సదుం: టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. మండలంలోని చీకలచేనుకు చెందిన పలువురు టీడీపీ సానుభూతి కుటుంబాలు గురువారం వైఎస్సార్ సీపీలో చేరాయి. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. రానున్న రోజులలో చేరికలు మరింత ఉంటాయని వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో నటరాజు, చంద్రశేఖర్, సిద్ధేశ్వరి, మీనా, సుహాసిని, మల్లికార్జున, కృష్ణమ్మ, చిన్నప్ప, జయసింహా, వెంకటరామయ్య, ఓబయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డెప్పరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గణేశ్‌రెడ్డి, భగీరథ రెడ్డి, గుణశేఖర్, రమేశ్ రెడ్డి, మునిరాజ, చిన్నయ్య, రాజన్న, వినాయక తదితరులు పాల్గొన్నారు.


