కోయాలంటే భయమేస్తోంది
తోటలో టమాటాలు కోయాలంటే భయమేస్తోంది. నేను ఒకటిన్నర ఎకరాలో పంట సాగు చేశాను. మార్కెట్లో ఇప్పుడున్న ధరలు చూస్తే కూలీలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. మళ్లీ ఇప్పుడు ఉన్న పంటను కాపాడుకోవాలంటే రూ. 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
– లక్ష్మీనారాయణ, టమాటా రైతు, శీలంవారిపల్లె
పెట్టుబడి కూడా రావడం లేదు
ప్రస్తుతం టమాటా పంట సాగు చేయడం వల్ల పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మర్కెట్లలో గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. వారం రోజుల నుంచి ధరలు తగ్గిపోతున్నాయి. నెలరోజుల కిందట మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 500వరకు పలికింది. ఇప్పుడు పడిపోతున్నాయి. ఇలా ధరలు పడిపోతుండటంతో భారీగా నష్టపోతున్నాము.
– రెడ్డిమోహన్, గుర్రంకొండ
కోయాలంటే భయమేస్తోంది


