ఆపరేషన్‌ వజ్రపహార్‌ విస్పోటనం | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ వజ్రపహార్‌ విస్పోటనం

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

ఆపరేష

ఆపరేషన్‌ వజ్రపహార్‌ విస్పోటనం

చౌడేపల్లెలో రూ.24లక్షల కూల్‌ లిప్స్‌ సీజ్‌

రికార్డులు లేని 28 బైకులు సీజ్‌

మదనపల్లెటౌన్‌: అన్నమయ్య జిల్లా పోలీసులు వజ్రపహార్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ అడ్మిన్‌ వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి మాట్లాడుతూ.. ఆపరేషన్‌ వజ్రపహార్‌ కార్యక్రమంలో భాగంగా చౌడేపల్లెలో రూ.24లక్షల ఖరీదు చేసే కూల్‌ లిప్స్‌ దుకాణాల్లో పట్టుబడినట్లు తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా వెనుక ఉన్న నెట్‌ వర్క్‌ను ఛేదించడానికి ఇది ఒక కీలక ముందడుగు అన్నారు.

మదనపల్లెలో కార్డన్‌ అండ్‌ సర్చ్‌

మదనపల్లె పట్టణం, నీరుగట్టువారిపల్లెలోని కాట్లాటపల్లిరోడ్డు, రామిరెడ్డి లే ఔట్‌ ప్రాంతాల్లో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో 150మంది పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. రికార్డులు సరిగాలేని 28వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. స్థానికంగా వివిధ కేసుల్లో ఉండే రౌడీషీటర్లు, సస్పెక్టులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. గంజాయి, సింథటిక్‌ డ్రగ్స్‌, నిషేధిత పొగాకు ఉత్పత్తుల సరఫరాలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల సమీపంలో ఉన్న దుకాణాలపై నిఘా పెట్టామన్నారు. ప్రజలు సమాచారం ఇస్తే వారి విరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

నాలుగు కూల్‌ లిప్స్‌ కేసులు నమోదు

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వాల్మీకీపురం, రాయచోటి, చౌడేపల్లెలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.24లక్షల విలువచేసే కూల్‌ లిప్‌ .. టొబాకో ప్రోడక్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు. కూల్‌ లిప్‌ ప్యాకెట్లు చిన్నవిగా ఉండి నోట్లో పెట్టుకుంటే నిమిషాల్గో కరిగిపోయి మత్తు ఇస్తాయని తెలిపారు. యువత కూల్‌ లిప్‌ కు అలవాటుపడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లు చెప్పారు. అందుకే హర్యానా ప్రభుత్వానికి కూడా ఈగల్‌ టీం సహకారంతో లేఖ రాశామన్నారు. కూల్‌ లిప్‌ వ్యాపారులపై 7,8 రెడ్‌విత్‌20 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ ను విజయవంతం చేసిన, మదనపల్లె, చౌడేపల్లె, ఈగల్‌ టీం సీఐ రాజారెడ్డి, మహ్మద్‌ రఫీ, ఎస్‌లు నరసింహుడు, నాగేశ్వరరావు, రహీముల్లాలను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.

ఆపరేషన్‌ వజ్రపహార్‌ విస్పోటనం1
1/1

ఆపరేషన్‌ వజ్రపహార్‌ విస్పోటనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement