‘మా కుటుంబంలో ముగ్గురికి పరిహారం రావాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నీరు నిల్వ ఉన్నా మాకు మాత్రం ఇప్పటివరకు ఐదు పైసలు కూడా అందలేదు. ఊరు విడిచి వచ్చేశాం.. ఇక్కడ బతకడం భారమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి.‘
– పురుషోత్తం, దొరువుపల్లి, కొండాపురం
భూములకు అవార్డులు ఇవ్వాలి..
‘గండికోట ముంపు కింద 500 ఎకరాల భూమి పోయింది. అధికారులు ఇప్పటివరకు అవార్డులు పాస్ చేయలేదు. ప్రస్తుతం ఆ భూములు నీటిలో ఉండటంతో పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం ఇవ్వాలి.‘
– హరినారాయణరెడ్డి, తాళ్లప్రొద్దుటూరు
మండలిలో ప్రశ్నించాను..
‘ముంపువాసులకు పరిహారం అంశాన్ని శాసనమండలిలో ప్రశ్నించాను. ఇళ్లు, భూములు కోల్పోయిన 14 గ్రామాల వారిక గత ప్రభుత్వం ప్రకటించిన రూ. 3.25 లక్షలతో పాటు, ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షలు కలిపి రూ. 5.25 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ


