ఎస్‌డీఎసీల నియామకం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌డీఎసీల నియామకం

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

ఎస్‌డ

ఎస్‌డీఎసీల నియామకం

ఎస్‌డీఎసీల నియామకం 10 లోపు బకాయిలు వసూలు చేయాలి సెకండ్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం సైక్లింగ్‌ జట్ల ఎంపిక

మదనపల్లె: జిల్లాకు స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్ల (ఎస్‌డీసీ)ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె ఎస్‌డీసీగా ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పీలేరు హంద్రీ–నీవా ప్రాజెక్టు భూసేకరణ యూనిట్‌–2 ఎస్‌డీసీగా ఎంవీఎస్‌ నారాయణరెడ్డి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 ఎస్‌డీసీగా కె.మాధవకృష్ణారెడ్డిలు నియమితులయాయ్యారు.

మదనపల్లెరూరల్‌: అన్నమయ్య జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో మార్చి 10వతేదీ లోపు నివాస, నివాసేతర పన్నుల వసూళ్లు పూర్తిచేయాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీఓలతో కలిసి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సంబంధించి రూ.27.29 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 15.05 కోట్లు వసూలైందన్నారు.. మిగిలిన బకాయిలను మార్చి 10లోపు వసూలు చేసేలా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు విధిగా పన్నుల వసూళ్లను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ ద్వారానే జరపాలన్నారు. కార్యక్రమంలో జీఎస్‌డబ్ల్యూఎస్‌ లక్ష్మీపతి, డీఎల్‌డీఓ అమరనాథరెడ్డి, డీఎల్‌పీఓ నాగరాజ, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మదనపల్లె పట్టణంలో 11 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. ఎలక్ట్రానిక్‌ వస్తువులు లోపలికి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలో జనరల్‌ 12480 మంది విద్యార్థులకు గాను 12107 మంది హాజరయ్యారు. 373 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్సులో 968 మంది విద్యార్థులకుగాను 919 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి రవి తెలిపారు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లి, రాయచోటిలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.

మదనపల్లెఅర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు మంగళవారం స్థానిక జడ్పీహైస్కూల్లో జిల్లా సైక్లింగ్‌ అండర్‌–18 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్‌ జట్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలికల విభాగంలో పి.నిహారిక, ఎమ్‌.తనూష, ఎస్‌.సరిత, కె.పవిత్ర, ఎమ్‌.మేఘన, ఎస్‌.ఉమ్మేజైనబ్‌, ఎల్‌.శరణ్యలు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో టి.మధుసూదన్‌, పి.చరణ్‌కుమార్‌, జి.మహ్మద్‌అనీస్‌, ఎ.సంజయ్‌ధర్‌రెడ్డి, పి.పూర్ణేంద్‌, టి.జ్యోతీష్‌, జి.లోహిత్‌, పతుగ్రంజన్‌లు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 28, మార్చి ఒకటో తేదీన ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయన్నారు.

ఎస్‌డీఎసీల నియామకం 1
1/2

ఎస్‌డీఎసీల నియామకం

ఎస్‌డీఎసీల నియామకం 2
2/2

ఎస్‌డీఎసీల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement