మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘా పెంచండి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లెటౌన్: మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, జీరో టోలరెన్స్‌తో కలిపి వినియోగించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ ధీరజ్‌తో కలసి పోలీస్, రెవిన్యూ, విద్య, వైద్య, ఎకై ్సజ్ అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ కమిటితో సమావేశశం జరిగింది. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలపై చేపడుతున్న కార్యక్రమాలు, డ్రోన్లను వినియోగించి చేపట్టిన దాడులు, నమోదైన కేసులు, ఆరువందలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు గంజా, కూల్ లిప్స్, మాదక ద్రావ్యాల వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటే సమాచారం ఇవ్వాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక జిల్లా ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని ఎస్‌హెచ్‌ఓలు ఈగల్ క్లబ్ సభ్యులు, ఎన్‌జీవోలు, పోలీస్ శాఖతో కలసి డ్రగ్స్ వద్దుబ్రో..కార్యక్రమంపై గోడపత్రికలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆవిష్కరించారు.
దేశ అభివృద్ధికి జనగణన గణాంకాలు
బలమైన పునాది
మదనపల్లె రూరల్: దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది అని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన 2026 జనగణన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులకు జనగణన దశ–1, గృహ జాబితా, గృహగణనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు, కచ్చితమైన,పారదర్శక సమాచార సేకరణ అవసరమన్నారు. వీటితోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే ఏడీ భరత్‌కుమార్, డీపీఓ రాధమ్మ పాల్గొన్నారు.


