కోతల నాయుడు
చేతుల్లో మోసకొస్తున్న యువతి పేరు అస్మా. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. పింఛన్‌కు అన్ని విధా ల అర్హురా లిగా ఉన్నప్పటికీ అందడం లేదు. పలుమార్లు ప్రభుత్వ అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. ప్రభుత్వం తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని బాధిత యువతి కోరుతోంది.
వృద్ధాప్య పింఛన్లు – 1,03,276
వితంతువు పింఛన్లు – 44,677
దివ్యాంగ పింఛన్లు – 22,857
అభయహస్తం పింఛన్లు – 6,024
చేనేత పింఛన్లు – 2,999
డప్పు కళాకారుల పింఛన్లు – 2,356
ఒంటరి మహిళల పింఛన్లు – 4,465
పెరాలసిస్ పింఛన్లు – 1,002
ట్రాన్స్‌జెండర్ల పింఛన్లు – 74
సీఎం చంద్రబాబునాయుడువి అన్నీ కోతలే. మాటల్లో కోతలు... చేతల్లో కోతలు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛనూ మంజూరు చేయకపోగా.. ఉన్నవికూడా కోత కోసి కోతల‘నాయుడ’ని నిరూపించారు. దివ్యాంగులపై దయ లేదు. వృద్ధులపై కనికరమన్నదే లేదు..అవును.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుకు‘పింఛన్’ఇద్దామనే ‘సామాజిక’స్పృహే లేదు.. బాబు సర్కారు కొలువుదీరాక ఒక్క పింఛన్ ఇవ్వక
పోవడమే దీనికి నిదర్శనం.
సాక్షి అన్నమయ్య: టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. బాబు సర్కార్ కొలువుదీరి 20 నెలలు దాటినా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకే మోక్షం దక్కలేదు. జిల్లాలో 1,94,168 పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లన్నీ గత ప్రభుత్వంలో మంజూరైనవే. కొత్తగా అర్హత కలిగిన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితోపాటు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పింఛన్ల కోసం ఆశగా చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అర్హులైన పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం వెబ్‌సైట్ తెరవకపోవడంతో అర్హులైన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
తెరుచుకోని వెబ్‌సైట్
చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి జూన్‌కు సరిగ్గా రెండేళ్లు అవుతుంది. అయితే ఇప్పటివరకు పింఛన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు తెరుచుకోలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్నా వీలు పడటం లేదు. ఇప్పటికే జిల్లాలో సుమారు 10 వేల మంది వరకు దరఖాస్తు దారులు ఎదురుచూస్తున్నారు.
ఏదీ మానవత్వం
జిల్లాలో ప్రతి సోమవారం మదనపల్లెలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పండుటాకులు, దివ్యాంగులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీకొత్త పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. సదరం సర్టిఫికెట్లు చేతబూని పదేపదే తిరుగుతున్నా అయ్యో పాపం అనేవారు లేరు. పండుటాకులు కూడా మాకు పింఛన్ ఇవ్వండి మహాప్రభో అంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులు అప్పటికప్పుడు ఓదార్చి పంపుతున్నారు తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పండుటాకులు, దివ్యాంగుల పట్ల అప్పటికప్పుడు మానవత్వంతో కొత్త పింఛన్ రూపంలో సాయం చేసే పరిస్థితి లేకపోవడం బాఽధితులను కృంగ దీస్తోంది.
జిల్లాలో పింఛన్ల వివరాలు
ఒక్క కొత్త పింఛనూ ఇవ్వని కూటమి సర్కారు..పైగా పింఛన్ల కోతలు
నేటికి అందుబాటులోకి రానిప్రభుత్వ వెబ్‌సైట్
అధికారుల చుట్టూ తిరుగుతున్న అర్హులు
టీడీపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
కోతల నాయుడు


