సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి
నిమ్మనపల్లె : స్వర్ణ గ్రామ సచివాలయాల సిబ్బంది ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా అధికారి లక్ష్మీపతి అన్నారు. గురువారం ఆయన మండలంలోని రెడ్డివారిపల్లె సచివాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్‌ను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న వివిధ రకాల సర్వేల కు సంబంధించిన ప్రగతి వివరాలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సచివాలయ ఉద్యోగుల పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. చెత్త సేకరణతో పాటు, స్వర్ణ గ్రామ సచివాలయాల పనితీరుపై వచ్చే ఐవీఆర్‌ఎస్ కాల్స్ లో మెరుగైన పనితీరు కనపరచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే తగిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఏఓ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్, పంచాయతీ అభివృద్ధి అధికారి గాయత్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సైక్లింగ్ పోటీలు వాయిదా
మదనపల్లె సిటీ : రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ సైక్లింగ్ పోటీలు వాయిదా వేసినట్లు డీఎస్‌డీఓ చంద్రశేఖర్ తెలిపారు. రాస్ట్ర స్థాయి పోటీలు ఈనెల 28 నుంచి మార్చి 1వతేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా వార్షిక పబ్లిక్ పరీక్షల దృష్ట్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పోటీలు ఏప్రిల్ 4,5 తేదీల్లో జరుగుతాయన్నారు. క్రీడాకారులు, కోచ్‌లు, సంబంధిత ఽఅధికారులు గమనించి సవరించిన తేదీల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.


