంలో వెలసిన పంచముఖ విష్ణుగణపతి ఆలయం రెండవది కావడం విశేషం. మూలవిరాట్‌కు మరో ప్రత్యేకత రాజీవ్ స్వగృహ సమీపంలో వెలసిన పంచముఖ విష్ణుగణపతి ఆలయంలోని మూలవిరాట్‌ను శ్రేష్టమైన కృష్ణశిలతో రూపొందించారు. అలాగే ఆలయంలో ఉన్న నవగ్రహాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ నవగ్రహాలు సతీవాహన సమేతంగా కొలువుదీరడం విశేషం. సతీవాహన సమేతంగా కొలువైన నవగ్రహాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవు. ఈ ఆలయంలో దక్షిణా మూర్తి, పంచముఖ ఆంజనేయ స్వామి, గాయత్రీదేవి, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి దేవదామూర్తులు కూడా కొలువై ఉన్నారు. విగ్రహాలను నిర్వాహకులు మహాబలిపురంలోని శిల్పులతో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆలయాన్ని కూడా మహాబలిపురానికి చెందిన శిల్పులతో నిర్మింప చేయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
చవితి వేడుకలకు సర్వం సిద్ధం
● నేడు వినాయక చవితి ● జిల్లాలో 3800 విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ● పూజా సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడిన మార్కెట్లు ● ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ముస్లిం నాయకులురాయచోటి : వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 9 గంటల నుంచే సందడి నెలకొంది. రోడ్లన్నీ గణపతిని తీసుకు వెళ్లే లారీలు, ట్రాక్టర్లు, ఉత్సాహం ఉరకలేస్తున్న యువకుల కేకలతో మార్మోగాయి. విగ్రహాలను విక్రయించే షెడ్ల వద్ద భక్తుల హడావుడి కనిపించింది. ఉత్సాహ వంతులైన యువకులు డబ్బుకు వెనుకాడక నచ్చిన విగ్రహాన్ని తీసుకెళ్లారు. పండుగనాడు ఉదయం శాస్త్రోక్తంగా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఏర్పాట్లు పూర్తి అన్నమయ్య జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సరుకులు, పూలు, పండ్లు, పత్రి, చెరుకు గడలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకు తరలివచ్చిన జనంతో జిల్లా పరిధిలోని రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూర్, కొత్తకోట కేంద్రాలలోని మార్కెట్ ఆవరణాలు కిక్కిరిసిపోయాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల విక్రయ కేంద్రాలు కొనుగోలు దారులతో రద్దీగా మారాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉత్సవ కమిటీల నిర్వాహకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు కోలాహలంగా మారాయి. యువకులు ఉత్సాహంతో విగ్రహాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా ఉత్సవ కమిటీలుగా ఏర్పడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. చూడముచ్చటగా మండపాలు వినాయక మండపాలను నిర్వాహకులు రంగురంగుల అలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులలో చూడముచ్చటైన నిర్మాణాలతో సెట్టింగులను వేసి సిద్ధం చేశారు. జిల్లా కేంద్రమైన రాయచోటి, మదనపల్లి, రాజంపేటతోపాటు జిల్లాలోని 30 మండలాల్లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. మండపాలను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం సాయంత్రం కల్లా వినాయక విగ్రహాలను పలు ప్రాంతాల నుంచి మండపాలకు చేరవేశారు. ఒకరికంటే ఒకరు భారీ విగ్రహాలు, వివిధ రూపాలతో ఉన్న గణనాథుని విగ్రహాలను నెలకొల్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పలు మండపాల నిర్వాహకులు లక్కీడ్రా ద్వారా ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు తదితర ఆకర్షణీయమైన బహుమతులతో లక్కీడ్రాలను చేపడుతున్నారు. మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ అన్నమయ్య జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల కేంద్రాలతోపాటు పల్లె ప్రాంతాల్లో సైతం ఈ ఏడాది భారీగా గణనాథుని ఉత్సవాల నిర్వహణకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల పరిధిలో 3800 విగ్రహాల ఏర్పాటుకు జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతులు ఇచ్చింది. జిల్లా పోలీస్ అధికారుల సూచనలు మేరకు విగ్రహాల ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు గడప గడపన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రత్యేక నిఘా చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు ఆయా మండపాల వద్ద బందోబస్తు చేపట్టనున్నారు. నవరాత్రులు పూజలందుకున్న అనంతరం వినాయక నిమజ్జనాలను చేపట్టనున్నారు. మదనపల్లెలో పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న భక్తులు మదనపల్లెలో మట్టి విగ్రహాలు పంపిణీకి సిద్ధం చేసిన ముస్లిం నాయకుడు పఠాన్ ఖాదర్ఖాన్విగ్రహాలను విక్రయ కేంద్రాల నుంచి మండపాలకు తరలిస్తున్న ఉత్సవ కమిటీల సభ్యులు వెల్లివిరిసిన మత సామరస్యంమదనపల్లె : వినాయక చవితి వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. కొందరు ముస్లింలు లంబోదరుడిపై భక్తితో.. ఉత్సవాల్లో పాలుపంచుకోవడం విశేషం. 11 ఏళ్లుగా మట్టి విగ్రహాలు ఉచితంగా అందిస్తున్న మదనపల్లెకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్‌ఖాన్ 12వ ఏడాది కొనసాగించారు. మంగళవారం మదనపల్లెలోని తాజ్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖాదర్‌ఖాన్ 1,000 మందికి విగ్రహాలు పంపిణీ చేశారు. పూజకు అవసరమైన సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఖాదర్‌ఖాన్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో ఏ పండుగ జరిగినా కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకొంటూ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలవాన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏటా చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి స్థానిక నేతలు, సంఘాల ప్రతినిధులు హాజరై ఖాదర్‌ఖాన్‌ను ప్రశంసించారు. మదనపల్లెలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్‌సిద్దిక్ మట్టి వినాయకుని విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు. -
ఆందోళనలు.. ఆర్తనాదాలు
కూటమి సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నుంచి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు., పాలనా వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని, ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న విమర్శలు సర్వత్రా విసిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్‌పై గ్రామగ్రామాన ప్రజలు రగిలిపోతున్నారు.తాము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామన్న చంద్రబాబు ఇప్పుడు అంధులు,, దివ్యాంగులు ఆర్తనాదాలు పెట్టేలా చేస్తున్నారు. ● చంద్రబాబూ మాపై ఎందుకు కక్ష ● కలెక్టర్ కార్యాలయం ఎదుట నినదించిన దివ్యాంగులు. ● కలెక్టర్‌కు వినతుల సమర్పణ నా పేరు లక్ష్మీ లావణ్య. కలకడ కోన. 2020 నుంచి పె న్షన్ వస్తోంది. వికలత్వ ప ర్సెంటేజ్ 73 శాతం ఉంది. అలాంటిది ఇప్పుడు నేను అనర్హురాలునని చెబుతున్నారు. ఇన్ని రోజులు ఉన్న వికలత్వం ఇప్పుడు ఎలా పోయిందో అధికారులే చెప్పాలి. న్యాయం చేయాలి నా పేరు శివ. 2015 నుంచి పెన్షన్ వస్తోంది. నా వికల త్వం పర్సెంటేజీ 64 శాతం ఉంది. అలాంటిది ఇప్పుడు పర్సెంటేజీ తగ్గించారు. ఫింఛన్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాను. ఫెన్షన్ రాదని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ చేయాలి. పరిశీలన చేసే డాక్టర్లను విచారించి మాకు న్యాయం చేయాలి. నా పేరు గున్నామంతి బాలాజీ. నాకు 87 శాతం వికలత్వం ఉంది. ఒకరి సాయం లేకుండా నడవలేను. అందుకే నాకు రూ.200 పించన్ ఇస్తున్నప్పటి నుంచి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు రూ.6వేలు వచ్చేది. అదే జీవనాధారం. అలాంటిది ఇప్పుడు నేను వికలాంగుడిని కాదంట.. పెన్షన్ రాదని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా తొలగించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెరిఫికేషన్ పేరుతో ఉన్న వాటిని తొలగిస్తున్నారు. అర్హత ఉంటేనే ఇన్ని రోజులు ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు పరిశీలన పేరుతో తొలగించడం సరికాదు. జేసీ ఆదర్శ్రాజేంద్రన్కు వినతి పరత్రం అందజేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగుల జేఏసీ నాయకులు రాయచోటి టౌన్ : అయ్యా చంద్రబాబూ మాపై కోపం ఎందుకంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ దివ్యాంగుల సంఘం నాయకులు, వికలాంగులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం దివ్యాంగుల జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో పర్సెంటేజీ లను తగ్గించి, ఉన్న పెన్షన్లను తొలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదురుగా రెండు గంటలకు పైగా ఆందోళనను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. అర్హత లేని వారిని తొలగించినా ఫర్వాలేదు కానీ, అర్హత ఉండి రాజకీయాల పేరుతో పెన్షన్లను తొలగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ గోడు వినేందుకు కలెక్టర్ తమ దగ్గరకు రావాలని దివ్యాంగులు పట్టుబట్టారు. ఫిర్యాదుల స్వీకరణ తరువాత కలెక్టర్ దివ్యాంగులను తన దగ్గరకు పలిపించుకొని వారి వినతులను స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. దివ్యాంగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. చూడగానే వైకల్యం కనిపిస్తున్నా దివ్యాంగులని అనిపించకపోవడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు ప్రాధాన్యమిచ్చింది. పరిశీలన పేరుతో వికలాంగులను వేధించడం మానుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల దివ్యాంగుల సంఘాల నాయకులతో ఆందోళనలు చేపడతాం. – ఖలీల్, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం సుండుపల్లె అధ్యక్షుడు చంద్రబాబు మోసపూరిత మాటలతో దివ్యాంగు ల ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఆయన అసలు రూపం చూపిస్తున్నాడు. పరిశీలన పేరుతో ఉన్న పెన్షన్లను తొలిగించడం ఎంత వరకు న్యాయం.. ఇప్పటికే నాలుగైదు లక్షల మందికి పెన్షన్లను తొలిగించారు. ఇంకా తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారం వచ్చాక మరో మాట మాట్లాడటం చంద్రబాబుకు మామూలే అని మరోసారి నిరూపితమైంది. – రహెమాన్ ఖాన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ -
బాధితులకు చట్టపరిధిలో అండగా నిలవండి
రాయచోటి : న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప తొక్కిన బాధితులకు చట్టపరిధిలో అండగా నిలవాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలిచ్చారు. అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. సైబర్ మోసాలు, కుటుంబ సభ్యుల వేధింపులు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు లాంటివి అధికంగా ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళల ఫిర్యాదులకు ప్రాముఖ్యతనిస్తూ సమగ్రంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
రాయచోటి : జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణ, రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 530 ఉన్నత పాఠశాలల్లో 430 ఈగల్ క్లబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మందుల షాపులలో డాక్టర్ రాసిన చీటీలు లేకుండా మందులు ఇవ్వరాదని, తరచూ మందుల షాపులను తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో పోలీసు శాఖ వారికి ఇప్పటికే 735 అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. గంజాయి డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు, డ్రగ్స్ గంజాయి బానిసత్వం నుండి బయటకు రండి తదితర పోస్టర్లను జేసీ ఆవిష్కరించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఏఈఎస్ జోగేంద్ర, డీఎస్పీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట రామాలయంలో పవిత్రాల సమర్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతారామలక్ష్మణుల ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, పవిత్రహోమం, మధ్యాహ్నం ఆరాధన, శాత్తుమొర, తీర్థప్రసాద గోష్టి చేపట్టారు. అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ సీతాసమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, ధ్వజస్తంభానికి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతి, సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
రాజంపేట : పుల్లంపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకొని పేదలను ఆదుకోవాలని పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏఓ శ్రీధర్‌రావుకు వినతిపత్రం అందజేసిన అనంతరం కబ్జా భూముల వివరాలను ఎంపీపీ మీడియాకు వివరించారు. పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం గ్రామంలో ముద్దా సుబ్బారెడ్డి సతీమణి లక్ష్మినరసమ్మ పేరు మీద 324 సర్వే నెంబరులో 3 సెంట్లు స్థలం ఉందన్నారు. ఈ 3 సెంట్ల స్థలాన్ని ఆసరాగా తీసుకొని వీరి కుమారుడు ముద్దా సుభాష్‌రెడ్డి అలియాస్ గంగిరెడ్డి సమీపంలో పలువురి భూములను 40 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారన్నారు. ఇదే విషయంపై పుల్లంపేట తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇందులో ఉన్న గ్రామ కంఠం భూమి 6 ఎకరాలను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వెంబులూరు సుబ్బన్న, చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి వారితో పాటు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి వారి భూములను అక్రమించుకున్నారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరికి బంధువు కావడంతో రెచ్చిపోయి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దళితుల భూములకు అండగా ఉండాల్సిన పుల్లంపేట తహసీల్దార్ అధికార పార్టీ నాయకులకు, ఆక్రమణదారులకు వత్తాసు పలకడమేమిటని ఆయన ప్రశ్నించారు.పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి -
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం తగదు
పీలేరు : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్య ధోరణి తగదని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్, కోశాధికారి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పీలేరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. పీఆర్సీ అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాతన పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చెంగల్రాయుడు, ఆదినారాయణ, వెంకటరమణ, విజయ్‌కుమార్, పీరయ్య, చిన్నరెడ్డెప్ప, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఆటో దగ్ధం
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని ఓబనపల్లి దళితవాడలో ఇంటి ముందు నిలిపి ఉంచిన కనుపర్తి రాజేంద్రకు చెందిన ఆటోను సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పోలీసులు నిందితులను శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. -
చిన్నారి మృతిపై అనుమానాలు
● కళాశాల సీసీ పుటేజీలో వెలుగు చూసిన వాస్తవాలు ● 13 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టంకురబలకోట : ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొరుగింటి నీటి నిల్వ తొట్టెలో పడి చనిపోయాడని భావించి తల్లిదండ్రులు లేకలేక కలిగిన రెండేళ్ల పసిబిడ్డకు గుండె పగిలిన మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. దేవుడు మనకే ఎందుకు ఇంత క్షోభ మిగిల్చాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ అసలు కథ సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూసింది. బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోలేదని అనుమానాలకు దారితీసింది. దీంతో బిడ్డను పూడ్చిన 13 రోజుల తర్వాత సోమవారం తవ్వి తీసి అక్కడే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె బసినికొండకు చెందిన చిన్నరెడ్డెప్పకు, కురబలకోట మండలంలోని భార్గవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో ఎన్నో పూజలు, మొక్కుబడులు చేశారు. రెండేళ్ల క్రితం ఎం. శ్యామ్ కృష్ణ జన్మించాడు. లేక లేక కలిగిన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు. ఈ క్రమంలో భార్గవి ఈనెల 11న పెద్దకటవలోని పుట్టింటికి భర్త, బిడ్డతో కలసి వచ్చింది. 12న ఉదయం రెండేళ్ల చిన్నారి శ్యామ్ కృష్ణ ఒంటరిగా ఆడుకుంటూ కొంత దూరంలో ఉన్న పొరిగింటి వైపు వెళ్లాడు. ఆ తర్వాత కన్పించకుండా పోయాడు. ఊరంతా వెతికారు. చివరకు గంట తర్వాత పొరిగింటిలో బయట ఉన్న నీటి తొట్టెలో శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బిడ్డ ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని భావించి అదే రోజు బాధాతప్త హృదయంతో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటికీ అనుమానం ఉంటే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పినా పసిబిడ్డకు పోస్టుమార్టం సరికాదని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆ ఊరిని ఆనుకుని ఉన్న కళాశాల కెమెరాలను పరిశీలించారు. బిడ్డ పొరిగింటి వరకు వెళ్లడం అదే సమయంలో కొంత సేపటికే అదే ఊరికి చెందిన ఓ జంట ఆ ఇంటివైపు రావడం తిరిగి వెళ్లడం దృశ్యాలు కన్పించాయి. ఒక వైపు బిడ్డ మరో వైపు జంట పొరిగింటి వైపుగా వెళ్లినట్లుగా ఉన్న దృశ్యాలు మాత్రమే సీసీ కెమెరాలో కన్పిస్తున్నాయి. దీంతో అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తల్లిదండ్రులు బిడ్డ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బిడ్డ మృతిపై ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. దీంతో రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో తహసీల్దారు ధనుంజయులు సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే భూమిలో పాతిపెట్టిన అమాయక పసిబిడ్డ మృతదేహాన్ని 13 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం చేసిన దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు పొంగుకొస్తున్న దుంఖాన్ని ఆపుకోలేకపోయారు. అమాయక ప్రాణానికి న్యాయం జరగాలని తలచుకున్నారు. అంగళ్లు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సోషల్ వర్కర్ తుమ్మచెట్లపల్లె నాగరత్న పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
● సన్నిహిత సంబంధమే హత్యకు కారణం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడురాయచోటి టౌన్ : మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల 18వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండల పరిధిలోని దేవళంపల్లె ఫారెస్టులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ వి. సుధాకర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి మృతురాలు మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం, సవరంపల్లె గ్రామానికి చెందిన శ్రీదేవిగా గుర్తించారు. ఆమె ఫోన్ డేటా ఆధారంగా నిందితుడు సుండుపల్లె మండలం, మడితాడు గ్రామం నాయనివారిపల్లెకు చెందిన గురిగింజకుంట శివప్రసాద్ నాయుడుగా గుర్తించారు. మృతురాలితో నిందితుడు సన్నిహితంగా మెలిగేవాడని, ఈ క్రమంలో ఆమెను డబ్బుల కోసం వేధించేవాడని తెలుసుకున్నారు. దీంతో ఆమె తనతో ఉన్న సన్నిహిత సంబంధం గురించి అందరికీ చెబుతానని బెదిరించేది. డబ్బులు ఇవ్వకపోగా తననే బెదిరిస్తావా అని మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 4వ తేదీ శివప్రసాద్ నాయుడుకు ఫోన్ చేసి తనను కలవాలని కోరింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఆమెను బైకుపై మదనపల్లె నుంచి చిన్నమండెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆమె చీరను మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసును తీసుకున్నాడు. తర్వాత అప్పటికే తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమైపె పోసి నిప్పు పెట్టాడు. బంగారు గొలుసు సుండుపల్లెలోని కీర్తన ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.1,31,000 రుణం తీసుకున్నాడు. సాంకేతిక పరి/్ఞానంతో నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని ఈ నెల 24వ తేదీ స్వచ్ఛందంగా లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పెడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి, రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలనే వినియోగించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : వినాయక చవితి పండుగలో ప్రజలు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్తో కలిసి గణేష్ నవరాత్రి వేళ పర్యావరణహిత మట్టి విగ్రహాలు వినియోగంపై కలెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడటం వల్ల చెరువులు, నదులు కాలుష్యం అవుతున్నాయన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం రాయచోటి టౌన్ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.అనంతరం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిశితంగా అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. శాంతియుతంగా వినాయక చవితి జరుపుకోవాలి:జేసీ రాయచోటి : వినాయక చవితి పండుగ సామరస్యానికి ప్రతీక అని, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా సంబంధిత అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిలతో కలిస జాయింట్ కలెక్టర్ శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని జేసీ సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు ఉపయోగించకుండా మట్టి వినాయకులను ప్రోత్సహించాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జన ఘాట్ల వద్ద లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, రక్షణ బృందాలు వంటి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు,మతపెద్దలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
‘భాగ్యలక్ష్మి’ సందడి
మదనపల్లె : స్థానిక సీటీఎం రోడ్డులో చందన షాపింగ్ మాల్ ను సినీనటి ఐశ్వర్య రాజేష్, బాల నటుడు రేవంత్ (బుల్లి రాజు) చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైంది. స్థానికులు, అభిమానులు హాజరై సందడి చేశారు.ఇక్కడి వారి ఆత్మీయత, ఆదరణ మరువలేనిదన్నారు. తొలి రోజే వందల మంది షాపింగ్ ప్రియులు ఆసక్తితో కావాల్సిన వాటిని బంపర్ ఆఫర్లతో కొనుగోలు చేసి సంబరపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, డి.రమేష్, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మునిసిపల్ చైర్మన్ మనూజా పాల్గొన్నారు. -
కల్వర్టులో లారీ బోల్తా
సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం రాత్రి లారీ కల్వర్టులో పడిన ప్రమాదంలో నందలూరుకు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాసులకు గాయాలయ్యాయి. లారీ కోడూరు నుంచి మామిడి కట్టెలు లోడు చేసుకొని ఆదివారం రాత్రి గోపవరంలోని సెంచురియన్ ప్లే ఉడ్ ఫ్యాక్టరీకి బయలుదేరింది. స్విమ్మింగ్ పూల్ వద్ద ఎత్తుగా ఉండటంతో అక్కడ డ్రైవర్ గేర్ మార్చుకోలేకపోవడంతో వెనక్కు వచ్చి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శ్రీనివాసులకు గాయాలు కాగా స్థానికులు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి
● ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాకు అక్రమార్కుల యత్నాలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు గుర్రంకొండ : విలువైన ప్రభుత్వం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను అక్రమార్కులు మాయం చేస్తూ.. కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకొన్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలోని గుర్రంకొండ పట్టణానికి సమీపంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పక్కనే ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి సమీపంలో కోట్లాది రుపాయలు విలువచేసే ఫ్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వేనంబర్ 87/8లో రెండు ఎకరాల భూమికి సంబంధించి ఇంతవరకు ఎవ్వరికీ పట్టా ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిపోయింది. ఎకరం రూ.2 కోట్ల వరకు ఉంది. దీంతో కొంతమంది కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. దీనిని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులు సదరు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా వాటిని కొంతమంది కూటమినేతలు అడ్డుకుని రెవెన్యూ ఆధికారులను అక్కడి నుంచి పంపించేసిన సంఘటనలు ఉన్నాయి. కొన్నాళ్లుగా గుంభనంగా ఉన్న కబ్జాదారులు అప్పట్లో మళ్లీ కబ్జా ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో రెండునెలల క్రితం రెవెన్యూ అధికారులు సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వేనెంబరు 87/8లో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదని, ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.వీటిని అక్రమార్కులు పీకేశారు. మండలంలోని ఖండ్రిగ గ్రామంలో ప్రభుత్వస్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని చదును చేసుకొన్నారు. మురాద్‌బీ కుంటకు వర్షపునీరు చేరే ఈ వంకను ఆనవాళ్లు లేకుండా చేశారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్ధం చేసుకొన్నారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ. కోటి విలువచేసే మొత్తం 25 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు మురాద్‌బీ వంక వద్దకఆక్రమణ గురైన ప్రభుత్వంలో హెచ్చరిక బోర్డు నాటించారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని ఇక్కడ ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటాని అధికారులు హెచ్చరించారు. హెచ్చరిక బోర్డులు మాయం గుర్రంకొం మండలంలోని చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లో గతంల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయయ్యాయి. రెండు చోట్ల బోర్డులను ఆక్రమణ దారులు తొలగించేశారు. అసలు అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. దీంతో రూ. 5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు మళ్లీ కబ్జా చేసి, విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.సదరు ప్రభుత్వస్థలాల్లో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడం గమనార్హం. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు రెవెన్యూ ఆధికారులు అలాంటప్పుడు ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు నాటడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె ఫ్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు నాటుతున్న రెవెన్యూ అధికారులు, బోర్డు తొలగించిన దృశ్యం మళ్లీ మొదలైన కబ్జా యత్నాలు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు నాటిన తరువాత గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ ప్రభుత్వ భూములను కబ్జా చేసే యత్నాలు మొదలు పెట్టారు. బోర్డులు నాటిని భూముల్లో ఉన్న వేప, ఇతర చెట్లను నరికి వేశారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చదును చేసే పనుల్లో భాగంగా బయట ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మురాద్‌బీ వంకను చాలా వరకు చదనుచేశారు. వంక రూపురేఖలు మార్చేసి ప్లాట్లు వేసి విక్రయించడానికి సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ వంక ఆనవాళ్లు కనుమరుగయ్యాయి.ఇప్పటికే మట్టికుప్పలు భూమిలో దర్శనమిస్తుండడం గమనార్హం. రెవెన్యూ అదికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూ ఆక్రమణ పనులు మొదలు పెడుతుండటం గమనార్హం. ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు తొలగించిన సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో మళ్లీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. – సదాశివప్ప నాయుడు, ఆర్ఐ. గుర్రంకొండ. -
రాజ్యసభ సభ్యుడు మేడాపై దుష్ప్రచారం శోచనీయం
రాజంపేట : రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిపై ఎల్లోమీడియా, కూటమి ప్రభుత్వ అనుకూల ఛానళ్లు దుష్ప్రచారం చేయడం శోచనీయమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి అన్నారు. సోమవారం తన స్వగృహంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే మేడా కుటుంబానికి ఎంతో అభిమానం ఉందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు, రాజకీయాలలో మేడా రఘునాథరెడ్డి కుటుంబం జగన్‌రెడ్డిని వీడి వెళ్లరని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని భావించే వ్యక్తి మేడా రఘునాథరెడ్డి అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా పాలన సాగించాలే కానీ తమకు అనుకూలమైన మీడియా ద్వారా మేడాపై బురదచల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు
నిమ్మనపల్లె : బైక్ అదుపు తప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వెంగంవారిపల్లె పంచాయతీ కొత్తకొండసానివారిపల్లెకు చెందిన బాలకృష్ణ కుమారుడు నవీన్(25) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో నిమ్మనపల్లెకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని చిన్నల్లవారిపల్లె వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి వెళ్లగా గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఆటో బోల్తా పడి .. మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. నేతిగుట్లపల్లెకు చెందిన మహేశ్వర(40) మరి కొందరితో కలిసి ఆటోలో పుంగనూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలోని రాంపల్లి వద్ద ఒక్కసారిగా కుక్కలు అడ్డురావడంతో ఆటో ఆదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో మహేశ్వరతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కొందరు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా తీవ్రంగా గాయపడిన మహేశ్వరను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
దరఖాస్తుకు నేడు చివరి తేదీ
రాజంపేట : రాజంపేట అబ్కారీశాఖ పరిధిలో రెండు బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజని రాజంపేట అబ్కారీశాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిక తెలిపారు. సోమవారం ఇక్కడ మాట్లాడుతూ చివరిరోజున డీడీల రూపంలో బ్యాంకుల ద్వారా, డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28వ తేదీ నుంచి సంబంధిత జిల్లాల్లోనే ప్రారంభమవుతుందని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఒక రైతుకు ఒక బస్తా మదనపల్లె : మదనపల్లెలో యూరియా కోసం వచ్చిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ఒక రైతుకు ఒక బస్తాను పంపీణీ చేయాలని డీలర్లను కోరారు. సోమవారం మదనపల్లె ఎరువుల దుకాణాల వద్ద రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో బస్తా యూరియా కోసం క్యూలో నిలబడి తీసుకెళ్లారు. రైతులకు అవసరమైనంత యూరియా ఉందని, అయితే ఒకేసారి తీసుకువెళ్లడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని వ్యవసాయశాఖ ఏఓ నవీన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఒక పంటకు ఒక విడతకు ఒక బస్తా యూరియా సరిపోతుందని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీ అర్హత నిబంధన సవరణ రాయచోటి జగదాంబసెంటర్ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల అర్హత నిబంధనలలో సవరణలు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు కనీసం 2 సంవత్సరాల సేవ పూర్తి చేయాలనే షరతు మినహాయించినట్లు, ఈ నేపథ్యంలో సేవా పరిమితి అవసరం లేదన్నారు. అదే విధంగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న పరస్పర మార్పిడి బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి 31.07.2027లోపు పదవీవిరమణ పొందబోయే వారు అంతర్ జిల్లా బదిలీలకు అర్హులు కారని గమనించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 నుంచి 27వ తేదీల వరకు, ఎంఈఓ వెరిఫికేషన్ ఈ నెల 25 నుంచి 28 వరకు, డీఈఓ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 29 వరకు, పాఠశాల విద్య డైరెక్టర్‌కు సమర్పణ ఈ నెల 30 నుంచి 31వ తేదీ వరకు, డైరెక్టర్ కార్యాలయ పరిశీలన సెప్టెంబర్ 1 నుండి 2వ తేదీ వరకు ఉంటుందని డీఈఓ తెలియజేశారు. -
చేనేత నగర్లో చోరీ
కురబలకోట : మండలంలో చేనేత నగర్‌లోని ఎస్.బాషా ఇంటిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలోని రూ.లక్ష నగదు, బీరువాలో దాచిన రూ.3 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఎస్.బాషా కుటుంబీకులు ఆదివారం రాత్రి బ్రాహ్మణ ఒడ్డుపల్లె కాలనీలోని కూతురి ఇంటికి వెళ్లారు. ఇతని ఇళ్లు చేనేత నగర్ చివరలో ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రెండు బీరువాలు పగుల గొట్టి వీటిని చోరీ చేశారు. సోమవారం ఉదయం బాషా కుటంబీకులు ఇంటికి వచ్చి చూసి నిశ్చేష్టులయ్యారు. ఇంటి పని ప్రారంభించడానికి బాధితుడు దాచిన రూ.లక్ష సొమ్ము దొంగల పాలు కావడంతో అతని ఇంటి కలలు ఆవిరయ్యాయి. సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికనందలూరు : రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 21వ తేదీన జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎం.యేసుప్రియ, ఎస్.మన్సూర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్‌రాజు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ సుస్మిత, పీఈటీ జగన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజంపేట జిల్లా హామీని సీఎం నెరవేర్చాలిరాజంపేట : రాజంపేట జిల్లా ప్రకటనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెరవేర్చాలని జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య అతిఽథి గృహంలో నేతలు భేటీ అయ్యారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాజంపేటలో ఇచ్చిన హామీ మేరకు రాజంపేటను జిల్లా చేయాలనే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు పూల భాస్కర్, ఉద్దండం సుబ్రమణ్యం, గీతాంజలి రమణ, నందగోపాల్, జువ్వాజి మోహన్, సుదర్శన్, షేక్ అస్లాం, విద్యార్థి సంఘం నేత నాగేశ్వరనాయుడు, రమణనాయుడు, రఘుపతినాయుడు, పోకల ప్రభాకర్, మహదేవయ్య, డీఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు. భర్త, బంధువులు వేధిస్తున్నారని ఫిర్యాదుకడప అర్బన్ : కడప నగరంలోని మరియాపురానికి చెందిన వసంతకు, కలికిరికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వసంత, తన భర్తతోపాటు, అత్త, బంధువులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ టి.రెడ్డెప్ప తెలిపారు. -
బొజ్జ గణపయ్య పండుగ .. ఉపాధి మెండుగా
● చిరు వ్యాపారులు, వివిధ రంగాలకార్మికులకు చేతినిండా పని● 27 నుంచి ప్రారంభం కానున్న గణపయ్య వేడుకలురాజంపేట టౌన్ : నాణేనికి ఒకవైపు కాదు రెండువైపులా చూడాలి అంటుంటారు పెద్దలు. అలాగే వినాయచవితి వేడుకలు అంటే భక్తిభావం, సందడైన వాతావరణం అన్న అభిప్రాయమే ప్రజల్లో నాటుకు పోయింది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. హిందువులకు పెద్ద పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి పెద్ద పండుగ అయినప్పటికి ప్రధానంగా దుస్తులు, నిత్యావసర సరుకుల వ్యాపారులకు ఆదాయాన్ని ఇస్తుంది. అయితే వినాయక చవితి పండుగ చిరువ్యాపారులకు, వివిధ రంగాల కార్మికుల, రైతుల కడుపు నింపుతుంది. వినాయక చవితి ప్రారంభానికి ముందు నుంచే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. అందువల్ల ఈ ఉత్సవాలపై అనేక మంది ఆశలు పెట్టుకుంటారు. మరో రెండు రోజుల్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చవితి వేడుకల సందడి ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పటి నుంచే వివిధ రంగాల కార్మికులు చవితి ఉత్సవాలకు సంబంధించిన పనులు జోరుగా చేస్తున్నారు.కళాకారులకు పండగే..సెల్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక కాలక్షేపానికి, వినోదానికి కొదవలేదనే చెప్పాలి. అందువల్ల అనేక కళలు కూడా అంతరించిపోయాయి. అయితే వినాయక చవితి సందర్భంగా గాన, నృత్య, మిమిక్రి, మ్యాజిక్‌షో, సన్నాయి వాయిద్యం, డ్రమ్స్ వాయించే కళాకారులకు చేతినిండా పని లభించి కనీసం ఓ రెండు నెలల పాటు వారి కుటుంబాల పోషణ సాఫీగా సాగిపోతుంది. జిల్లాలో వందలాది మంది కళాకారులు వివిధ కళలను నమ్ముకొని జీవిస్తున్నారు. వారిలో అనేక మంది కళల ద్వారా వచ్చే ఆదాయంతో జీవించే వారు కూడా లేకపోలేదు. అలాంటి వారికి వినాయక చవితి నిజంగా కడుపునింపే పండుగ అనే చెప్పాలి. కాగా చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు పురోహితులకు కూడా ఉపాధి లభిస్తుంది.చిరు వ్యాపారులకు, రైతులకు సైతం..కొన్ని రోజుల పాటైనా ఇబ్బందులు లేకుండా చిరు వ్యాపారులు, రైతుల కడుపునింపేందుకు వినాయక చవితి వేడుకలు ఎంతగానో దోహదపడతాయి. చవితి వేడుకలు జరిగినన్ని రోజులు ప్రధానంగా పూలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. అందువల్ల వ్యాపారులకు, రైతులకు కొంతమేర ఆదాయం సమకూరి వారి కుటుంబ పోషణకు దోహదపడనుంది.కార్మికులకు ఉపాధి..వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అసంఘటిత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇందులో ఎలక్ట్రీషియన్, దినసరి కూలీలు, ట్రాక్టర్ డైవర్లకు చేతినిండా పని దొరుకుతుంది. ఇందువల్ల చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు అసంఘటిత కార్మికుల్లో కొంత మందికి మెండుగా ఉపాధి దొరుకుతుంది. -
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాలని అన్నమయ్య జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రాయచోటి పట్టణంలోని సాయిశుభ కళ్యాణ మండపంలో అత్యవసర సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలన్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని వారు కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సీఎం చంద్రబాబుతో చర్చించి జిల్లా కేంద్రం మార్పును అడ్డుకోవాలని.. లేనిపక్షంలో ఉద్యమానికి సన్నద్ధం అవుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ బయారెడ్డి, సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, విజయభాస్కర్, గంగిరెడ్డి, రామాంజులు, ప్రకాష్, మైనార్టీ నేత ఇర్షాద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్‌రెడ్డి, న్యాయవాది రెడ్డప్పరెడ్డి, భాస్కర్‌రాజు పాల్గొన్నారు. -
‘అగ్నివీర్’కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్ : అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్షలో ఎస్వీ డిఫెన్స్ అకాడమికి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆ అకాడమి చైర్మన్ బి.శేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చామని, వారు ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అర్హత సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆగి ఉన్న లారీని ఢీకొన్న విద్యార్థికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్న ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు గౌతమ్(18) మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. శనివారం కళాశాల ముగించుకుని ఆలస్యంగా ద్విచక్రవాహనంలో రాత్రి ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యంలోని గ్రీన్‌వ్యాలీ స్కూల్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్లి ఢీకొన్నాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. -
రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. జిల్లా జూనియర్ బాల,బాలికల షూటింగ్ బాల్ జట్ల ఎంపికమదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులోని గ్రీన్‌వ్యాలీ స్కూల్లో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ బాల,బాలికల జట్ల ఎంపిక జరిగింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు వందమంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. జిల్లా అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ అభినందించారు. కార్యక్రమంలో ఏషియన్ గోల్డ్ మెడలిస్టు యూసుఫ్, అసోసియేషన్ సభ్యులు భారతి, మండల స్కూల్ గేమ్స్ కో ఆర్డినేటర్ శివశంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు కుమార్ నాయక్, జయంత్, తిరుమలేష్, పీడీలు గురు, మణి, లత, మంజుల, చిన్నప్ప, మౌనిక పాల్గొన్నారు. కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు సింహాద్రిపురం : మండల కేంద్రంలో క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంలో ఈద్గా సమీపంలో వెన్నపూసపల్లెకు వెళ్లె దారిలో క్షుద్ర పూజలు పలుమార్లు జరుపుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఆ దారిన తరచూ వెళ్లే రైతులు, అలాగే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. -
రాష్ట్రంలో ప్రజా కంటక పాలన
రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. రాయచోటిలోని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం, అవినీతి, బంధుప్రీతి, దోపిడీలు అధికమయ్యాయని ఆరోపించారు. పథకాల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాలలో భారీగా కోత విధించారన్నారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల పెన్షన్లలో నిజమైన అర్హులకు కూడా కోతకోసి వారికి గుండె కోతను మిగిల్చారన్నారు. చిలమత్తూరులో మహిళా ఎంపీపీపై టీడీపీ నాయకులు భౌతికంగా దాడి చేయడం దారుణమన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సాక్షాత్తు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు సంబంధం లేని పోలింగ్ కేంద్రాలలో దౌర్జన్యం, అరాచకాలకు తెర తీశారన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, కేంద్రం నిధులు దోచేయడమే కూటమి ప్రభుత్వ పాలన పనిగా పెట్టుకొందన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో 1130 సెక్రటరీలకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. మీడియా సమావేశంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి -
విద్యాసాగర్ ఆస్పత్రిలో 500 రొబొటిక్ శస్త్ర చికిత్సలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : బోన్, జాయింట్ కేర్‌లో అద్భుతమైన ప్రయాణంలో మరొక పెద్ద మైలురాయిని విద్యాసాగర్ ఆసుపత్రి అధిగమించిందని, తమ ఆస్పత్రిలో 500 రోబోటిక్ మోకాళ్ల శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో ఆదివారం ఆయన కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నొప్పి నుంచి నూతన జీవితం వరకు ప్రయాణించిన అనేక మంది రోగుల చిరునవ్వులు చూడడం ఆత్మ సంతృప్తిని ఇస్తోందన్నారు. తమ ఆస్పత్రిలో గత 15 ఏళ్లుగా ఎముకలు, కీళ్ల సంరక్షణలో విశేష సేవలందిస్తూ 7500 లకు పైగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ విజయం అధునాతన జాయింట్ రీప్లేస్మెంట్ సాంకేతికతలో ఒక ముందడుగు అన్నారు. రాయలసీమలో జాయింట్ కేర్ కోసం ప్రపంచ స్థాయి సీఓఆర్ఐ రోబోటిక్ సాంకేతికతను పరిచయం చేసిన మొదటి ఆసుపత్రిగా విద్యాసాగర్ హాస్పిటల్ , పాక్షిక, సంపూర్ణ మోకాళ్ల మార్పిడి శస్త్రచిత్సలతోపాటు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. 500 రోబోటిక్ మోకాళ్ల శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకోవడం తమ బృందం అంకితభావానికి, ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, రిటైర్డ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నాగముని రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షుడు డాక్టర్ ఆర్.రంగనాథ రెడ్డి, సైకాలజిస్ట్ ఓవీ రెడ్డి,, కడప నగరంలోని ప్రముఖ డాక్టర్లు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
ఈడబ్ల్యుఎస్ విధానాన్ని ఎత్తివేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని జేఏసీ చైర్మన్ ఎం.రంగనాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటి పట్టణలలోని ఎన్జీఓ హోంలో ఏపీ బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చట్టసభలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. పెన్షనర్ల హక్కులను హరించే ఆర్థిక బిల్లు 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోహిణి కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చింతం నాగరాజు, బీసీఎఫ్ జనరల్ సెక్రటరీ కుమార్‌యాదవ్, డి.శంకర్, బీసీఈ చంద్ర, జిల్లా బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యక్షురాలు దివిటి పద్మయాదవ్, మహిళా సెక్రటరీ కందుకూరి సుమితాగౌడ్, జనరల్ సెక్రటరీ కందుకూరి రామయ్య, జాయింట్ సెక్రటరీ ఎల్.గంగాధర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గంగాధర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, శాత్తుమొర, నివేదన, కుంభారాధన నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు జరిపారు. ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, ధ్వజస్తంభానికి , ఆలయం ఎదురుగా ఉన్న భక్తసంజీవరాయస్వామికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, భక్తులు పాల్గొన్నారు. -
దారిమళ్లిన నాంధేడ్ వీక్లీ!
