● హిందీ : వ్యాకరణంతో మెహందీ | - | Sakshi
Sakshi News home page

● హిందీ : వ్యాకరణంతో మెహందీ

Mar 6 2026 8:21 AM | Updated on Mar 6 2026 8:21 AM

● హిందీ : వ్యాకరణంతో మెహందీ

గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ముఖ్యమైన పాఠ్యాంశాలపై దృష్టి సారిస్తే హిందీ లో మంచి మార్కులు సాధించవచ్చు.

1. మొదటి విభాగం (35 మార్కులు): పాసేజ్‌లు: ప్రశ్నపత్రంలోని మొదటి భాగంలో 35 మార్కులకు ప్యాసేజ్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల్లోని ముఖ్య పదాలను ప్యాసేజ్‌లో వెతకడం ద్వారా వీటికి సులభంగా సమాధానం ఇవ్వవచ్చు.

కవి/రచయిత పరిచయం: కవి,రచయిత పరిచయాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఇవి నేరుగా మార్కులు తెచ్చిపెడతాయి.

2. పద్యభాగం:

దోహాలు: పద్యభాగంలోని 4 దోహాలను కంఠస్థం చేస్తే, ఇతర చిన్న ప్రశ్నలను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.

ముఖ్యమైన సారాంశాలు: పద్యభాగం నుండి ‘బరస్తే బాదల్‌’ మరియు ‘కణ్‌–కణ్‌ కా అధికారి’ పాఠ్యాంశాల సారాంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి.

3. గద్యభాగం – ఉపవాచకం:

ముఖ్యమైన పాఠాలు: గద్యభాగం నుండి ‘ఈద్‌గాహ్‌’ మరియు ‘లోక్‌ గీత్‌’ పాఠాలపై పట్టు సాధించాలి.

లఘు ప్రశ్నలు: ‘స్వరాజ్య కీ నీవ్‌’, ‘అంతర్జాతీయ స్థర్‌ పర్‌ హిందీ’, ‘దక్షిణీ గంగా గోదావరి’ పాఠాల నుంచి లఘు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

ఉపవాచకం: ఉపవాచకంలో ‘దో కళాకార్‌’ పాఠంలోని ప్రశ్నలన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. లేఖలు: చుట్టీ పత్ర్‌ , పుస్తక విక్రేతకు లేఖ , ,పితాజీకి లేఖ నేర్చుకోవడం మంచిది. –కరీముల్లా ఖాదర్‌,

మున్సిపల్‌ హైస్కూల్‌ మెయిన్‌, కడప.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement