నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
రాయచోటి జగదాంబసెంటర్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రామన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
సర్కిల్ స్థాయిలోనూ...
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటన ద్వారా ఆదివారం కోరారు.
ఫోన్ నంబర్లు: తిరుపతి: 8712652679, చిత్తూరు: 7993147979, అన్నమయ్య: 9440817449, కడప: 085622425457


