గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగువారు సురక్షితంగా ఉండాలి. అక్కడి ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయం జారీ చేసే సూచనలు, మార్గదర్శకాలను రచ్చితంగా పాటించాలి. కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన చాలా మంది గల్ఫ్‌దేశాలకు జీవనోపాధి కోసం వెళ్లారు. వారికి అత్యవసర పరిస్థితి వచ్చినా లేదా సహాయం అవసరమైనా ఏమాత్రం సంకోచించకుండా వారి బంధువులు నా కార్యాలయాన్ని వెంటనే సంప్రదిస్తే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను. తెలుగువారి క్షేమానికి కృషి చేస్తాను.
– పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు, రాజంపేట


