చిన్నమండెం: చిన్నమండెం మండలం కొత్తపల్లి పంచాయతీ మాండవ్యానదీ తీరాన వెలసిన మల్లూరమ్మ ఆలయ ఈఓగా కొనసాగుతున్న కొండారెడ్డిపై దేవదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం, అమ్మవారి నగదు లెక్కల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంల్లో కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడం, భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. విచారణ పూర్తయ్యే వరకు కొండారెడ్డిని విధులకు దూరం చేస్తూ ప్రస్తుతానికి తాత్కాలిక ఈఓగా శివయ్యను నియమించారు.
మదనపల్లె సిటీ: ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం డీవైఈఓ, ఎంఈఓ, పరీక్ష కేంద్రాల ఛీప్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఓపెన్ స్కూల్‌క్ష పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు.
మదనపల్లె రూరల్: అన్నమయ్యజిల్లా కేంద్రం మదనపల్లెలో ఏర్పాటుచేసిన జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ప్రారంభించారు. పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కకూన్‌మార్ట్‌కు సమీపంలో అన్ని వసతులతో ఏర్పాటు చేసినట్లు డీఏఓ శివనారాయణ తెలిపారు. జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు నూతన జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి సేవలు అందిస్తామన్నారు. జిల్లా వ్యవసాయశాఖ ఏడీఏ మజీద్ అహ్మద్, మదనపల్లె ఏడీఏ రమేష్‌రాజు, పుంగనూరు ఏడీఏ సి.శివకుమార్ పాల్గొన్నారు.


