అడుగడుగునా లోపాలు
జిల్లాలో ఆవులు: 251900
గేదెలు: 100500
పాల ఉత్పత్తి: 12,57,060 లీటర్లు
పాలు సేకరిస్తున్న డైరీలు:
దొడ్ల, విజయ, తిరుమల, శ్రీజ, సంఘం
నాణ్యతప్రమాణాలు
పాటించకపోతే చర్యలు
జిల్లాలోని అన్ని పాల సేకరణ కేంద్రాలపై పాల నాణ్యతను తనిఖీలు చేయాలని పశువైద్యాధికారులను ఆదేశించాం. ఈనెల 25 నుంచి పరిశీలనలు కొనసాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై ల్యాబ్ పరీక్షల అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – గుణశేఖర్‌పిళ్లై
జిల్లా పశువైద్యాధికారి
రాయచోటి: ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగనిదే దినచర్య ప్రారంభించని వారు ఎందరో ఉన్నారు.. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పాల గిన్నె బయటికి తీసి బాగా మరిగించి కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్ లాంటివి కలుపు కొని సేవిస్తారు. రుచిగా లేకున్నా వేడిగా ఉండటంతో తాగేస్తేంటారు. పసిపిల్లలకు సైతం ఆ పాలనే బుడ్డీలో పోసి తాపిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో పాల నాణ్యత గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదే అదనుగా వ్యాపారులు లీటర్ పాలు మూడు లీటర్ల నీళ్లతో కలిపి విక్రయించడం, మిగిలిన వాటిని ఫ్రిజ్‌లలో భద్రపరచి మరుసటి రోజు.. ఆపై రోజున వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నా వారు దుకాణాలు, హోటళ్లలో తనిఖీలకు మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. వాటిల్లో కూడా నామమాత్రపు సోదాలతో సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
రాజమహేంద్రవరంలో జరిగిన పాల సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్‌సేఫ్టీ, పశుసంవర్ధక శాఖ ఇతర అధికారులు దాడులు చేస్తున్నా.. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కొందరు పాలలో నీళ్లు కలిపితే.. మరికొందరు చిక్కదనం కోసం మైదాపిండి, గంజి కలుపుతున్నారు. మార్కెట్లో లభించే తాజా పాలు అన్నది నేతిబీర చందంగా అన్నట్లు ఉంది.
జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది డైరీలకు పాలు పోస్తున్నారు. కొందరు గ్రామాల్లో దుకాణాలు పెట్టుకుని పాలు విక్రయించే వారికే అమ్ముతున్నారు. మరి కొందరు ఇంటింటికీ వెళ్లి పాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. అన్నమయ్య జిల్లాలో 12,57,060 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి అయ్యే పాలలో 9.5 లక్షల లీటర్లు డైరీలకు పంపుతున్నారు. మిగిలిన 3.7 లక్షల పాలు గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి వెళ్లి పోస్తున్నారు. పేరున్న డైరీలకు సరఫరా చేసే పాలలో సైతం రోజుల తరబడి నిల్వ ఉండటం, ౖడైరీ నుంచి ప్యాకెట్లలో ఫ్యాట్ లేకుండా అందుతున్నాయి. ఇక ఇళ్లకు వచ్చే వ్యాపారులు నిల్వ చేసుకునేందుకు శాసీ్త్రయ అధునాతన పద్ధతులను అవలంభించడం లేదు. రైతుల నుంచి సేకరించే పాలు రెండు రోజుల పాటు నిల్వ ఉంచుకునేందుకు వంటసోడా, రసాయనాలు వాడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. పాలలో నీళ్లు కలిపినా చిక్కగా ఉండేందుకు పెరుగుగడ్డ కట్టేందుకు మైదాపిండి, గంజి, బియ్యపు పిండిని వాడుతున్నారు.
సర్వం కల్తీమయం..మనిషికి ప్రధాన
ఆహారాల్లో ఒకటైన పాలు కూడా కాలకూట విషంలాగా మారి ప్రాణాలను హరిస్తున్నాయి. రైతుల నుంచి సేకరించిన పాలను వ్యాపారులు లాభాల కోసం సేకరించిన రోజు కాకుండా..నిల్వ చేసి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. ఇలా నిల్వ చేసే క్రమంలో శాసీ్త్రయ ప్రమాణాలను పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో
విక్రయించే పాలలో 90 శాతం నిల్వ
ఉంచినవే కావడం గమనార్హం.
స్వచ్ఛత నేతిబీర చందం
అధికార, అనధికార డైరీల్లోనూ కల్తీ..
అడుగడుగునా లోపాలు


