కడప సెవెన్‌రోడ్స్ : మా జీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5వ తేది ప్రొద్దుటూరుకు రా నున్నారు. మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో ఆయన పాల్గొననున్నారు.
● గురువారం ఉదయం 9.30 గంటలకు బెంగుళూరు యలహంక నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు జక్కూరు ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు.
● 10.00 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.10 గంటలకు ప్రొద్దుటూరులోని రామేశ్వరం బైపాస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
● 11.20 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.35 గంటలకు రైల్వేస్టేషన్‌లోని వైవీఆర్ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వెన్యూ వద్దకు చేరుకుంటారు. 11.50 వరకు వివాహ రిసెప్షన్‌లో గడుపుతారు.
● 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.00 గంటలకు రామేశ్వరం బైపాస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
● మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.20 గంటలకు బెంగుళూరులోని జక్కూరు ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు.
● 1.30 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.50 గంటలకు యలహంక నివాసానికి చేరుకుంటారు.


