ఎఫ్‌పీఓల బలోపేతానికి నైపుణ్య శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌పీఓల బలోపేతానికి నైపుణ్య శిక్షణ

Feb 26 2026 7:44 AM | Updated on Feb 26 2026 7:44 AM

ఎఫ్‌ప

ఎఫ్‌పీఓల బలోపేతానికి నైపుణ్య శిక్షణ

సమావేశంలో మాట్లాడుతున్న మహిత

శిక్షణలో పాల్గొన్న జిల్లాల డిపిఎంలు, ఎంపీఎంలు

బి.కొత్తకోట: రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు తమంతట తాము ఏ విధంగా సుస్థిరత సాధించాలి, ఆర్థికంగా ఎలా బలోపేతం కావాలన్న లక్ష్యంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సెర్ప్‌ అదనపు డైరెక్టర్‌ మహిత అన్నారు. బుధవారం మండలంలోని హార్సిలీహిల్స్‌పై తొలిరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా రైతుల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రైతులంతా సంఘటితమై, తమసంస్థలను తామే నడుపుకునే స్థాయికి రావాలన్నారు. ఇందులో భాగంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను మెరుగు పరచడానికి సెర్ప్‌ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు మాట్లడుతూ శిక్షణా కార్యక్రమం లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో రైతు ఉత్పత్తి దారుల సంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఎఫ్‌ పీఓలను బలోపేతం చేసేలా సెర్ఫ్‌ సిబ్బంది సహకరించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాని నిర్వహించిన డిజిటల్‌ గ్రీన్‌ ప్రతినిఽధి సురేందర్‌ శిక్షణా కార్యక్రమంలో రైతుల అవసరాలను ఎలా గుర్తించాలి, వ్యాపార ప్రణాళికలు ఏవిధంగా రూపొందించుకోవాలి, దాని అమలు చేసే విధానాలు, వివిధరకాల వ్యాపార నమూనాల గురించి చర్చించి అవసరాలకు తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకోవాలని వివరించారు. ఎఫ్‌ పీఓల అభివృద్దికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారీపై సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమాన్ని సెర్ప్‌ డిజిటల్‌ గ్రీన్‌, వాసన్‌ సంస్థల ఆద్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి అన్నిజిల్లాల డీపీఎ(జీవనోపాధులు), ఎంపీఎం ఫార్మ్‌లు పాల్గొని ఎఫ్‌ పీఓలను బలోపేతం చేయడానికి కల మార్గాలపై చర్చించారు. ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ శ్రీనివాసులు, సెర్ఫ్‌ ఏడీ లైవ్‌ స్టాక్‌ శ్రీ కులశేఖర్‌ , డిజిటల్‌ గ్రీన్‌ ట్రస్ట్‌ ప్రతినిధి సురేందర్‌ పాల్గొన్నారు.

సెర్ప్‌ అదనపు డైరెక్టర్‌ మహిత

ఎఫ్‌పీఓల బలోపేతానికి నైపుణ్య శిక్షణ1
1/1

ఎఫ్‌పీఓల బలోపేతానికి నైపుణ్య శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement