గాయపడిన వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని గంగనపల్లె దళిత వాడకు చెందిన కందుల దిలీప్(27) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పు అంటించిన సంఘటనలో అతను తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి రుయా ఆస్పత్రిలో దిలీప్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై రుయా ఆస్పత్రిలో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
వ్యక్తిపై దాడి
కడప అర్బన్ : కడప నగరం కటిక వీధికి చెందిన మహమ్మద్ ఇషాక్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన మహమ్మద్ ఇషాక్‌కు ఆకులవీధికి చెందిన వ్యక్తికి మధ్య డబ్బుల విషయమై మనస్పర్థలు ఉండేవి. ఆదివారం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహమ్మద్ ఇషాక్‌పై ఇద్దరు దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానికులు రిమ్స్‌కు తరలించారు. బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేస్తున్నారు.
వివాహిత అదృశ్యం
మైదుకూరు : పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఖదిరూన్ అనే వివాహిత కనిపించడం లేదని అర్బన్ సీఐ రమణారెడ్డి తెలిపారు. తన భార్య శనివారం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త గౌస్ పీర్ ఆదివారం ఫిర్యాదు చేసినట్టు సీఐ పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
అగ్నికి ఆహుతైన అరటి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని వెలమవారిపల్లె పరిధిలో ఉన్న పులివెందులకు చెందిన రైతు రాజా 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి సాగు చేస్తున్నాడు. ఆదివారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రవ్వలు వచ్చి అరటి తోటలో పడటంతో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే అరటి తోట పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.15 లక్షల నష్టం వచ్చినట్లు రైతు వాపోతున్నాడు.
108 వాహనంలో ప్రసవం
కాశినాయన : మండలంలోని మిద్దెల గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే గర్భిణికి శనివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలోనే నారాయణమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రామయ్య, ఫైలెట్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి


