వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు

వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు

వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు

కడప రూరల్‌: వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం హెల్త్‌ అసిస్టెంట్‌ నుంచి హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా పదోన్నతుల కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. జోన్‌–4 రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం 9 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం పదోన్నతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్‌ వెంకటసుబ్బమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement