మదనపల్లెటౌన్ : జిల్లాలో సంచలం రేకెత్తించిన మదనపల్లె మండలం, అరవాండ్లపల్లె దివాకర్ హత్య కేసు పై తల్లి పూల లక్ష్మీదేవి వ్యాఖ్యలు చేడం చర్చినీయాంశంగా మారింది. తన బిడ్డ దివాకర్‌ను అతని స్నేహితుడు గణేష్ మరికొంత మంది క్రూరంగా చంపారని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి పిర్యాదు చేయడానికి గ్రామస్తులతో కలసి వచ్చింది. మండలంలోని వలసపల్లి గ్రామం, అరవవాండ్లపల్లెకు చెందిన పూల లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు దివాకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. హత్యపై దివాకర్ తల్లి మీడియా తో మాట్లాడుతూ.. తన బిడ్డను గణేష్ మరి కొందరు చంపి, కాళ్లు, తల వేరు చేశారని పేర్కొంది. కిడ్నీలను తొలగించి కర్ణాటకకు చెంది డాక్టర్ గోపాల్ కు అమ్మేశారని తెలిపింది. అంతే కాకుండా పొట్ట పేగులు బయటకు తీసి చెట్టుపై వేలాడేశారని చెప్పడం దుమారం లేపుతోంది. పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.


