గుర్రంకొండ: మార్కెట్‌యార్డుల్లోని టమాటా మండీల్లో చిన్నక్రీట్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా మార్కెటింగ్‌శాఖ ఏడీఏ త్యాగరాజు అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డులోని టమాటా మండీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్బంగా 25 కేజీల క్రీట్ల స్థానంలో 15కేఈల క్రీట్ల విధానం ఎంతవరకు అమలవుతొందో పరిశీలించారు. అనంతరం వ్యాపారులతో మాట్లాడుతూ యార్డులో 58 మండీలకుగాను 39 మండీలు నిర్వహించడం లేదన్నారు. మిగిలిన 19 మండీలకుగాను ఎనిమిది మండీలలో మాత్రమే చిన్నక్రీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్‌తోపాటు మార్కెట్‌కమిటీ అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 2 నుంచి తప్పనిసరిగా చిన్నక్రీట్లు అమలు చేయాల్సి ఉందన్నారు. అప్పట్లో వ్యాపారులు దీనికి అంగీకరించారన్నారు. అయితే ఇంకా కొంతమంది చిన్న క్రీట్ల విధానం అమలు చేయకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆరు రోజుల్లోగా మండీలలో అన్ని చిన్న క్రీట్లు ఏర్పాటు చేసుకొంటామని వ్యాపారులు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటి కార్యదర్శి సునీల్, సూపర్‌వైజర్ నయాబ్‌భాషా, వ్యాపారులు పాల్గోన్నారు.
● జిల్లా మార్కెటింగ్‌శాఖ ఏడీఏ త్యాగరాజు
● టమాటా మండీలలో ఆకస్మిక తనిఖీలు


