విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలు

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలు

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లెటౌన్‌ : విద్యుదాఘాతంలో ఎలక్ట్రీషియన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలం, బురకాయలకోట గ్రామానికి చెందిన షేక్‌ షావల్లి (25), బి.కొత్తకోట మండలంలోని మద్దూరువాండ్లపల్లెలో ఓ ఇంటికి వైరింగ్‌ చేయడానికి గురువారం ఉదయం వెళ్లాడు. బిల్డింగ్‌ వద్ద పనులు చేసే క్రమంలో మూత్ర విచర్జన కోసం, ఇంటికి సమీపంలోని చెట్ల చాటకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ వైర్లు షేక్‌ షావల్లి తలకు తగలడంతో షాక్‌ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కేకలు విన్న ఇంటి యజమాని చౌడప్ప వెంటనే వెళ్లి విద్యుత్‌ వైర్లను తప్పించాడు. మంటలు వ్యాపిస్తుండగా చల్లార్చి కారులో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లాని సలహా ఇచ్చారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement