చింత చెట్టుపై నుంచి పడి కార్మికుడు మృతి
మదనపల్లెటౌన్ : చింత చెట్టుపై నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎరబల్లి పంచాయతి, సిగన్నగారిపల్లెకు చెందిన పూజారి శ్రీనివాసులు కుమారుడు రామచంద్ర, అలియాన్ చంద్రు (35)భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ..తల్లిదండ్రులు, భార్య ఇద్దరు పిల్లలను ఫోషించుకుంటున్నాడు. ఉదయం ఊరికి సమంలోని చింత చెట్టెక్కి చింత కాయలు కోస్తుండగా, ప్రమాద వశాత్తు చెట్టుపై నుంచి కింద పడి అక్కడి కక్కడే మృతి చెందాడు. ముదివేడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గంగజాతరకు ఏర్పాట్లు
పుంగనూరు: జమీందారుల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మార్చి 10, 11 తేదీల్లో జరగనుంది. ఇందు కోసం గురువారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్యాలెస్ ప్రాంతాన్ని పరిశీలించారు.భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు జాతర ఏర్పాట్ల కోసం రూ.10లక్షలను కేటాయించినట్లు తెలిపారు. సీఐ మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పండ్లతోటల పెంపకంపై ఆసక్తి చూపాలి
కేవీపల్లె : జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్లతోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపాలని పీడీ వెంకటరత్నం అన్నారు. గురువారం మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో ఉపాధిలో సాగు చేసిన మామిడి చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే మినీ గోకులం షెడ్లు ఉపాధిలో నిర్మించుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉపాధి సిబ్బంది రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ ఉపాధిలో పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో నాగరాజ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
ప్రేమికుడి ఆత్మహత్య
చంద్రగిరి : తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఆర్‌ఆఫ్ రోడ్డులో విషాదం నెలకొంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సాధిక్(25) అనే యువకుడు గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఏసీ మెకానిక్ షాపులో పనిచేస్తున్న సాధిక్, పనికి రాకపోవడంతో యజమాని గదికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
చింత చెట్టుపై నుంచి పడి కార్మికుడు మృతి
చింత చెట్టుపై నుంచి పడి కార్మికుడు మృతి


