సాక్షి టాస్క్‌ఫోర్స్ : సదుం మండలంలోని భట్టువారిపల్లె ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుట్టను మట్టి కోసం కొందరు తవ్వేస్తున్నారు. కొద్ది రోజులుగా యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇళ్ల స్థలాల మంజూరు కోసం ప్రభుత్వ స్థలం లేకపోవడంతో గుట్టను చదును చేస్తున్నామని, ఇందుకు కలెక్టర్, రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకున్నట్లు మట్టిని తవ్విస్తున్న కూటమి పార్టీ సానుభూతిపరుడు తెలుపుతున్నారు. దీనిపై తహసీల్దారు ప్రమీలను వివరణ కోరగా ఎవరికీ మట్టిని తవ్వేందుకు అనుమతి ఇవ్వలేదని.. రెవెన్యూ అధికారులను పంపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


