ఈ ఏడాది గణితం ప్రశ్నపత్రంలో సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ కొన్ని మార్పులు జరిగా యి. వీటిని గమనించి చదివితే మంచి మార్కు లు సాధించవచ్చని గాంధీనగర్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు.
1. ప్రశ్నపత్రంలో కీలక మార్పులు: గతంతో పోలిస్తే ఈసారి కొన్ని అధ్యాయాల్లో మార్కుల కేటాయింపు మారింది:
బహుపదులు: 1 మార్కు ప్రశ్న ఒకటి, 2 మార్కుల ప్రశ్న ఒకటి వచ్చే అవకాశం ఉంది.
రేఖీయ సమీకరణాల జత: 1 మార్కు ప్రశ్న ఒకటి వస్తుంది.
వృత్తాలు: 1 మార్కు ప్రశ్న ఒకటి అడుగుతారు.
సంభావ్యత: ఈ విభాగం నుండి 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
2. వెనుకబడిన విద్యార్థుల కోసం
‘పాస్’ వ్యూహం: గణితంలో వెనుకబడిన విద్యార్థులు భయం వీడి, క్రింది పాఠ్యాంశాలపై దృష్టి పెడితే సులభంగా 63 మార్కుల వరకు సాధించవచ్చు:
● వాస్తవ సంఖ్యలు (చాప్టర్ 1)
● బహుపదులు (చాప్టర్ 2)
● రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత (చాప్టర్ 3)
● నిరూపక రేఖాగణితం (చాప్టర్ 7)
● సాంఖ్యక శాస్త్రం (చాప్టర్ 13)
సంభావ్యత (చాప్టర్ 14)
3. స్కోరింగ్ టిప్స్: ముఖ్యంగా 1, 3, 7, 13, 14 అధ్యాయాలు మిగతా వాటితో పోలిస్తే సుల భంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే గ్రేడ్ సాధించడం సులభమవుతుంది. – సురేష్, మ్యాథ్స్, గాంధీనగర్ హైస్కూల్, కడప


