సోంపాళ్యం దీపస్తంభంపై తెలుగు శాసనాలు | - | Sakshi
Sakshi News home page

సోంపాళ్యం దీపస్తంభంపై తెలుగు శాసనాలు

Mar 5 2026 7:31 AM | Updated on Mar 5 2026 7:31 AM

ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యంలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ దీపస్తంభంపై తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనా స్వామి వెల్లడించారు. బుధవారం ఆయన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆలయాలు శిల్ప సంపద శాసనాలపై పరిశోధనలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఆలయం ముందున్న ద్వజస్తంభాన్ని దీపస్తంభంగా వర్ణించారు. ఈ దీపస్థంభం పీఠంపై రెండు తెలుగు శాసనాలను గుర్తించినట్లు చెప్పారు.్ఙశుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుదయ్ఙ.. మరోవైపు ‘జయసంవత్సరం’అని రూపు చెదిరిన శాసనాలను గుర్తించినట్లు తెలిపారు. సంవత్సరం పేరును తెలుగు అక్షరాలను బట్టి విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయల హయాం 1529 – 1542 లో శాసనాన్ని రాశారని, శాసన కాలం సామాన్య శకం 1534 అని అన్నారు.దీపస్తంభం శాసనాన్ని బట్టి సోంపాళ్యం శ్రీ చెన్నకెశవస్వామి ఆలయ నిర్మాణం 1534 నాటికి పూర్తయిందని, దీపస్తంభాన్ని అద్భుత శిల్ప కళా సంపదతో తీర్చిదిద్దారని చిత్రకారుడు పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement