సీఈసీ మెంబర్‌గా సురేష్‌బాబు! | - | Sakshi
Sakshi News home page

సీఈసీ మెంబర్‌గా సురేష్‌బాబు!

Mar 4 2026 7:31 AM | Updated on Mar 4 2026 7:31 AM

– వైస్సార్సీపీలో క్రియాశీలక భాద్యతలు

సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(సీఈసీ) మెంబర్‌గా మాజీ మేయర్‌ కొత్తమద్ధి సురేష్‌ బాబును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నియమించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, రెండు సార్లు కడప మేయర్‌గా..పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అపార అనుభవం ఉన్న సురేష్‌ బాబును సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా మంగళవారం నియమించారు. బీసీ నాయకుడిగా సర్పంచ్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సురేష్‌ బాబు సేవలను వినియోగించుకునేందుకు అధిష్టానం క్రియాశీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం పట్ల మాజీ మంత్రి ఎస్‌బీ అంజాద్‌ బాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

డీసీఈబీ సెక్రటరీగా

చంద్రశేఖర్‌రావు

కడప ఎడ్యుకేషన్‌: డిస్ట్రిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా జమ్మలమడుగు మండలం ఎస్‌. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న దాయిపూలే చంద్రశేఖర్‌రావు నియమితులయ్యారు. గతంలో డీసీఈబీ సెక్రటరీగా పనిచేస్తున్న విజయభాస్కర్‌రెడ్డి గత నెల 28న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్‌రావును డీఈఓ నియమించారు. ఈ మేరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో డీసీఈబీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.

15 నుంచి ఆర్‌సీపీ యాత్రలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: స్థానిక సమస్యలపై ఈనెల 15 నుంచి యాత్రలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సీపీ)రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌ రెడ్డి తెలిపారు. మంగళవా రం కడపలో ఆయన మాట్లాడుతూ అమెరికా ఆ ర్థిక ప్రయోజనాల కోసం ఇరాన్‌పై చేస్తున్న యు ద్ధం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement