విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

ఆర్‌ఎంపీ క్లినిక్‌ సీజ్‌

తిరుపతి క్రైం : తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఓ భవనంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం నూతన కాలువ, దిన్నె వడ్డేపల్లికి చెందిన చెంచయ్య (40)గా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు..అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం నూతన కాలువ, దిన్నె వడ్డేపల్లికి చెందిన చెంచయ్య పెద్దకాపు లేఅవుట్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో పనులు చేస్తున్నాడు. పనులు చేసే సమయంలో చెంచయ్య ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే సహచరులు అతడిని సంకల్ప ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి ఈస్ట్‌ ఎ రామస్వామి తెలిపారు.

మహిళల రక్షణే లక్ష్యం

– జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

మదనపల్లెటౌన్‌: మహిళలకు భద్రత కల్పించడం జిల్లా పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునిబిల్లి పేర్కొన్నారు. శనివారం మదనపల్లెలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీని ఏఎస్పీ వెంకటాద్రితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘శక్తి యాప్‌’ అందుబాటులో ్జట తెచ్చామన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మహిళా రక్షణకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యారంగంలోనూ మహిళలు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారని కొనియాడారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజారెడ్డి, పీఎం రఫీ, మహిళా ఎస్‌ఐ గాయత్రి, డాక్టర్‌ అనురాధ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కారు అమ్మకం పేరుతో మోసం

లబ్బీపేట(విజయవాడతూర్పు): కారు కొనుగోలు చేసేందుకు ఓఎల్‌ఎక్స్‌ను అన్వేషిస్తున్న వ్యక్తి సైబర్‌ మోసగాడికి చిక్కాడు. ముందుగానే ఖాతాలకు లక్షల కొద్దీ డబ్బు బదిలీ చేసిన బాధితుడు ఆనక మోసపోయానని గ్రహించి పోలీసులకు ఆశ్రయించాడు. దీనిపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్ల రెడ్డినగర్‌కు చెందిన యేరువ గురుపూర్ణ భవన నిర్మాణ పనులు చేస్తుంటారు. అతను ఫార్‌ుచ్యనర్‌ కారు కావాలంటూ ఓఎల్‌ఎక్స్‌లో ఉత్తమ ఆఫర్‌ కోసం శోధించాడు. ఈ తరుణంలో అతను ఒక ప్రకటనను గమనించి తన మొబైల్‌ నంబరును పంచుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఫిబ్రవరి 13న అజిత్‌కుమార్‌ పేరుతో ఫోన్‌ చేసి, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో తన సోదరుడి ఇంటి వద్ద ఇన్నోవా క్రిస్టా కారు (ఏపీ 40 సీఆర్‌ 0315) అమ్మకానికి ఉందని తెలిపాడు. దాని విలువ మొత్తాన్ని తనకు బదిలీ చేయాలని చెప్పి, జగ్గయ్యపేటలో వాహనాన్ని డెలివరీ తీసుకోవచ్చని తెలిపాడు. అతడి మాటలు నమ్మిన గురుపూర్ణ వేర్వేరు ఖాతాలకు రూ.15 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అతను ఇచ్చిన ఫోన్‌ నంబరుకు రూ.లక్ష, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌కి రూ.5 లక్షలు ఒకసారి, రూ.85 వేలు మరోసారి, కర్నాటక బ్యాంక్‌ అకౌంట్‌కి రూ.లక్షతో పాటు, మిగిలిన మొత్తాన్ని బెస్ట్‌ జ్యూవెలర్స్‌ ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం అజిత్‌కుమార్‌ తన ఫోన్‌కాల్స్‌కు స్పందించక పోవడంతో మోసపోయానని గ్రహించి శనివారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.దుర్గాప్రసాద్‌ తెలిపారు.

దువ్వూరు : దువ్వూరులో ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ తిరుమలరావు క్లినిక్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వి.మల్లేష్‌ మాట్లాడుతూ క్లినిక్‌కు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రజా ఆరోగ్యానికి విఘాతం కలిగించేలా ఆర్‌ఎంపీలు వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement