భూ వివాదంతో అన్నదమ్ములపై దాడి | - | Sakshi
Sakshi News home page

భూ వివాదంతో అన్నదమ్ములపై దాడి

Mar 4 2026 7:32 AM | Updated on Mar 4 2026 7:32 AM

మదనపల్లెటౌన్‌ : కురబలకోట మండలంలో భూ వివాదంతో అన్నదమ్ములపై కర్రలతో దాడి చేశారు. మంగళవారం ఉదయం తెట్టు గ్రామం దిగువపాళ్యంకు చెందిన శంకర (50), నరసింహులు (56)లకు అదే ఊరికి చెందిన రెడ్డెప్ప, రమేష్‌లకు భూ తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భూ వివాదం తలెత్తి రాత్రి ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో నరసింహులు, శంకరపై ప్రత్యర్తులు రెడ్డెప్ప, రమేష్‌లు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు.

యువతి ఆత్మహత్యాయత్నం

మదనపల్లెటౌన్‌ : కడుపు నొప్పి తాళ లేక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం కర్ణాటకలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు మండలం బల్తమర్రి గ్రామానికి చెందిన మంజునాథ్‌ భార్య శ్రావణి(25) కడుపు నొప్పి తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉంది. ఘటనపై ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులు రాయల్పాడు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

ములకలచెరువు : అతిగా మద్యం తాగుడు, పరాయి సీ్త్రతో సంబంధం పెట్టుకున్నావని భార్య, పిల్లలు ప్రశ్నించినందుకు ఒక వ్యక్తి గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని పెద్దపాళ్యంకు చెందిన ఎస్‌.సులేమాన్‌(40) భవన నిర్మాణ కార్మికుడు. ఇతనికి భార్య షాహీనా, ఇద్దరు పిల్లలు సంతానం. ఈ క్రమంలో పరాయి సీ్త్రతో సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలిసింది. దీనిపై ప్రశ్నించడంతో భార్య, పిల్లలతో గొడవపడేవాడు. రెండు, మూడు సార్లు ఊర్లోని పెద్ద మనుషులు పంచాయితీ చేసి సులేమాన్‌ను మందలించారు. ఈ ఆదివారం మరోసారి గొడవ జరగడంతో ఊరి బయట గడ్డి మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రమాదేవి హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించి అక్కడ మృత్యువాత పడ్డాడు. మృతుడి భార్య షాహీనా ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రతాప్‌ కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement