బోయకొండ హుండీ రాబడి రూ:59.69లక్షలు | - | Sakshi
Sakshi News home page

బోయకొండ హుండీ రాబడి రూ:59.69లక్షలు

Feb 24 2026 7:12 AM | Updated on Feb 24 2026 7:12 AM

బోయకొ

బోయకొండ హుండీ రాబడి రూ:59.69లక్షలు

చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.59.69లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.59,35,839 రూపాయలు, బంగారం 38గ్రాములు , వెండిి 155 గ్రాములు సమకూరినట్లు తెలిపారు.. వీదేశీ కరెన్సీ నోట్లతో పాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ:34,024, ఉచిత అన్నదాన పథకం నిర్వహణ కోసంఏర్పాటుచేసిన ప్రత్యేక హుండీ ద్వారా రూ.13,495 సమకూరినట్లు చెప్పారు. ఈ ఆదాయం 45 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిట్టెమ్మ, ఏఎస్‌ఐ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ

గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల అంకురార్పణ సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ నిర్వహించారు. ఆలయంలో కలశస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వస్తివచనం, పుణ్యాహవచనం కావించారు. అనంతరం రక్షాబంధనం, మృత్యంగ్రహణం, అంకురార్పణ వైభవంంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవాల కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

బోయకొండ హుండీ రాబడి రూ:59.69లక్షలు 1
1/1

బోయకొండ హుండీ రాబడి రూ:59.69లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement