స్పీడ్ బ్రేకర్ తెచ్చిన అనర్థం..
రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు
మదనపల్లెటౌన్ : స్పీడు బ్రేకర్ తెచ్చిన అనర్థానికి ఓ కార్మికుడు బైకు అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై స్థానిక జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురానికి చెందిన శివయ్య కుటుంబంలోని ఏడుగురు రెండేళ్ల క్రితం, మదనపల్లె మండలంలోని సీటీఎం గ్రామానికి వచ్చారు. స్థానింగా ఉన్న ఓ వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శివయ్య కొడుకు వెంకటేష్(22) ఇటుకల బట్టీలో సహచర కార్మికులతో కలసి పనిచేశాడు. చీకటి పడగానే బైకులో ఇంటికి బయలు దేరాడు. సీటీఎం రైల్వే గేటు వద్దకు రాగానే, అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా బైకును నడిపి అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు.వారు ఘటనాస్థలానికి వచ్చి, బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌పై నుంచి కిందపడి..
పుంగనూరు/ మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం రాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. ఘటనపై బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు .. పుంగనూరు మండలంలోని పెద్ద అలసాపురానికి చెందిన సుధాకర్ కొడుకు హేమంత్ పలమనేరులో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరాగానే విధులకు వెళ్లాడు. రాత్రి 10.30 గటల ప్రాంతంలో విధులు ముగించుకుని బైకులో ఇంటికి బయలు దేరాడు. మొరవపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికికి సైడు ఇవ్వబోయి అదుపు తప్పి బైకుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బొలెరో ఢీకొని..
మదనపల్లెటౌన్: బొలెరే ఢీకొని స్కూటిరిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై బుధవారం రాత్రి ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పుంగనూరు – చౌడేపల్లె మార్గంలోని పెట్రోల్ బంకు వద్ద బొలెరో వచ్చి స్కూటర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా, గంగవరం మండలం, గుండుగల్లుకు చెందిన ఆనంద్(40) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని కుటుంబీకులు చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించారు. బాధితునికి కన్ను పూర్తిగా డ్యామేజ్ కావడంతో డాక్టర్ల సలహా మేరకు కుటుంబీకులు ఆనంద్‌ను తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.
స్పీడ్ బ్రేకర్ తెచ్చిన అనర్థం..


