వాహనం ఢీకొని జింక మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

Feb 26 2026 7:44 AM | Updated on Feb 26 2026 7:44 AM

వాహనం

వాహనం ఢీకొని జింక మృతి

మదనపల్లెటౌన్‌ : స్థానిక బెంగళూరు రోడ్డులోని రెడీ ఫుడ్స్‌ ఫ్యాక్టరీ వద్ద బుధవారం ఓ వాహనం ఢీకొనడంతో జింక మృతిచెందింది. కళేబరాన్ని స్థానిక పశు వైద్య కేంద్రానికి తీసుకు రాగా ఏడీ రోహిణి పోస్టుమార్టం నిర్వహించారు. జింక కళేబరాన్ని మాదినికొండ అటవీ ప్రాంతంలో ఖననం చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ జయప్రసాద్‌ రావు తెలిపారు.

విష ప్రయోగం : 20కోళ్లు మృతి

చౌడేపల్లె : మండలంలోని చారాల కు చెందిన కుళ్లాయి వెంకటరమణ కు చెందిన పెంపుడుకోళ్లపై బుధవారం విషప్రయోగం చేయడంతో 20 కోళ్లు మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. తనపై వ్యక్తిగత కక్షల కారణంతో ఈ ఘటనకు పాల్పడినట్లు కొందరిపై ఆరోపించారు. మృతిచెందిన కోళ్ల విలువ సుమారు రూ:8 వేలు ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాధు చేసినట్లు చెప్పారు.

నిషేధిత గుట్కా స్వాధీనం

చౌడేపల్లె: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలైన గుట్కా,హాన్స్‌ బయ్యపల్లెకు చెందిన ఓ వ్యక్తి దర్జాగా విక్రయిస్తున్నాడు. స్టాకు నిల్వకోసం ఏకంగా గ్రామీణ ప్రాంతంలో గోదాం ఏర్పాటు చేసిన ఘటన మండలంలోని 29ఏ చింతమాకులపల్లె పంచాయతీ బయ్యపల్లెలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈప్రాంతంనుంచి పలు ప్రాంతాలకు నిషేధిత వస్తువులను ఆర్డర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. గోదాంలో గుట్కా ఉన్నట్లు గుర్తించారు. నిషేధిత గుట్కాను, దీనిని తరలించే టాటా ఏస్‌ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ చిన్నరెడ్డప్పను వివరణ కోరగా స్టాకు విక్రయించరాదని నిర్వాహకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చామన్నారు. కేసు నమోదు అంశంపై ఆరా తీయగా విచారణ చేస్తున్నామని, వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

నీటి తొట్టెలో పడిపోయిన ఆవు

పుంగనూరు: పట్టణంలోని కోనేటిపాళెంలో బుధవారం పాడి ఆవు 15 అడుగుల లోతు గల నీటి సంపులో పడిపోయింది. గమనించిన యజమాని మనోజ్‌కుమార్‌ వెంటనే అగ్నిమాపకశాఖాధికారి సుబ్బరాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన సిబ్బందితో వెళ్లి పాడి ఆవును బయటకు తీశారు.

వాహనం ఢీకొని జింక మృతి 1
1/2

వాహనం ఢీకొని జింక మృతి

వాహనం ఢీకొని జింక మృతి 2
2/2

వాహనం ఢీకొని జింక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement