పరీక్ష కేంద్రం వద్ద వివాదం | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రం వద్ద వివాదం

Feb 24 2026 7:12 AM | Updated on Feb 24 2026 7:12 AM

పరీక్ష కేంద్రం వద్ద వివాదం

పరీక్ష కేంద్రం వద్ద వివాదం

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె గురుకుల పాఠశాల వద్ద సోమవారం ఉదయం పరీక్షలు రాయడానికి వచ్చిన ఇంటర్‌ విద్యార్థిని బురఖా తొలగించి చెక్‌ చేయడం వివాదాస్పదమైంది. పరీక్ష రాసే విద్యార్థినా కాదా అని తనిఖీ చేయడానికి ఇన్విజిలెటర్‌ మేనక ఆదేశాలతో సిబ్బంది బురఖా తీయాలని విద్యార్థినిని కోరారు. విద్యార్థిని ముఖం కనిపించేలా బురఖా తీసింది. ఆ తర్వాత బురఖా మొత్తం తొలగించాలని కోరడంతో వివాదమైంది. కుటుంబసభ్యులు ఈ విషయమై ప్రశ్నించడంతో వివాదంగా మారింది. అధికారులు, సీఐలు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించడంతో పొరపాటుగా జరిగిన ఘటనగా సిబ్బంది క్షమాపణలు చెప్పడంతో వివాదం సమసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement