ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి

మదనపల్లె సిటీ : ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్‌ఎంయూ కృషి చేస్తున్నట్లు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో ఆర్టీసీ ఉద్యోగులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ స్థితిగతుల గురించి వివరించారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు నిత్యం అందుబాటులో ఉండి, చేయాల్సిన సంక్షేమ సర్వీసులు, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.వీ.రమణారెడ్డి వివరించారు. ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్‌ శివారెడ్డి ఉద్యోగుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో జోనల్‌ అధ్యక్షులు పి.వినోద్‌బాబు, రాష్ట్ర నాయకులు బాబు చెంచులయ్య, మహేశ్వరి రత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement