శంకర్‌కు ఇన్‌చార్జి పదవి ఇవ్వొద్దు
మదనపల్లె అర్బన్: తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పదవి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్‌కు ఇవ్వొద్దంటూ టీడీపీ నేతల ధ్వజమెత్తారు. శనివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.తులసీధర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. శంకర్ తంబళ్లపల్లె నియోజకవర్గానికి వలస నేత అన్నారు. అలాంటి వ్యక్తికి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పడం బాధాకర మన్నారు. దీన్ని నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇన్‌చార్జిని ప్రకటించాలనుకోవడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కష్టపడిన వారిని పక్కనబెట్టి వలస నేతకు కట్టబెట్టరాదని తెలిపారు. అలా చేయడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


