నేడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాక

Feb 24 2026 7:12 AM | Updated on Feb 24 2026 7:12 AM

నేడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాక

నేడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాక

రెండు రోజుల పాటు పర్యటన

మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరిక.. ప్రజలతో మమేకం

25వ తేదీ నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్టలో పాల్గొననున్న మాజీ సీఎం

పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24వ తేదీ నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని యలహంకలో ఉన్న తన నివాసం నుంచి జక్కూర్‌ ఎయిరోడ్రోమ్‌కు బయలుదేరుతారు. 2.50గంటలకు అక్కడికి చేరుకుంటారు. 3గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా పులివెందులకు బయలుదేరారు. 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 3.55గంటలకు రోడ్డు మార్గాన పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌కు బయలుదేరుతారు. 4గంటలకు క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకం కానున్నారు. 7.05గంటలకు క్యాంపు ఆఫీస్‌ నుంచి తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. 25వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేంపల్లె మండలం నందిపల్లె శివాలయం టెంపుల్‌కు బయలుదేరుతారు. 10.30గంటలకు శివాలయం వద్దకు చేరుకుంటారు. 10.30గంటల నుంచి 11.30గంటల వరకు నందిపల్లె శివాలయం విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. 11.30గంటలకు తన క్యాంపు ఆఫీస్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 12.30 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 12.30గంటల నుంచి 2.25గంటల వరకు ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. 2.25గంటలకు బయలుదేరి 2.30గంటలకు క్యాంపు ఆఫీస్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నారు. 6.25గంటలకు తన క్యాంపు ఆఫీస్‌ నుంచి బయలుదేరి తన నివాసానికి బయలుదేరుతారు. 6.30గంటలకు తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement