●కీలక పాత్ర... పెద్ద తలకాయదే ! | - | Sakshi
Sakshi News home page

●కీలక పాత్ర... పెద్ద తలకాయదే !

Feb 24 2026 7:12 AM | Updated on Feb 24 2026 7:12 AM

●కీలక

●కీలక పాత్ర... పెద్ద తలకాయదే !

●కీలక పాత్ర... పెద్ద తలకాయదే !

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా పోలీస్‌శాఖపై వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు.. న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమంది ఖాకీల పనితీరుకు అద్దంపడుతున్నాయి. ఏ క్షణంలో కూటమి కొలువుదీరిందోగానీ ..ఆ మరుక్షణం నుంచే ఖాకీలు అవినీతి ఊబిలోకి జారుకున్నారు. ప్రజల మాన, ప్రాణ, ఆస్తులు కాపాడడం కంటే వ్యక్తిగత ఎజెండా కోసమే కొందరు పోలీసు అధికారులు అత్యధిక ప్రాధ్యానత ఇస్తున్నారు. ముఖ్యంగా అసాంఘిక శక్తులపై కరుకుదనం తగ్గించి.. సివిల్‌ పంచాయతీలు, భూ తగాదా సెటిల్మెంట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. పైగా ప్రశ్నించే వారిపై ఎదురుదాడికి దిగుతూ చట్ట ప్రయోగాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. ఛాలెంజింగ్‌ కేసులు చేధించడంలోనూ విఫలమవుతున్నారు. గండికోటలో బాలిక హత్య కేసు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

ఏకపక్ష చర్యల్లో పులివెందుల సబ్‌ డివిజన్‌....

జిల్లాలో ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. ప్రత్యేకించి పులివెందుల సబ్‌ డివిజన్‌ పోలీసులపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది. ఆ మధ్య టీడీపీ మహానాడు సందర్భంగా మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ కూడళ్లకు టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారు. ఇది మంచి పద్ధతి కాదు, వైఎస్‌ విగ్రహాలకు ఉన్న టీడీపీ తోరణాలు తొలగించాలంటూ అధికారులతోపాటు పులివెందుల డీఎస్‌పీకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఆయా సర్కిళ్లల్లో టీడీపీ జెండాలు తొలగించాలి. అలా చేయకపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొంతమంది వైఎస్‌ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు మాత్రమే తొలగించారు. అదే అదునుగా భావించి టీడీపీ నేత విజయ్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. పులివెందులలో క్రియాశీలకంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేతల్ని కేసులో చేర్చారు. అంతటితో ఆగకుండా ముగ్గురు మైనర్‌ బాలురులను కూడా కేసులో చేర్చారు. ఇదే విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా జెండాలు తొలగిస్తే హత్యాయత్నం కేసు ఎలా అవుతుందని హైకోర్టు సైతం ప్రశ్నించింది.

● అదృశ్యమైన బాలిక కుటుంబ సభ్యులు భావోద్వేగంతో పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తే పోలీసుస్టేషన్‌ డ్యూటీ కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 190 తొలగించాలని ఉత్తర్వులివ్వడం విశేషం. ఇవన్నీ మచ్చుకు మాత్రమే.. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

ప్రక్షాళనపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ

పోలీసుశాఖలో కొంతమంది అధికారులపై నిత్యం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమంది అధికారులు చట్టాన్ని విస్మరించి, ఏకపక్ష చర్యలే ఏకై క అజెండాగా పనిచేస్తున్నారు. ఇంకొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తదనకుగుణంగా చర్యలకు దిగుతున్నారు. పోలీసుశాఖలో అంతర్గతంగా అనేక అనైతిక చర్యలు తెరపైకి వస్తున్నా యి. గతంలో కడప టూటౌన్‌, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన నాగార్జున, గోపాల్‌రెడ్డిపై లైంగిక వేధింపులు ఆరోపణలు సైతం వచ్చాయి. ఇలా ఇరోపణలు తెరపైకి రాగానే ప్రక్షాళన దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పలువురు వాపోతున్నారు.

● కడప సబ్‌ డివిజన్‌ పరిధిలోని ‘చిన్న’స్టేషనే అయినా సెటిల్మెంట్లకు ‘చౌక్‌’గా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పైసలివ్వందే ఏ ఫైలూ కదలదని పలువురు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల తగాదా విషయమై స్టేషన్‌ మెట్లెక్కినా ముక్కుపిండి లంచం వసూ లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్‌ బాస్‌ స్పందించి ప్రక్షాళన చేపడితే ఖాకీ లు దారిలోకి వస్తారు.. లేకుంటే అవినీతి ఊబిలోకి జారిపోవడం ఖాయమని పలువురు విశ్లేషిస్తున్నారు.

శభాష్‌ ఏసీబీ...

కడప ఏసీబీ డీఎస్పీగా సీతారామరావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. వెంటనే తనదైన శైలిలో చర్యలకు సిద్ధమయ్యారు. కడప రిమ్స్‌లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. తాజాగా పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌లను రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండడగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈఘటనతో ఒక్కమారుగా పోలీసుశాఖ ఉలిక్కిపడింది. ఉన్నతస్థాయి అధికారుల ప్రోత్సాహంతో రూరల్‌ సీఐ వెంకటరమణ చట్టాన్ని ఏకపక్షంగా నడిపించడంలో క్రియాశీలకంగా వ్యవహారించేవారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఏసీబీ డీఎస్పీ సీతారామారావు చట్టాన్ని పరిరక్షించడంలో తనవంతు పాత్ర నిర్వహించడంతో ప్రజానీకం నుంచి శభాష్‌ అన్పించుకుంటున్నారు. ఉన్నతాధికారులు చట్టాన్ని రక్షిస్తూ అవినీతికి అస్కారం లేని పోలీసు వ్యవస్థ కోసం ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని పలువురు కోరుతున్నారు.

‘పచ్చ’పాలనలో పోలీస్‌ వ్యవస్థపై

అవినీతి మరక!

ప్రక్షాళన దిశగా అడుగులు వేయని

యంత్రాంగం

జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర

ఎస్‌ఐ, సీఐలు లంచం తీసుకుంటూ

ఏసీబీకి పట్టుబడిన వైనం

ఏసీబీపై ప్రశంశలు కురిపిస్తున్న ప్రజానీకం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పులివెందుల పట్టణ సీఐ, ఎస్‌ఐలు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. వీరి వెనుకే ఉంటూ.. వారి అవినీతిలో పాలుపంచుకుంటూ.. వారిని నిత్యం అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న‘పెద్ద’ తిమింగళంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారని ప్రజలు కోరుతున్నారు. పులివెందులలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులివెందుల డివిజనల్‌ స్థాయి అధికారి, రూరల్‌ సీఐలు ఏరికోరి పోస్టింగ్‌ వేసుకున్నారు. అప్పటి నుంచి వీరి అవినీతికి అంతు లేకుండా పోయింది. డివిజనల్‌ స్థాయి అధికారికి సాక్షాత్తూ ఎస్పీతో సంబంధం లేకుండా రాయలసీమ రేంజ్‌ అధికారి అండదండలు ఉండటంతో తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా అక్రమ కార్యకలాపాలు కొనసాగించారు. ఇతని అక్రమ కార్యకలాపాలకు టీడీపీ అధినాయకుల మద్దతు పూర్తిగా ఉంది. టీడీపీ నాయకులు చేసే అక్రమ కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్న డివిజనల్‌ స్థాయి అధికారికి టీడీపీ నాయకులతోపాటు ప్రతి వ్యవస్థలో నెల నెలా మామూళ్లు వస్తున్నాయి. దీనికి ప్రస్తుతం ఏసీబీ అధికారులకు చిక్కిన సీఐ మధ్యవర్తిత్వం వ్యవహరించి అన్ని తానై వ్యవహరించాడన్న విమర్శలు ఉన్నాయి.

అక్రమ బియ్యం రవాణా..

పులివెందుల తాలుకాలో నిత్యం అక్రమ బియ్యం రవాణా జరుగుతోంది. అంకాలమ్మగూడూరు మండల కేంద్రంగా టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల క్వింటాళ్ల బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక టీడీపీ నాయకులతోపాటు పులివెందుల డివిజనల్‌స్థాయి అధికారికి, సీఐకి, ఎస్‌ఐకి నిత్యం మూమాళ్లూ అందుతున్నాయి. ఇటీవల అంకాలమ్మగూడూరు ప్రాంతంలో ఉన్న వీరి షెల్టర్‌కు బియ్యం సరఫరా చేయని వ్యక్తులను సదరు టీడీపీ నాయకులు పోలీసులతో పట్టించారు.. అందుకు సంబంధించిన బియ్యం సరఫరా ఆటో ఇప్పటికీ సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఉంది. ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

ఇటీవల పులివెందుల డివిజనల్‌ స్థాయి అధికారి వేముల మండలంలో జరుగుతున్న పలు మైనింగ్‌ నిర్వాహకులను పిలిపించుకుని భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. మైనింగ్‌ నిర్వాహకులు ప్రతి నెలా టీడీపీ నాయకులతోపాటు తమకూ మా మూళ్లు ఇవ్వాలని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలి సింది. పులివెందుల నియోజకవర్గంలో జరుగుతు న్న ప్రతి అసాంఘిక కార్యకలాపానికి డివిజనల్‌ స్థాయి అధికారి పూర్తి అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తే ఇక్కడి డివిజనల్‌ స్థాయి అధికారి అక్రమాలు పూర్తిగా బయట పడే అవకాశం ఉంది. ఆ విధంగా ఏసీబీ అధికారులు దృష్టి సారించి దాడులు చేయా లని పలువురు ప్రజలు కోరుతున్నారు.

సీఐ రమణ ఇళ్లల్లో ఏసీబీ అధికారుల సోదాలు

పులివెందుల రూరల్‌ : పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పులివెందులలోని స్థానిక నారాయణ పాఠశాల, కూరగాయల మార్కెట్‌ సమీపాలలో ఉన్న సీఐ వెంకటరమణ ఇళ్లల్లో ఏసీబీ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 7.30గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఇంటిలోని బంగారు, డబ్బు, పత్రాలను బ్యాగ్‌లో వేసుకుని బయటకు పోతున్న హోంగార్డు ప్రసాద్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకుని ఇంటి ఆవరణలో విచారిస్తున్నారు. రూరల్‌ సీఐ వెంకట రమణకు ఇద్దరు భార్యలు కావడంతో నారాయణ పాఠశాల వద్ద ఉన్న ఇంటిని సోమవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఉన్న మరో ఇంటిని ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. పిల్లలనుంచి పెద్దల వరకు ఎవరిని బయటకుపోకుండా ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. అప్పటికే ఒక ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోవడంతో ఇంటిలో ఉన్న హోంగార్డ్‌ ప్రసాద్‌ రెడ్డి 20 కిలోల బంగారు, నగదు, ఇంటి పత్రాలకు సంబంధించిన వాటిని బ్యాగులో వేసుకొని బయటికి వస్తుండగా.. బయటే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉంచడంతో సీఐ భార్యను పిలిపించి తాళాలు తీసిన అనంతరం ఇంటిలో సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు నారాయణ పాఠశాల సమీపంలో ఉన్న సీఐ ఇంటి వద్దకు రావడంతో అర్బన్‌ సీతారామిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఏసీబీ అధికారులతో మాట్లాడారు.

పోలీసుశాఖలో అవినీతి అధికారులు కొనసాగుతున్నారు. డైరెక్టుగా డీఎస్పీలు అయినోళ్లు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రొద్దుటూరులో గుట్కా, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నతాధికారి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

– గతంలో అసెంబ్లీ వేదికగా

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యాఖ్యలు.

జమ్మలమడుగు కేంద్రంగా విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారు. దేవగుడికి చెందిన వ్యక్తులు లక్షలల్లో జూదం ఆడిస్తున్నారు. కుటుంబాలు సర్వనాశనం అవుతోన్నాయి. వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ స్పందించి జూదం క్లబ్‌లను కట్టడి చేయండి.

– బీజేపీ ఎంపీ రమేష్‌నాయుడు బహిరంగ లేఖ.

భావోద్వేగంతో ఉత్పన్నమైన ఘటనలో పోలీసుస్టేషన్‌లో పూలకుండీలు పగిలిపోతే హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 190 తొలగించండి, అండర్‌ సెక్షన్‌ 35(3)ద్వారా నోటీసు జారీ చేసి విచారించండి. క్రైమ్‌ నెంబర్‌ 254/2025 కేసులో పులివెందుల పోలీసులపై హైకోర్టు సీరియస్‌.

– 7241/2025 రిట్‌ పిటిషన్‌లో హైకోర్టు ఆగ్రహం

●కీలక పాత్ర... పెద్ద తలకాయదే ! 1
1/1

●కీలక పాత్ర... పెద్ద తలకాయదే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement