గురుకులాల్లో విలువలతో కూడిన విద్య | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో విలువలతో కూడిన విద్య

Feb 28 2026 7:24 AM | Updated on Feb 28 2026 7:24 AM

గురుకులాల్లో విలువలతో కూడిన విద్య

గురుకులాల్లో విలువలతో కూడిన విద్య

గురుకులాల్లో విలువలతో కూడిన విద్య

కేవీపల్లె: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో విలువలతో కూడిన విద్య అందిస్తున్నట్లు డీఈవో సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం మండలంలోని గ్యారంపల్లె ఏపీఆర్‌జేసీ ఆధ్వర్యంలో మదనపల్లెలో డీఈవో చేతుల మీదుగా 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ గల గ్రామీణ పేద విద్యార్థులకు ఏపీ గురుకుల పాఠశాలలు వరంలాంటివని పేర్కొన్నారు. ఉచిత వసతి, సంరక్షణ, పోషక విలువలతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన విద్య తోపాటు క్రీడలు, కళలు, ఆరోగ్యం, వినోదం లభిస్తాయని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి తోపాటు 6,7,8వ తరగతిలలో మిగిలిన సీట్లకు, జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపు ఏపీఆర్‌ఎస్‌.ఏపీసీఎఫ్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని తరగతులలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్‌ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్యారంపల్లె ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణాంజనేయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

డీఈవో సుబ్రమణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement