జవాబులు రాసేటప్పుడు ప్రధానంగా అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. కవి పరిచయాలు, వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు ముఖ్యమైన వాక్యాలను పెన్సిల్‌తో కింద అండర్ లైన్ చేయాలి. అక్షరాలు గుండ్రంగా రాయాలి. అలాగే పద విరామం ఉండాలి. పద్యం ప్రశ్నలు వాక్యరూపంలో రాయాలి. బాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రతి రోజూ 15 నిమిషాలు చదవాలి,రాయాలి. అవగాహన ప్రతి స్పందనతో పాటు భాషాంశాలపై ప్రత్యేక పట్టుసాధిస్తే మంచి మార్కులు సులభంగా వస్తాయి.
– బి.ఉషా సుందరి, ఎస్‌ఏ(తెలుగు),
జెడ్పీహెచ్‌ఎస్.మదనపల్లె


