అడ్డుకుంటే.. అంతు తేలుస్తాం ! | - | Sakshi
Sakshi News home page

అడ్డుకుంటే.. అంతు తేలుస్తాం !

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

అడ్డు

అడ్డుకుంటే.. అంతు తేలుస్తాం !

కురబలకోట : కురబలకోట మండలం నార్లపల్లి చెరువు నుంచి టిప్పర్లతో మట్టి తోలుతున్న టీడీపీ వర్గాన్ని.. అదే పార్టీ వారు గ్రామస్తులతో కలసి అడ్డుకున్న ఆసక్తికర సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన వారి మధ్య చెరువు మట్టి వివాదం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతమాకులపల్లి సచివాలయ పరిధిలో నార్లపల్లి చెరువు ఉంది. ఎవరికి మట్టి కావాలన్నా మొదట ఈ చెరువు గుర్తుకు వస్తుంది. అధికార పార్టీ నాయకులు కూడా ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి చెరువు నుంచి మట్టి తోలుకోవడానికి రైతుల పేరుతో అనుమతి తీసుకున్నట్లు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. అయితే నాలుగు టిప్పర్లతో రెండు రోజులుగా మట్టి తోలుతున్నారు. ఈ మట్టిని సరాసరి సమీపంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ భూమి చదునుకు తోలుతున్నారు. దీనిని గ్రహించిన చెరువు పక్కనున్న పుల్లగూరవాండ్లపల్లి గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం మట్టి లోడుతో వస్తున్న టిప్పర్లను పల్లె వద్ద నిలిపివేశారు.

చినబాబు పేరుతో బెదిరింపులు

ఈ విషయాన్ని డ్రైవర్లు మదనపల్లిలో తమ నాయకులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రెండు కార్లలో కొందరు యువకులు వచ్చి గ్రామస్థులపై రౌడీ యిజం చేశారు. ‘మట్టి తోలేదే మీవల్ల ఏమవుతుంది.. అడ్డుకోండి చూద్దాం.. మీ సంగతి తేలుస్తాం’ అంటూ గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులను బెదిరించారు. ఏమవుతుంది మీవల్ల అంటూ.. బెదిరింపులకు దిగారు. అంతేగాకుండా చినబాబు పేరుతో ఫోన్‌ చేయించి మరీ బెదిరించారు. ఎవరు అడ్డు వస్తారో చూస్తా.. అంటూ చినబాబు పేరుతో హెచ్చరికలు ఇచ్చినటు్‌ల్‌ గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పక్కనే ఉన్న గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రౌడీయిజం చేస్తున్న మట్టి మాఫియాపై ఎదురు తిరిగారు. ప్రతిఘటించారు. పరిస్థితి తారుమారు కావడంతో రౌడీలు అక్కడి నుంచి వచ్చిన కార్లలోనే మెల్లగా జారుకున్నారు. మట్టి తోలితే సహించేది లేదని గ్రామస్తులు గట్టిగా హెచ్చరించారు. ఇరిగేషన్‌ అధికారులు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతి ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాదాగిరి చేసిన రౌడీ మూకలు వారి వెనుక నుంచి నడిపిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు, రైతులు తెలిపారు. కాగా మట్టి మాఫియా బెదిరింపు దోరణులకు దిగడం అధికార పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. మట్టి మాఫియాకు చెందిన అధికార పార్టీ మద్దతుదారులే ఆ గ్రామంలోని టీడీపీ నాయకుడు సదాశివపై దౌర్జన్యానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తనపై రౌడీయిజం చేశారని సదాశివ తదితరులు కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఉన్నతాధికారులు వీరి ఆగడాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకే పార్టీకి చెందిన వారి మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకోవడం అటు పార్టీలోనూ ఇటు అధికార యంత్రాంగంలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని బరితెగిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

మట్టి మాఫియా రౌడీలను నిలదీస్తున్న పుల్లగూరవాండ్లపల్లి గ్రామస్తులు

చెరువు మట్టి తోలుతున్న టిప్పర్లను నిలిపేసిన గ్రామస్తులు

గ్రామస్తులపై మట్టి మాఫియా దాదాగిరి

ప్రతిఘటనతో వెనుదిరిగిన రౌడీలు

రైతుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌కు

చెరువు మట్టి

అధికార పార్టీ మధ్య రగిలిన వివాదం

అడ్డుకుంటే.. అంతు తేలుస్తాం !1
1/1

అడ్డుకుంటే.. అంతు తేలుస్తాం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement