మైనార్టీలకు కుచ్చుటోపీ
బడ్జెట్‌లో ఎక్కడా మైనార్టీ సంక్షేమాన్ని పట్టించుకోలేదు. దుల్హన్ పథకం, విదేశీ విద్య, మైనార్టీల స్కాలర్‌షిప్‌లకు ఒక్క రూపాయి కేటాయించలేదు. మైనార్టీలు వ్యాపారం చేసుకునేందుకు రూ.5లక్షల రుణాలు ఇస్తామన్న చంద్రబాబు దాని కోసం ఎన్ని కోట్లు కేటాయించారో.. చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌లో ఎక్కడ కూడా రంజాన్ తోఫా, మసీదుల మరమ్మతు కోసం నిధులు కేటాయింపు లేదు. మరోసారి మైనార్టీలను నిలువునా వంచించారు.
– అబ్దుల్ కలీమ్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ డైరెక్టర్, వాల్మీకిపురం
మైనార్టీలకు కుచ్చుటోపీ


