వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగిస్తాం | - | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగిస్తాం

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగిస్తాం

వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగిస్తాం

మదనపల్లె రూరల్‌ : పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు చేస్తున్న రిలేదీక్షలు గురువారానికి నాలుగోరోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని అమ్మచెరువుమిట్ట ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. వేతనం పెంచే వరకు పోరాటం కొనసాగిస్తామని, అంగన్‌వాడీల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అన్నమయ్యజిల్లా అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు మధురవాణి మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని ప్రతిపక్షనాయకుడి హోదాలో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆరేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు అలాగే ఉన్నాయని, దీంతో తాము కష్టాలు పడుతున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలపై ఉదాసీనంగా ఉండటం వల్లే రిలే నిరాహారదీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ అమలుకు నిబంధనలు రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్‌ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. మేనెల అంతా వేసవి సెలవుల జీఓ ఇస్తూ, లబ్దిదారులకు బియ్యం, ఆయిల్‌, కందిపప్పు క్వాంటిటీ పెంచాలన్నారు. మెనూ చార్జీలు పెంచి గ్యాస్‌ ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేసి, పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ కార్యదర్శి గంగాదేవి, సభ్యులు శ్యామల, విజయలక్ష్మి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

నాలుగోరోజుకు చేరుకున్న

అంగన్‌వాడీల రిలేదీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement