ఉగాదికి 16వేల గృహ ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

ఉగాదికి 16వేల గృహ ప్రవేశాలు

Feb 26 2026 7:42 AM | Updated on Feb 26 2026 7:42 AM

ఉగాదికి 16వేల గృహ ప్రవేశాలు

ఉగాదికి 16వేల గృహ ప్రవేశాలు

ఉగాదికి 16వేల గృహ ప్రవేశాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

పీలేరురూరల్‌: జిల్లాలో ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.73 లక్షలు, జిల్లాలో 16,800.. పీలేరు నియోజకవర్గంలో 2,048 గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా హౌసింగ్‌ పీడీ రమేష్‌ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు హౌసింగ్‌ నిర్మాణంపై చైతన్యం కల్పించి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని తొమ్మిది లే అవుట్లలో విద్యుత్‌ సౌకర్యం ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.47 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

మదనపల్లె సిటీ: దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌ సూచించారు. స్థానిక అనపగుట్ట శ్రీవారినగర్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో భారీ ఎత్తున దొంగతనం జరిగిన నేపథ్యంలో కమిటీ సభ్యులతో బుధవారం మాట్లాడారు. భద్రత దృష్ట్యా వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు.

వెబ్‌ల్యాండ్‌లో పొందుపరచాలి

రామసముద్రం: దేవాలయ భూములు రెవిన్యూ వెబ్‌ ల్యాండ్‌ లో పొందుపరచాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం రామసముద్రం తహసీల్దార్‌ అజారుద్దీన్‌తో దేవాలయ భూముల విషయమై సమీక్షించారు. మండలంలోని పలు ఆలయాలకు సంబంధించి భూములు ఇతరుల పేరుపై ఉన్నాయని, వాటిని వెంటనే రెవిన్యూ వెబ్‌ ల్యాండ్లో దేవాలయాల పేరు మీద మార్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement