రైతులు ఉద్యాన పంటలపై మొగ్గుచూపాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు ఉద్యాన పంటలపై మొగ్గుచూపాలి

Feb 26 2026 7:42 AM | Updated on Feb 26 2026 7:42 AM

రైతులు ఉద్యాన పంటలపై మొగ్గుచూపాలి

రైతులు ఉద్యాన పంటలపై మొగ్గుచూపాలి

లక్కిరెడ్డిపల్లి: రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలవైపు మొగ్గుచూపాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం లక్కిరెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. అప్పకొండయ్యగారిపల్లిలో ఒక మామిడితోటలో జరిగిన ఉపాధిహామీ పనులను పరిశీలించారు. పంటకు నీటి సౌకర్యం, ఆదాయంపై మామిడి తోట రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం కరువు ప్రాంతంగా ఉండటం వల్ల భూగర్భజలాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నీటి యాజమాన్య సంస్థ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సహజ వ్యవసాయ పద్దతులను రైతులంద రూ అవలంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దిన్నెపాడు గ్రామంలోని కోమటివాని వంక వాటర్‌ షెడ్డును, రామరాజు వంక వాటర్‌ షెడ్డును పరిశీలించిన కలెక్టర్‌ వరిపంట కాకుండా రైతులకు ఆదాయాన్ని ఎక్కువగా ఇచ్చే ఉద్యాన పంటలను పండించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడుతూ వరిపంట కాకుండా ఉద్యాన పంటలవైపు మొగ్గుచూపితే మంచి ఆదాయం వస్తుందని, నీటి వినియోగం తగ్గుతుందని, భూగర్భజలాలను బాగా వినియోగించుకో వచ్చని సూచించారు. లక్కిరెడ్డిపల్లిలోని దొర్రిచెరువును పరిశీలిస్తూ వర్షాకాలంలో పడే ప్రతి బొట్టును చెరువులోకి చేరేలా కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలం, కోనంపేట గ్రాంమలోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ అంగన్‌ వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌ను సందర్శించి .. అక్కడి వసతులను స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే లక్కిరెడ్డిపల్లిలోని ముప్పయి పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరువు ప్రాంతమైన లక్కిరెడ్డిపల్లి మండలంలో ప్రాజెక్టు జలధార ద్వారా భూగర్భజలాలు పెరిగాయని, వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా మరిన్ని నీటి వసతులు పెరుగుతాయని, త్వరలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. తహసీల్దార్‌ క్రాంతి కుమార్‌, ఎంపీడీఓ రెడ్డయ్య, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌డీఈ విద్య, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్‌ విష్ణు, ప్రసాద్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలి

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement