నిత్యసాధన..టెన్‌షన్‌ ఛేదన | - | Sakshi
Sakshi News home page

నిత్యసాధన..టెన్‌షన్‌ ఛేదన

Mar 3 2026 8:06 AM | Updated on Mar 3 2026 8:06 AM

నిత్యసాధన..టెన్‌షన్‌ ఛేదన

మదనపల్లె సిటీ: పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక ఘట్టం. ఈ ఫలితమే చాలా వరకు వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున కుస్తీ పడుతున్నారు. మార్చి 16వతేదీ నుంచి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సబ్జెక్టు ఉపాద్యాయులు సూచనలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 124 పరీక్ష కేంద్రాల్లో 22,149 మంది పరీక్షలు రాయబోతున్నారు. ఈ విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులు పలు సూచనలు ఇలా చేస్తున్నారు.ఒత్తిడిని అధిగమించాలని, ప్రణాళికతో చదవాలని సూచిస్తున్నారు.

ప్రత్యేక సాధన అవసరం

ప్రశ్నపత్రం చాలా సులభతరం చేసిన నేపథ్యంలో పేరాగ్రాఫ్‌ ప్రశ్నలన్నింటికీ నిదానంగా జవాబులు రాయాలి. కవి పరిచయాలు బాగా రాయడం అభ్యాసం చేయాలి. బ్లూప్రింట్‌ ఆధారంగా 4 మార్కుల ప్రశ్నలకు, ఉపవాచకంలోని 2 పాఠాల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.1,2,4,5 పాఠాల సారాంశాలపై ప్రత్యేక దష్టి పెట్టాలి. లేఖ, వ్యాసం బాగా నేర్చుకోవాలి. మాదిరి ప్రశ్నాపత్రంలలోని వ్యాకరణాంశాలు, విభాగాల వారీగా బాగా అభ్యాసం చేయాలి. మంచి దస్తూరి, అక్షరదోషాలు లేని జవాబులు వుండేటట్లు జాగ్రత్త పడితే మంచి మార్కులు సాధించగలరు.

–ఏ.వసుధ, ఎస్‌ఏ, (హిందీ),

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వాల్మీకిపురం

స్మార్ట్‌ ప్రిపరేషన్‌ ముఖ్యం

పదో తరగతి పిల్లలు పబ్లిక్‌ పరీక్షలకు వెళ్లే ముందు ఫిజికల్‌ సైన్స్‌లో మంచి మార్కులు సాధించడానికి స్మార్ట్‌ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానంగా పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన చిత్రపటాలు, డయాగ్రమ్స్‌, విద్యుత్‌ వలయాలు, ప్రయోగశాల పరికరాల అమరికలను ప్రాక్టీస్‌ చేయాలి. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ స్కోరు తెచ్చుకోవచ్చు. నిర్వచనాలు రాసేటప్పుడు కచ్చితమైన పాయింట్లను అండర్‌లైన్‌ చేయాలి.

– వరప్రసాద్‌,ఎస్‌.ఏ(పీఎస్‌),జెడ్పీహెచ్‌ఎస్‌, ముదివేడు

ఇంగ్లీష్‌లో ప్రత్యేక జాగ్రత్తలు

ఇంగ్లీష్‌ పరీక్షకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. ప్రధానంగా వకాబులరీ సాధన చేయాలి. గ్రామర బాగా చదువుకుంటే 40 మార్కులకు 30 మార్కులను సులభంగా పొందవచ్చు. అలాగే లెటర రైటింగ్‌పై ప్రత్యేక ప్రాక్టీస్‌ చేసి, వ్యాకరణ దోషాలు లేకుండా దస్తూరితో రాయాలి. దోషాలు లేకుండా స్పష్టంగా రైటింగ్‌ ఉండాలి.

– అలియాబేగం, ఎస్‌ఏ(ఇంగ్లీష్‌), రెడ్డివారిపల్లె,

చిన్నమండ్యం మండలం

పదీ పరీక్షలకు సమీపిస్తున్న గడువు

కీలక పాయింట్లు రాస్తేనే

ఉత్తమ మార్కులు

సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల

సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement