అగ్ని ప్రమాదంలో టమాట పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో టమాట పంట దగ్ధం

Feb 26 2026 7:44 AM | Updated on Feb 26 2026 7:44 AM

అగ్ని ప్రమాదంలో టమాట పంట దగ్ధం

అగ్ని ప్రమాదంలో టమాట పంట దగ్ధం

మదనపల్లెటౌన్‌ : మదనపల్లె మండలంలో టమాటా పంట దగ్ధమైన సంఘటన బుధవారం సీటీఎం క్రాస్‌ రోడ్డులో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు..మిట్టపల్లె గ్రామానికి చెందిన రైతు పూల వెంకటప్ప తన వ్యవసాయ బోరు వద్ద రెండన్నర ఎకరాల్లో టమాట, ఇతర కూరగాయల పంటలను సాగుచేశాడు. టమాట పంట కోత దశలో ఉండగా, వ్యవసాయ పొలానికి సమీంలో గుర్తు తెలియని వ్యక్తులు పచ్చిక బైళ్లకు మధ్యాహ్నం నిప్పింటించారు. దీంతో టమాటా పంటతో పాటు, డ్రిప్పు, పైపులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిళ్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పంచింది ఆదుకోవాని కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement