ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
మదనపల్లె సిటీ/రాయచోటి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవి రాయచోటిలోని పోలీసుస్టేషన్ చేరుకుని ప్రశ్నపత్రాలు పరిశీలించి చీప్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు ఆఫీసర్ల ద్వారా పంపారు. రాయచోటిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. తొలి రోజు జిల్లాలో జనరల్ విభాగంలో 14012 మంది విద్యార్థులకు గాను 13420 మంది, ఒకేషనల్ 1191 విద్యార్థులకుగాను 1022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ రవి తెలిపారు. మదనపల్లెలో 11 పరీక్షా కేంద్రాలోల పరీక్షలు జరిగాయి. పలువురు తల్లిదండ్రులతో విద్యార్థులతో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చారు. విద్యార్థులను హాల్‌టిక్కెట్లు పరిశీలించి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