రాజంపేట: ప్రస్తుతం నాంధేడ్ నుంచి ధర్మవరం మధ్య నడుస్తున్న (07189/17190) వీక్లీ ప్రత్యేక రైలు దారిమళ్లనుంది. ఈ రైలు ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లె, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, నంద్యాల, ఎర్రగుంట్ల , కడప , తిరుపతి, పాకాల మార్గాల్లో నడిచేది. వచ్చే నెల నుంచి ఈ రైలు నిజమాబాద్, పెద్దపల్లె, వరంగల్ , విజయవాడ, గుడూరు, తిరుపతి, పాకాల మీదుగా నడపనున్నారు. ● మొదటిసారిగా పీలేరు, మదనపల్లె, కదిరి నుంచి ఉత్తర తెలంగాణాలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాకు కూడా అనుసంధానం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి పీలేరు, కలికిరి , మదనపల్లె, కదిరి వెళ్లడానికి నేరుగా సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ ప్రత్యేకరైలుతో తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, వికరాబాదు, గద్వాల ప్రాంతాలలో ఇప్పటికే మదనపల్లె, పీలేరు, కలికిరి అనుసంధానమై ఉన్నాయి. ● నాంధేడ్ ప్రత్యేక రైలుతో ఉత్తర తెలంగాణాతో మదనపల్లె , పీలేరుకు రైలుసౌకర్యం లభించినట్లైంది. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఎగువమార్గంలో 4ట్రిప్‌లు, 07190 నంబరుతో ధర్మవరం నుంచి ఈ ఎక్స్ప్రెస్రైలు నడవనుంది. ● ప్రత్యేక ఎక్స్ప్రెస్రైలు 07189 నంబరుతో సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో నాంధేడ్లో సాయంత్రం 4.30కి బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం ధర్మవరం జంక్షన్‌కు 5గంటలకు చేరుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లెరోడ్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఈ రైలులో అధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉన్నాయి. ఐఆర్టీఎస్ పోర్టల్‌లో బుకింగ్ సౌకర్యం కూడా ప్రారంభమైంది. -
సైబర్ చట్టాలపై అవగాహన అవసరం
మదనపల్లె రూరల్ : సైబర్ చట్టాలపై న్యాయవాదులు అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ వి.రాధాకృష్ణ కృపాసాగర్ అన్నారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండ్ సైబర్ లాపై వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లను శిక్షించడం, హానికరమైన ఆన్లైన్ కార్యకలాపాల నుంచి ప్రజలను రక్షించడం, డిజిటల్ డేటాను భద్రపరచడం సైబర్ చట్టాల ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి. వాటిని నిరూపించాలంటే ఏఏ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇచ్చే సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయా లేదా..? ఏఏ పద్ధతుల్లో వాటిని నిరూపిస్తే చెల్లుబాటవుతాయి. వాటిపై వచ్చే అభ్యంతరాలను ఎలా నివృత్తి చేయాలనే అంశంపై న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. అనంతరం మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వి.రాధాకృష్ణ కృపా సాగర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి సూర్యనారాయణమూర్తి, న్యాయమూర్తులు శ్రీలత, సుభాన్, శిరీష, కీర్తన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అమరనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.మనోహర, ఉపాధ్యక్షులు ఎ.వి.శివకుమార్‌రెడ్డి, రెడ్డి నాగులు, ఎం.ఎ.బాషా, అహ్మద్ నజీరుద్దీన్ షేక్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్.వి.రాధాకృష్ణ కృపా సాగర్ -
ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకుకార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడురోజులపాటు పవిత్రోత్సవాలు జరుపుతుంటారు. పవిత్రోత్సవాలలో భాగంగా ఆగస్టు 24న యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, శయానాధివాసం, 25న పవిత్ర సమర్పణ, 26న వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, అర్చకులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలను ప్రారంభించాలి
మదనపల్లె : కూటమి ప్రభుత్వంలో మదనపల్లె వైద్య కళాశాల నిర్మాణం కాసుల కోసమే ఆగిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో రూ.72 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. శనివారం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సీపీఎం నాయకులతో కలిసి మదనపల్లెలో ఆగిపోయిన కళాశాల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023లో పనులు పూర్తిచేసి 2024 లో కళాశాలను ప్రారంభించాల్సి ఉండిందన్నారు. మదనపల్లెలో రూ. 472 కోట్లతో నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పూర్తిగా నిర్మాణాలను ఆపేసి కళాశాలను ప్రారంభించలేదన్నారు. నిర్మాణ ప్రాంతంలో రూ.10 కోట్ల విలువైన సామగ్రి దుస్థితికి చేరిందన్నారు. వైద్య కళాశాల ప్రారంభం కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిశర్మ, రామకృష్ణ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నల్లగుట్టపై పోలీసు పహారా
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ సర్వే నంబర్.15లోని నల్లగుట్టపై బుద్ధవిగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని, బౌద్ధసమ్మేళనం నిర్వహిస్తామని బాస్, దళిత సంఘర్షణ సమితి నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో...పోలీస్, రెవెన్యూ శాఖ నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. శనివారం నల్లగుట్ట చుట్టూ 5 కి.మీ.ల పరిధిలో ప్రజలు గుమికూడకుండా, ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించకుండా పెద్దసంఖ్యలో పోలీసులు పహారా కాశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారిని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర సిబ్బందితో కలిసి అంకిశెట్టిపల్లె పంచాయతీలోని నల్లగుట్ట వద్ద పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు పలుసూచనలు చేస్తూ, బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందును టూటౌన్ సీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు