పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

పుష్ప

పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు

వల్లూరు : పుణ్యక్షేత్రమైన పుష్పగిరి వద్ద పెన్నా నది నీటిలో మునిగి ఆదివారం ఇద్దరు విద్యార్థులు గల్లంతవగా, మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన చైతన్య (25), కొండాపురం మండలం గండ్లూరు గ్రామానికి చెందిన శ్రీనాథ్‌ (23) కడపలోని అన్నమాచార్య కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ శ్రీనాథ్‌ సమీప బంధువు, కడప నగరంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పని చేస్తున్న కొండాపురం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సురేంద్రతో కలిసి ఆదివారం సరదాగా గడపడానికి వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు వచ్చారు. అక్కడి నుంచి సమీపంలోని పుష్పగిరి వద్దకు వచ్చిన ముగ్గురు ఈత కోసం పెన్నా నది నీటిలోకి దిగారు. ఈత కొట్టే క్రమంలో శ్రీనాథ్‌, చైతన్య నదిలో ఎక్కువ లోతు ఉన్న ప్రదేశంలో నీటిలో మునిగిపోయారు. వారితోపాటు ఉన్న సురేంద్ర అతి కష్టం మీద ఈత కొడుతూ పుష్పగిరి కొండ వైపున ఒడ్డుకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివనాగిరెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ట్యూబుల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే సమయం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.

సురక్షితంగా బయటపడ్డ మరో యువకుడు

శ్రీనాథ్‌ (ఫైల్‌) చైతన్య (ఫైల్‌)

పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు 1
1/2

పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు

పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు 2
2/2

పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement