కల్పవృక్ష వాహనంపై నారసింహుడి రాజసం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్పవృక్ష వాహనంపై విహరించారు. స్వామి వారి బ్రహోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం వేకువ జామున మూలవర్లకు తోమాల సేవ నిర్వహించారు. వాహనమండపంలో వాహనాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లను కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి గ్రామపుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. బ్రహోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన శుక్రవారం పెద్దశేషవాహన సేవ ఉంటుందని ఆలయఅర్చకలు గోపాలభట్టర్ తెలిపారు.


