జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్
మదనపల్లెఅర్బన్: ప్రజాసమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్ ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో పాల్గొని ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయాశాఖల పరిధిలోని పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ మొత్తం 285 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, ఆయాశాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
కొన్ని అర్జీల వివరాలు..
మదనపల్లె మండలం సీటీఎం గ్రామానికి చెందిన సయ్యద్‌ఖాన్ వస్త్రవ్యాపారి. ఆయన సోదరుడు దావుద్ ఆస్తి గొడవల్లో భాగంగా గోల్‌మాల్ చేసేందుకు సయ్యద్‌ఖాన్ మరణించినట్లు గత నెలలె డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. దీంతో బాధితుడు తాను బతికుండగానే ఆస్తి కోసం డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తన తమ్ముడు దావుద్, సర్టిఫికెట్ మంజూరు చేసిన అప్పటి తహసీల్దార్, ఆర్‌ఐ రెడ్డెప్ప, వీఆర్వో ప్రదీప్, సెక్రటరీ పవన్‌కుమార్‌లపై కఠినచర్యలు తీసుకోవాలని కోరాడు.
రామాపురం మండలం నల్లగుట్టపల్లె హరిజనవాడకు చెందిన చిన్నప్ప గ్రామస్తులతో కలసి కోదండ రామస్వామి ఆలయ స్థల వివాదంపై కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాడు. గ్రామానికి చెందిన కదిరయ్య అనే వ్యక్తి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటూ గ్రామంలో గొడవలు పెడుతున్నాడని, చర్యలు తీసుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలంటూ విన్నవించాడు.
కలికిరి మండలం గుట్టపాళెం పంచాయతీ ఓడమాండ్లపల్లెకు చెందిన సాలి ఆంజనేయులు ఆటోడ్రైవర్. అతడిని ఓ కేసులో ముద్దాయిగా ఇరికించి రెండేళ్లపాటు పోలీసులు గ్రామ బహిష్కరణ చేశారు. అయితే కలికిరి సీఐ ఊరిలోకి రానీయకుండా, ప్రత్యర్థులతో కుమ్మకై ్క ఇబ్బంది పెడుతున్నాడంటూ బాధితుడు ఆంజనేయులు తన భార్యాపిల్లలతో కలసి ఫిర్యాదు చేశాడు.
మదనపల్లెలోని జగన్‌కాలనీకి చెందిన మస్తాన్‌వలీ, అజిమున్నీసాలు తమ భూములను రెవెన్యూ అధికారులు నివాస గృహాలకు తీసుకున్నారని, అయితే ఐదేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా..ఇంతవరకు తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపలేదన్నారు. పైగా ఎనిమిదిమందికి మరోచోట భూమి ఇచ్చారని, తమకు ఇవ్వలేదన్నారు. తమకు న్యాయం చేయాలంటూ అర్జీ ఇచ్చారు.


