హత్యకేసులో నిందితులు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితులు అరెస్టు

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

హత్యకేసులో  నిందితులు అరెస్టు

హత్యకేసులో నిందితులు అరెస్టు

రాయచోటి టౌన్‌ : గాలివీడులో జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్సీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. గురువారం రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాలివీడు మండలం వడిశలంకపల్లె గ్రామం గోరా న్‌ చెరువుకు చెందిన గుర్రం రామకృష్ణారెడ్డి (డీలర్‌ రామకృష్ణారెడ్డి) ఈ నెల 17న మామిడి తోటలో హత్యకు గురయ్యాడు.ఈ కేసులో నిందితులు గుర్రం మహేశ్వరరెడ్డి, తెల్లాకుల కుళాయప్ప, కర్ణ బ్రహ్మ పెద్దారెడ్డి, యక్కంటి తిరుపతిరెడ్డి, గుర్రం విశ్వనాథరెడ్డిలను డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

రాయచోటి : అన్నమయ్య జిల్లా, రాయచోటి పరిధిలోని మిల్క్‌ ప్రొడక్ట్‌ కేంద్రాలపై రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫుడ్‌ సేప్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. గురువారం కడప రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ ఆదేశాల మేరకు కడప విజిలెన్స్‌, ఫుడ్‌ సేప్టీ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. విజయ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌, శ్రీ లక్ష్మీ వెంకటేస్వర మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్‌లలో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్లు శివన్న, శ్రీనివాసులు రెడ్డి, డీసీటీఓలు గీతావాణి, బాబు మోసెస్‌, రాయచోటి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం చైన్నెలోని ప్రయోగశాలకు పంపించారు. పరీక్షా ఫలితాలు వచ్చిన అనంతరం కల్తీలాంటి నమూనాలు రుజువైతే తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

రాయచోటి పట్టణంలో పలు ప్రాంతాలలో జరుగుతున్న పాల విక్రయాలపై ఫుడ్‌ సేప్టీ అధికారులు దాడులు చేశారు.

వేగవంతంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండడంతో ఏర్పాట్లలో వేగం పెంచాలని టీటీడీ సివిల్‌ విభాగం ఈఈ సుమతి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్ట రామాలయం, సీతారాముల కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ సివిల్‌ విభా గం అధికారులు, గుత్తేదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో జరుగుతున్న తాత్కాలిక నిత్యాన్నదానం ఏర్పాట్లు, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను తనిఖీ చేశారు.

మహిళ ఆత్మహత్య

ప్రొద్దుటూరు క్రైం : పేడ రంగు దావ్రణం తాగి కరుమురు సుబ్బలక్షుమ్మ (48) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సుబ్బరాయుడు, సుబ్బలక్షుమ్మ దంపతులు బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం కిడ్నీ దెబ్బతినడంతో సుబ్బరాయుడు పనికి వెళ్లడం లేదు. ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆయన భార్య సుబ్బలక్షుమ్మ మోకాళ్ల నొప్పులు, గ్యాస్‌ ట్రబుల్‌, ఆయాసం సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూపించినా ఆమెకు ఉపశమనం లభించలేదు. ఆ క్రమంలో 25న అర్దరాత్రి దాటిన తర్వాత సుబ్బలక్షుమ్మ పేడ రంగు పొడిని నీళ్లలో కలుపుకొని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఉదయం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement